TS DSC Results 2024 :
తెలంగాణ ప్రభుత్వం ఈరోజు DSC ఫలితాలను ( TS DSC Results 2024 ) రిలీజ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం 11062 పోస్ట్ లని భర్తీ చేయడానికి పరీక్షలు నిర్వహించింది. సిబిఆర్ టీ విధానం ద్వారా రోజుకి రెండు షిఫ్ట్ ల్లో పరీక్షలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనున్న 11062 పోస్ట్ లకి గాను మొత్తం 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. జూలై 18 వ తేదిన మొదటి షిఫ్ట్ లో స్కూల్ అసిస్టెంట్ పిజికల్ సైన్స్ పరీక్ష మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష రెండవ షిఫ్ట్ లో నిర్వహించారు.
జూలై 19 వ తారీకు నుంచి 22 వ తారీకు వరకు ఎస్జీటీ పరీక్షలు జరిగాయి. జూలై 22 వ తారీకు న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష , జూలై 24 వ తారీఖున స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పరీక్ష నిర్వహించారు. జూలై 26 వ తారీఖున తెలుగు పండిత్ మరియు సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహించారు. జూలై 30 వ తారీఖున స్కూల్ అసిస్టెంట్ సోషల్ పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వం పోస్టులు భర్తీ చేయడం పై చాలా మంది హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా డీఎస్సీ పరీక్షను ( TS DSC Results 2024 ) కంప్యూటర్ ఆధారిత విధానం ద్వారా నిర్వహించారు. ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ నెల 30 వ తారీకు నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది అని తెలియజేశారు. క్రింద తెలిపిన లింక్ ను ఓపెన్ చేసి మీ ఫలితాలను చూసుకోండి.
https://tgdsc.aptonline.in/tgdsc ఈ లింక్ ద్వారా మీ ఫలితాలను చూసుకోండి. తర్వాత మీ జిల్లా నీ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి ఎంపిక అయిన అభ్యర్థుల లిస్ట్ మీకు కనిపిస్తుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అందుబాటులో ఉంటుంది.