Sapota Benefits :
మండు వేసవిలో కాస్త దప్పిక తీరడానికి అందరూ జ్యూస్, ప్రూట్స్ మరియు సలాడ్స్ తీసుకుంటారు. వేసవి కాలంలో నీరు ఎక్కువగా తీసుకోకుంటే డీహైడ్రేషన్ కి లోను అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు మార్కెట్ లో చాలా రకాల పండ్లు లభిస్తాయి. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతూ ఉంటాయి కాబట్టి ఎండకి వెళ్ళినపుడు కాస్త చల్లబడే పండ్లను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. సపోటా పండు ని ( sapota benefits ) అందరూ వేసవి కాలంలో ఎక్కువగా తింటూ ఉంటారు.ఎందుకంటే సపోటా లో చాలా పోషక విలువలు ఉన్నాయి. అంతేకాకుండా సపోటా పండు నీ తినడం వల్ల ఇది మన శరీరాన్ని చల్ల బరుస్తుంది. అందుకే వైద్యులు కూడా సపోటా పండు ని తినమని చెబుతుంటారు.
సపోటా పండు చూడటానికి గోధుమ రంగులో ఉంటుంది. సపోటా పండు ( sapota benefits ) చుట్టూ సన్నటి పొర లా ఉంటుంది. కానీ లోపలో ఆరంజ్ కలర్ లాంటి గుజ్జు ఉంటుంది మరియు మధ్యలో నల్లటి రంగులో గింజలు ఉంటాయి. సపోటా పండు చూడటానికి చిన్నగా ఉన్న దీని రుచి చాలా తీయ్యగా ఉంటుంది. సపోటా పండు ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతంలో పెరుగుతుంది. మెక్సికో మరియు ఫిలిప్పీన్స్ ప్రాంతాల్లో సపోటా పండ్లని ఎక్కువగా సాగు చేస్తారు. సపోటా పండ్లలో ఎక్కువగా విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా సపోటా పండ్లు వేసవి కాలంలోనే ఎక్కువగా పండుతాయి. ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
సపోటా పండులో పోషక విలువలు : Neutrients values in sapota benefits
సపోటా పండు లో మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్ని ఉంటాయి. సపోటా పండు లో కాల్షియమ్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం , సెలీనియం, కాపర్, సోడియం మరియు జింక్ వంటి మినరల్స్ ఉంటాయి. అంతేకాకుండా సపోటలో విటమిన్ ఎ, తియామిన్, రిబోఫ్లావిన్ , నియాసిన్, విటమిన్ సి, విటమిన్ ఇ మరియు విటమిన్ కే పుష్కళంగా వుంటాయి. సపోటా పండు లో ఐసోలూసిన్ , లూసిన్, లిసిన్ మరియు వాలిన్ లాంటి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
సపోటా పండు తినడం వల్ల కలిగే ఉపయోగాలు : Health benefits of sapota benefits
1.మలబద్ధకం సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. సపోటా పండు గుజ్జు లో ఉండే పీచు పదార్ధం మరియు కెరోటిన్ ల వల్ల మలవిసర్జన సాఫీగా జరిగి మలబద్దక సమస్య తగ్గుతుంది.
2.ఎదైనా పని చేసి అలసిపోయినప్పుడు గానీ లేదా శక్తి లేమితో బాధపడుతున్నవారు సపోటా పండ్లను తింటే సపోటా పండు లో ఫ్రక్టోజ్ మన శరీరానికి కావల్సిన శక్తిని త్వరగా అందిస్తుంది.
3.సపోటా లో పాలిఫినోలిక్ అనే శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్స్ సుగుణాలు ఉన్నాయి.పాలిఫినోలిక్ శరీరం ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా కాపాడుతుంది.
4.సపోటా పండు లో విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి మన కంటి చూపు ని మెరుగుపరుస్తుంది.
5.సపోటా పండు లో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. విటమిన్ సి మన శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తుంది.
6.సపోటా పండు లో నియాసిన్ మరియు పాంతోనియిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి మన జీవక్రియను మెరుగుపరుస్తాయి.
7.తక్కువగా బరువు ఉన్నవారు రోజు సపోటా పండు ని తింటే బరువు పెరుగుతారు. అంతేకాకుండా ఎదిగే పిల్లలకు ఈ పండుని తినిపించడం చాలా మంచిది.
8.ముఖ్యంగా గర్భిణీలు మరియు వృద్దులు రక్తహీనత సమస్య తో బాధపడుతుంటారు. రక్తహీనత సమస్య తో బాధపడుతున్నవారు ఈ సపోటా పండు ని తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది.
9.సపోటా పండులో విటమిన్ ఎ మరియు విటమిన్ సి ఉంటాయి కాబట్టి ఇవి మన చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తాయి. సపోటా పండు తినడం వల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
10.డయాబెటిక్ సమస్య తో బాధపడుతున్నవారు ఈ సపోటా పండు ని తింటే షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి డాక్టర్ సలహా మేరకు మితంగా మాత్రమే తీసుకోవాలి.