Snake fruit : salak fruit
స్నేక్ ఫ్రూట్ ఈ పేరు వినగానే మీకు ఆశ్చర్యం వేసిందా ? అవును మీరు వింటుంది నిజమే ! స్నేక్ ఫ్రూట్ ఇది ఇండోనేసియా కి చెందిన ఒక పండు. స్నేక్ ఫ్రూట్ ఎక్కువగా ఉష్ణ మండల ప్రాంతాలలో మాత్రమే పెరుగుతుంది. ఈ పండు ని ఎక్కువగా ఇండోనేసియా లో సాగు చేస్తారు. ఇది శాస్త్రీయ పరంగా అరకేసే కుటుంబానికి చెందిన మొక్క . స్నేక్ ఫ్రూట్ ని సలాక్ పండు ( salak fruit ) అని కూడా పిలుస్తారు. స్నేక్ ఫ్రూట్ ని ( snake fruit tree ) శాస్త్రీయ పరంగా సలక్కా జలక్కా అని పేరుతో పిలుస్తారు. స్నేక్ ఫ్రూట్ లో మన శరీరానికి కావల్సిన పోషక విలువలు అన్ని ఉంటాయి.
స్నేక్ ఫ్రూట్ పుల్లటి రుచిని కలిగి ఉంటుంది. కానీ ఈ పండు చూడటానికి చిన్నగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పండు మధ్యలో తెల్లటి గుజ్జు ఉంటుంది . ఈ గుజ్జు లో విత్తనాలు ఉంటాయి. దీని తోలు అచ్చం పాము తోలు వలె ఉంటుంది. అందుకే దీనికి స్నేక్ ఫ్రూట్ ( snake fruit tree ) అని పేరు వచ్చింది. ఈ పండు ని ఇండోనేసియా లోనే కాకుండా చైనా, స్పెయిన్ , న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాల్లో కూడా సాగు చేస్తారు. ఈ స్నేక్ ఫ్రూట్ తో వైన్ తయారు చేస్తారు. ఇండోనేషియా ప్రజలు ఈ ఫ్రూట్ ని ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా పర్యాటకులు కూడా ఈ పండు ని ఎంతో ఇష్టంగా తింటారు.
Neutrients values in snake fruit : స్నేక్ ఫ్రూట్ లో పోషక విలువలు
స్నేక్ ఫ్రూట్ ( సలాక్ పండు ) చూడటానికి పాము తోలు ఆకారం భయంకరంగా ఉన్నా దీంట్లో పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఒక 100 గ్రాముల సలాక్ పండులో 80 కేలరీలు ఉంటాయి. అంతేకాకుండా 3% కి పైగా కొవ్వు మరియు 1% కి పైగా ప్రొటీన్లు ఉంటాయి . దీంట్లో డైటరీ ఫైబర్స్ మరియు ఫైనోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. స్నేక్ ఫ్రూట్ లో విటమిన్ సి, కాల్షియం, ఐరన్ , పొటాషియం, ప్రోటీన్స్ మరియు బీటా కేరోటిన్ లు పుష్కలంగా ఉంటాయి.
స్నేక్ ఫ్రూట్ తో ఆరోగ్య ప్రయోజనాలు : snake fruit benefits
1.స్నేక్ ఫ్రూట్ లో ( salak fruit ) పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె కి ఎంతో మేలు చేస్తుంది. స్నేక్ ఫ్రూట్ లో ఉండే యాంటీ యాక్సిడెంట్లు మరియు మినిరల్స్ హృదయనాళ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది.
2.స్నేక్ ఫ్రూట్ లో పొటాషియం మరియు పెక్టిన్ ఉంటుంది. ఇది మన మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.
3.స్నేక్ ఫ్రూట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. స్నేక్ ఫ్రూట్ తినడం వల్ల ఉబకాయ సమస్య కి చెక్ పెట్టవచ్చు.
4.అజీర్ణం సమస్యతో బాధపడుతున్నవారు స్నేక్ ఫ్రూట్ ని తింటే అజీర్ణ సమస్య తగ్గుతుంది.అంతేకాకుండా విరేచనాలను కూడా తగ్గిస్తుంది. స్నేక్ ఫ్రూట్ బెరడు కి అతిసారం ని తగ్గించే గుణం ఉంది.
5.స్నేక్ ఫ్రూట్ లో బీటా కెరోటిన్ ఉంటుంది. కంటి సమస్యలతో బాధపడే వారు ఈ పండు ని తింటే కంటి సంబంధిత సమస్యలు నయం అవుతాయి. దీంట్లో పుచ్చకాయ కంటే ఎక్కువ శాతం లో బీటా కెరోటిన్ ఉంటుంది. కాబట్టి ఈ పండు ని తినడం చాలా మంచిది.
6.స్నేక్ ఫ్రూట్ లో విటమిన్ సి ఉంటుంది. ఇది మన శరీరంలో రోగి నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా మన శరీరం లో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది.
7.స్నేక్ ఫ్రూట్ లో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండ్ల కంటే ఎక్కువ యాంటీ యాక్సిడెంట్లు ఈ పండులో ఉంటాయి. ఇది మన శరీరం లో క్యాన్సర్ కణాల విస్తరణను అడ్డుకుంటాయి.
8.స్నేక్ ఫ్రూట్ లో రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణం ఉంటుంది. ఈ పండును డయాబెటిక్ సమస్యతో బాధపడేవారు తినడం చాలా మంచిది.