Tuna fish in telugu :
ట్యూనా ఫిష్ ని ( tuna fish in telugu ) చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఎందుకంటే దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి. ట్యూనా ఫిష్ ఎక్కువగా సముద్రాలలో పెరుగుతుంది. ట్యూనా ఫిష్ ప్రపంచంలో అన్ని రకాల సముద్రాలలో పెరుగుతాయి. ట్యూనా ఫిష్ సముద్రం లో పెరుగుతుంది కాబట్టి దీన్ని ఉప్పు చేప అని కూడా పిలుస్తారు. ట్యూనా ఫిష్ ప్రపంచ ఆదరణ పొందిన చేపలలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ట్యూనా ఫిష్ చూడటానికి ఆకారంలో పెద్దగా మరియు ధృడంగా ఉంటుంది. ప్రస్తుతం అంతరించి పోతున్న చేపల జాతులలో ట్యూనా ఫిష్ ఒకటి. అందుకే ట్యూనా ఫిష్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.
ట్యూనా చేప ని తెలుగు లో తూర చేప ( tuna fish in telugu ) అని పిలుస్తారు. హిందీలో ట్యూనా చేప ని ( tuna fish in hindi ) చురా , మచ్చలి అని , ట్యూనా చేప ని మలయాళం లో ( tuna fish in Malayalam ) చూరా అని, ట్యూనా చేప ని తమిళంలో సూరై అని , అంతేకాకుండా ట్యూనా చేప ని మరాఠీలో ( tuna fish in marati ) చురా అని పిలుస్తారు. ట్యూనా చేప మన దేశంలో కొన్ని చోట్ల మాత్రమే లభిస్తుంది. ట్యూనా చేప కి అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.
ట్యూనా చేప ధర : tuna fish price
ట్యూనా చేప లో చాలా రకాల జాతులు ఉన్నాయి. ట్యూనా చేప లలో మొత్తం 15 రకాల జాతులు ఉన్నాయి. మార్కెట్ లో ఒక్కో రకానికి ఒక్కో ధర ఉంటుంది.మార్కెట్ లో ఒక కేజీ ధర 400 రూపాయల ధర పలుకుతుంది.
ట్యూనా చేప లో పోషక విలువలు : Neutrients values in tuna fish in telugu
ట్యూనా చేప లో మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్ని ఉంటాయి. అందుకే ఈ చేపకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ట్యూనా చేప లో యాంటి ఆక్సిడెంట్స్, సెలీనియం, పాస్పరస్ , ప్రోటీన్, ఐరన్ , మెగ్నీషియం మరియు పొటాషియం పుష్కళంగా వుంటాయి. అంతేకాకుండా ట్యూనా చేప లో విటమిన్ బి 12, విటమిన్ బి 6, నియాసిన్ మరియు రిబోఫ్లావిన్ పుష్కలంగా ఉంటాయి.
ట్యూనా చేప యొక్క ఆరోగ్య ప్రయోజనాలు : health benefits of tuna fish in telugu
1.ట్యూనా చేప లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలోని చెడు కొలెస్టరాల్ స్థాయిని తగ్గిస్తుంది. దీనివల్ల అధిక రక్త పోటు రాకుండా ఉంటుంది.
2.ట్యూనా చేప లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఐరన్ శాతం లోపిస్తే రక్త హీనతకు కారణం అవుతుంది. ఐరన్ తక్కువగా ఉంటే శరీరంలో ఆక్సీజన్ సరఫరా సరిగా అవ్వదు.
ఐరన్ డెఫిషియన్సీ తో బాధపడేవారు ట్యూనా చేప ని తింటే చక్కటి పలితం ఉంటుంది.
3.ట్యూనా చేపలో విటమిన్ ఎ ఉంటుంది. విటమిన్ ఎ మన కంటి చూపు ని మెరుగుపరుస్తుంది.
4.ట్యూనా చేపలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది అంతేకాకుండా రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది.
5.ట్యూనా చేపలో విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి ఎముకలు దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది.
6.ట్యూనా చేపలో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలతో పోరాడతాయి.