Homedevotionaltathastu devathalu : త‌థాస్తు దేవతలు సంచరించే సమయం

tathastu devathalu : త‌థాస్తు దేవతలు సంచరించే సమయం

tathastu devathalu :

మన పెద్దలు మనం ఏమైనా దేని గురించి అయిన తప్పుగా మాట్లాడితే త‌థాస్తు దేవతలు ( Tathastu Devathalu ) పైన ఉంటారు వాళ్ళు ఒకవేళ త‌థాస్తు అంటే నిజంగా అదే జరిగిపోధ్ది అని అంటారు. అందుకే త‌థాస్తు దేవతలు ( Tathastu Devathalu తిరిగేటప్పుడు చెడుగా ఏమి మాట్లాడవద్దు అని మన పెద్దలు చెబుతుంటారు. ఇంతకీ నిజంగానే త‌థాస్తు దేవతలు ఉంటారా ? ఒకవేళ నిజంగానే త‌థాస్తు దేవతలు ఉంటే మనం చెడు మాట్లాడుకుంటే నిజంగానే చెడు జరుగుతుందా ? ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం సూర్యుడి భార్య అయిన సంధ్యా దేవి సూర్యుడి వేడిని తట్టుకోలేక తను గుర్రం రూపం లోకి మారి కురుదేశం వెళ్తుంది. తర్వాత సూర్యుడు కూడా సంధ్యా దేవి లాగే గుర్రం రూపం దాల్చి తన భార్య అయిన సంధ్యా దేవి దగ్గరకు వెళ్తాడు. సూర్యుడు మరియు సంధ్యా దేవి కలయిక వల్ల పుట్టిన వాళ్ళే అశ్విని కుమారులు. ఈ అశ్విని కుమారులనే త‌థాస్తు దేవతలు( Tathastu Devathalu ) అంటారు.

పురాణాల ప్రకారం త‌థాస్తు దేవతలు (Tathastu Devathalu ) బంగారు రథం పై వాయు వేగంతో ప్రయాణిస్తారు. వాళ్ళు ప్రయాణిస్తూ త‌థాస్తు అని పలుకుతారు. వీరి ఒక చేతిలో ఆయుర్వేద పుస్తకం మరియు ఇంకో చేతితో అభయ హస్తం చూపుతూ ప్రయాణిస్తారు. అందుకే త‌థాస్తు దేవతలు ప్రయాణించే సాయంత్ర సంధ్యా సమయాన ఎప్పుడు చెడు మాట్లాడకుండా , మంచే మాట్లాడండి అంత మంచే జరుగుతుంది. వాళ్ళు తిరిగే సమయంలో చెడు మాత్రం మాట్లాడకండి.

మహాభారతంలో పాండు రాజు భార్య మాద్రికి మంత్రాల ప్రభావంతో నకుల మరియు సహదేవులు గా జన్మించారు. ఈ అశ్విని కమారులే మహాభారతంలో నకుల , సహదేవులుగా జన్మించారు అని అంటుంటారు. అంతేకాకుండా ద్రక్ష ప్రజాపతి దగ్గర వీరు ఆయుర్వేదాన్ని అభ్యసించి ఇంద్రునికి నేర్పిస్తారు. వీరికి ఉష అనే ఒక సోదరి కూడా ఉంటుంది. వీరిని ఉష బ్రహ్మ ముహూర్తం సమయంలోనే వారిని నిద్ర లేపుతుంది. వీరు తమ సోదరితో పాటు తూర్పు నుంచి పడమర దిశ కి వాయు వేగంతో ప్రయాణిస్తారు అని అంటుంటారు. వీరు వైద్య శాస్త్రానికి అధిపతులు.

త‌థాస్తు దేవతలు ( Tathastu Devathalu ) సాయంత్రం సంచరిస్తుంటారని అంటుంటారు. వీరు వాయు వేగం తో ప్రయాణిస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు తిరిగేటపప్పుడు మనం ఎదైనా చెడు అనుకుంటే వెంటనే జరిగిపోతుందట. అంతేకాదు మనదగ్గర ధనం , డబ్బు ఉన్న కూడా లేవు అంటే ఒకవేళ త‌థాస్తు దేవతలు త‌థాస్తు అంటే నిజంగానే డబ్బు, ధనం అస్సలు ఉండవట. అందుకే డబ్బు ఉన్న కూడా లేదు మాత్రం అనకండి. ఒకవేళ అంటే మాత్రం మీ దగ్గర ధనం , డబ్బు లేకుండా పోతాయి. మన హెల్త్ ఆరోగ్యంగా ఉన్న కూడా ఒకవేళ లేదు అంటే నిజంగానే అనారోగ్యం కలుగుతుంది. అందుకే ఎప్పుడూ చెడు మాటలు మాట్లాడకండి ఒక వేళ త‌థాస్తు దేవతలు వింటే త‌థాస్తు అంటే నిజంగానే జరిగిపోతాయి. అందుకే మనకి ఆరోగ్యం మరియు డబ్బు మిగతావి ఏవైనా ఉన్న కూడా లేవు మాత్రం అనకండి.

RELATED ARTICLES
LATEST ARTICLES