టైప్ 2 మధుమేహం : type 2 diabetes in telugu
ప్రస్తుతం మారుతున్న జీవన విధానం కారణంగా అందరూ మధుమేహం వ్యాధి భారిన పడుతున్నారు. మధుమేహం వ్యాధి మొత్తం మూడు రకాలు. అందులో మొదటిది టైప్ 1 రెండవది టైప్ 2 మూడవది జెస్టేన్షినల్ మధుమేహం . ఇప్పుడు మనం టైప్ 2 మధుమేహం వ్యాధి గురించి తెలుసుకుందాం.
టైప్ 2 మధుమేహం అంటే ఏమిటి ? What is the type 2 diabetes
ప్రస్తుత కాలంలో మధుమేహం ( type 2 diabetes in telugu ) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే మధుమేహం ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిలో కనిపిస్తుంది. టైప్ 2 మధుమేహం రావడానికి ముఖ్య కారణం ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ అవ్వడం మరియు ఒకవేళ ఉత్పత్తి అయిన ఇన్సులిన్ని శరీరంలోని కణాలు వినియోగించుకోకపోవడం. అంతేకాకుండా వయస్సు పెరుగుతున్న కొద్దీ టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా డాక్టర్స్ చెప్తున్నారు.
టైప్ 2 మధుమేహం ఎవరిలో కనిపిస్తుంది ?
ఈ టైప్ 2 మధుమేహం ముఖ్యంగా వయస్సు పైబడిన వృద్ధుల్లో కనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో 30 దాటిన వారిలో కూడా ఈ షుగర్ వ్యాధి వస్తుంది.
టైప్ 2 మధుమేహం వ్యాధి రావడానికి కారణాలు : cause for type 2 diabetes
1.ఉబకాయం :
ప్రస్తుత కాలంలో ఉబకాయమే ఒక పెద్ద సమస్య గా మారింది. ఉబకాయం మూలంగానే టైప్ 2 మధుమేహం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.
2.బద్ధకస్తులు :
ఈ కాలంలో చాలా మంది ఎటు కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండడం మరియు ఎలాంటి పనులు చేయకుండా తిని కూర్చోవడం ఇలా ఉండే వారిలో టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
3.వృద్ధాప్యం :
టైప్ 2 షుగర్ రావడానికి వయస్సు పెరగడం కూడా ఒక కారణం ఎందుకంటే వయస్సు పెరిగిన కొద్దీ మన శరీరంలోని కణాలు ఇన్సులిన్ ని సరిగా తీసుకోకపోవడం అలాగే మన శరీరంలో వచ్చే మార్పుల వల్ల కూడా మధుమేహం వస్తుంది.
4.వంశపారంపర్యం :
టైప్ 2 మధుమేహం చాలా వరకు వంశపారపర్యంగా కూడా వస్తుంది. కుటుంబంలో తాతలకు ముత్తాతలకు మధుమేహం ఉన్న వారి వారసులకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
5.పి సి ఓ ఎస్ (PCOS) :
ఆడవారిలో టైప్ 2 మధుమేహం రావడానికి pcos కూడా ఒక కారణం కావచ్చు.
టైప్ 2 మధుమేహం లక్షణాలు : type 2 diabetes symptoms
1.అధికంగా దాహం వేయడం మరియు నాలుక పొడిబరాడం.
2.అధికంగా మూత్ర విసర్జన చేయడం.
3.ఆహారం తీసుకున్నాక కూడా ఇంకా తినాలని అనిపించడం.
4.శరీరం పై ఏర్పడిన గాయాలు నెమ్మదిగా తగ్గడం.
టైప్ 2 మధుమేహం ఎలా నివారించాలి ? How to prevent Type 2 diabetes
టైప్ 2 మధుమేహాన్ని ( type 2 diabetes in telugu ) కొందరిలో పూర్తిగా నివారించే అవకాశం ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు. కొందరికి మాత్రం నియంత్రణలో పెట్టుకోవడం మాత్రమే సాధ్యమని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు పూర్తిగా నివారించే మందులు ఇంకా రాలేదు. టైప్ 2 షుగర్ ని అదుపులో పెట్టుకొని ఎప్పటిలాగే సాధారణ జీవితాన్ని జీవించవచ్చు. అందుకు కొన్ని నియమాలు పాటిస్తే చాలు.
1.అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గితే చాలు షుగర్ లెవెల్స్ తగ్గుతాయని డాక్టర్స్ చెప్తున్నారు.
2.సరైన ఆహారం తీసుకోవడం.
3.టైప్ 2 షుగర్ ఉన్న వారు రోజు ఉదయం లేవగానే వ్యాయామం చేయడం మంచిది.
4.రోజు ఉదయం రన్నింగ్, కార్డియో చేయడం వలన టైప్ 2 షుగర్ అదుపులో ఉంచవచ్చు.
5.తియ్యటి ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి.
6.ఉదయం పూట హెర్బల్ టీ తాగడం మంచిది.
7.ఒకే దగ్గర కూర్చోకుండా అటు ఇటు ఆక్టివ్ గా తిరగాలి.
8.రోజు 7 గంటలు నిద్ర పోవాలి.
9.తీసుకునే ఆహారంలో ఎక్కువగా కూరగాయలు మరియు పళ్ళు ఉండేలా చూసుకోవాలి.
10.ఎక్కువ ఒత్తిడి కారణంగా కూడా షుగర్ పెరుగుతుంది. కాబట్టి రోజు శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలి.
ఇలా మంచి ఆహారం తీసుకొని వ్యాయామం చేయడం వలన టైప్ 2 మధుమేహ వ్యాదిని అదుపులో పెట్టవచ్చు. మంచి ఆరోగ్యంతో జీవితాన్ని జీవించవచ్చు అని డాక్టర్స్ సూచిస్తున్నారు.
టైప్ 2 మధుమేహం వలన ఏర్పడే దుష్ప్రబావాలు : type 2 diabetes complications
టైప్ 2 మధుమేహం అదుపులో లేకుంటే శరీరంలోని షుగర్ అన్ని అవయవాలని దెబ్బ తీస్తుంది. షుగర్స్ వలన నరాలు దెబ్బతింటాయి. అంతేకాకుండా కంటి చూపు కోల్పోవటం , హార్ట్ ఎటాక్ రావడం మరియు కిడ్నీ డిసీజ్ , లివర్ సంబంధించిన వ్యాధులు రావడం ఇలా మన శరీరాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ ని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి.