HomemoviesAmazon prime video : త్వరలో ఓటిటి లోకి రాబోతున్న స్వాగ్ సినిమా

Amazon prime video : త్వరలో ఓటిటి లోకి రాబోతున్న స్వాగ్ సినిమా

Amazon prime video :

రాజ రాజ చొర మూవీ ఫేమ్ శ్రీ విష్ణు నటించిన స్వాగ్ ( Swag movie ) దేశవ్యాప్తంగా ఈ నెల అక్టోబర్ 4 న విడుదల అయ్యింది. ఈ స్వాగ్ మూవీ మూవీ క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూ నీ సొంతం చేసుకుంది. శ్రీ విష్ణు ఎప్పుడు తను విభిన్న కథలను ఎంచుకుంటాడు. రాజ రాజ చోర మూవీ దర్శకత్వం వహించిన హాసిత్ గొలి ఈ స్వాగ్ మూవీ కి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు తన నటన మరియు కామెడీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా నీ ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి హక్కులను దక్కించుకుంది. వచ్చే నెలలో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో ( amazon prime video ) ఉండబోతుందని సమాచారం. ఎంత మొత్తానికి ఈ సంస్థ స్వాగ్ మూవీ హక్కులను దక్కించుకుంది అని ఇంకా తెలియలేదు. సుమారుగా ఇంకా నాలుగు వారాలు మాత్రమే ఈ సినిమా థియేటర్లలో ఉండబోతుంది.

Swag cinema in Amazon prime video

శ్రీ విష్ణు ఇది వరకు నటించిన ఓం బిం బుష్ సినిమా లో తన కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన కథానాయికగా రీతు వర్మ నటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో మీరా జాస్మిన్ కూడా నటించారు. ఈ సినిమాలో మీరా జాస్మిన్ తన నటన తో ప్రేక్షకులను మెప్పించింది. తన రోల్ కి న్యాయం చేసింది. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం వహించారు. ఈ సినిమా కి సంగీతం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో పృధ్వీ , శరణ్య , వెంకట రమణ , రవి బాబు మరియు సునీల్ తది తరులు నటించారు. ఈ స్వాగ్ సినిమా నీ టీజి విశ్వ ప్రసాద్ నిర్మించారు.

RELATED ARTICLES
LATEST ARTICLES