The witcher season 4 :
ది విట్చర్ ( the witcher season 4 ) టీవీ షో 2019 వ సంవత్సరం లో మొదటగా రిలీజ్ అయ్యింది. ది విట్చర్ టీవీ షో ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యింది. ఈ ది విట్చర్ సిరీస్ సీజన్ 1 నుంచి సీజన్ 3 వరకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. విట్చర్ పాత్రలో హెన్రీ కావిల్ నటించారు. ఈ పాత్రలో హెన్రీ కావిల్ చాలా అద్భుతంగా నటించారు. ఈ విట్చర్ సీజన్ 4 లో హెన్రీ కావిల్ స్థానంలో గెరాల్ట్ పాత్రను లియామ్ హెమ్స్‌వర్త్ నటించడంతో ఈ సిరీస్ మరింత కొత్తగా అనిపించవచ్చు. చిత్ర యూనిట్ కూడా సీజన్ 4 యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం సీజన్ 4 షూటింగ్ జరుగుతుంది. మొత్తం ఈ ది విట్చర్ 5 సిరీస్ వరకు తెరకెక్కనుంది.
ప్రస్తుతం ది విట్చర్ సిరీస్ ( the witcher season 4 ) అభిమానులు ఎప్పుడెప్పుడా నెట్ఫ్లిక్స్ లో ప్రసారం అవుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ సిరీస్ లో పవర్ఫుల్ మంత్రగత్తె గా ఎన్నెఫర్ గా అన్య చలోత్ర నటిస్తున్నారు. ఫ్రెయ అల్లన్ యువరాణిగా నటిస్తున్నారు. విచ్చర్ పాత్రలో హెన్రీ కావిల్ కు బదులుగా లియామ్ హేమ్స్వర్త్ నటిస్తున్నారు కాబట్టి ఏ మేరకు ఈ పాత్రకి ప్రాణం పోషిస్తాడు అనేది చూడాలి. అంతకాకుండా హాలీవుడ్ నటుడు లారెన్స్ కూడా ఈ సీజన్ 4 లో నటించబోతున్నాడు.

మొదటగా నెట్ఫ్లిక్స్ 7 సీజన్స్ వరకు ప్లాన్ చేసింది ఆ తర్వాత ఈ సిరీస్ ను 5 సీజన్లో ముగించాలి అనుకున్నారు. ఈ ది విచ్చర్ సీజన్ 4 సిరీస్ ను నెట్ఫ్లిక్స్ ఈ సంవత్సరంలో రిలీజ్ చేయబోతుంది. కానీ ఇంకా కచ్చితమైన తేదీని నెట్ఫ్లిక్స్ ప్రకటించలేదు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.