salaar movie review :
రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ” సలార్ ” ( salaar movie ) సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఇప్పటికే థియేటర్ల ముందు ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మొదలు అయింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా టికెట్ రేట్ ని కూడా పెంచారు. ప్రభాస్ నటించిన ఈ సంవత్సరం రిలీజ్ అయిన అదిపురుష్ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రభాస్ ఈ సినిమా తో ( salaar movie review ) ఎలా అయిన హిట్ కొట్టాలి అనే ఆలోచనలో ఉన్నాడు. ఆదిపురుష్ సినిమా తర్వాత ప్రభాస్ కి సలార్ మూవీ ఒక పెద్ద ప్రాజెక్ట్. సక్సెస్ ఫుల్ డైరెక్ట్ అయిన ప్రశాంత్ నీల్ ఈ సలార్ మూవీ ని డైరెక్ట్ చేశారు. ఇటీవల విడుదల అయిన ట్రైలర్, పాటలు సినిమా కి మరింత హైప్ ని పెంచింది. ఈ సినిమా కి డైరెక్ట్ ప్రశాంత్ నీల్ కావడం తో ఈ సినిమా పై ప్రేక్షకులకి మరింత ఆసక్తి పెరిగింది.
ఈ సలార్ ( salaar movie review and rating ) సినిమాని KGF సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రభాస్ హీరో గా నటించగా , శృతి హాసన్ కథానాయికగా నటించింది. అంతేకాకుండా ఈ సినిమా లో జగపతి బాబు, ఆనంద్, పృథ్వీరాజ్, జాన్సి, శ్రేయ రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమాకి భువన్ గౌడ్ కెమెరామెన్ గా పనిచేశారు. అంతేకాకుండా ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి మరియు రవి బస్సూర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ని విజయ్ కిరగండూర్ , హంబుల్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 22 న విడుదల అయింది.
కథ : ( salaar movie review )
అమెరికాలో పుట్టిపెరిగిన ఆధ్య ( శృతి హాసన్ ) తన తండ్రికి చెప్పకుండా ఇండియా కి వస్తుంది. శృతి హాసన్ ని కిడ్నాప్ చేయడానికి చాలా గ్యాంగ్ లు ప్రయత్నిస్తుంటారు. అస్సాం లోని బర్మా బోర్డర్ లో బొగ్గు గనిలో దేవరత అలియాస్ హీరో ప్రభాస్ పనిచేస్తుంటారు. అయితే శృతి హాసన్ ని కాపాడ గలిగేది ఒక్క దేవరథ మాత్రమే అని భావించి తన వద్దకు తీసుకుని వెళ్తారు. దేవరథ వాళ్ల తల్లి ఊరిలో పిల్లలకి పాఠాలు చెబుతుంటుంది. దేవరథ చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసిన సరే ఈశ్వరి రావు భయపడుతుంది. తను ఎందుకు ఇలా భయపడుతుంది ?
ఖన్సార్ అనే సామ్రాజ్యానికి కర్త జగపతి బాబు ( రాజమన్నార్ ). రాజమన్నార్ కొడుకు అయిన వరద రాజమన్నార్ ని దొరగా చూడాలన్నదే రాజమన్నార్ కోరిక. కొన్ని రోజులు రాజమన్నార్ సామ్రాజ్యాన్ని వదిలి తిరిగి వచ్చేలోపు తన కుర్చీ ని స్వాధీనం చేసుకోవాలని ఆశ పడతారు. ఇందుకోసం మిగతా దోరలంత వాళ్ళ వాళ్ళ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు. వరద రాజమన్నార్ తన చిన్న నాటి స్నేహితుడు అయిన దేవరత అలియాస్ ప్రభాస్ నీ సహాయం అడుగుతాడు. దేవరత వీళ్ళందరినీ ఎలా ఎదిరించాడు ? శృతి హాసన్ ని కపాడాడ లేదా అనే విషయం తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే ?
పెర్ఫార్మెన్స్ :
ఈ సినిమాలో ( salaar movie ) ప్రభాస్ తన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరో ఇజం ని KGF కంటే ఎక్కువగా చూపెట్టాడు. హీరోయిజానికి తగ్గట్టుగా ఎలివేషన్ సీన్లు బాగా దర్శకుడు తెరకెక్కించాడు. అటు కథకి ప్రాధాన్యం ఇస్తు , మరొక వైపు హీరో నీ ఏలివట్ చేస్తూ ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాని తెరకెక్కించాడు. ప్రభాస్ కూడా చాలా బాగ నటించారు. కథానాయికగా నటించిన శృతి హాసన్ పర్వాలేదు అనిపించింది. ప్రభాస్ తల్లిగా నటించిన ఈశ్వరి రావు చాలా బాగా నటించారు తను తన పాత్రకు న్యాయం చేసింది. మిగతా వాళ్ళు జగపతి బాబు , ఆనంద్, పృథ్వీరాజ్ , శ్రేయ రెడ్డి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ప్రశాంత్ నీల్ కి ఈ సినిమా స్టోరీ చాలా ప్లస్ పాయింట్ అయింది. కథ ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. ఎమోషనల్ సీన్లు మరియు హీరో ఎలివేషన్ సీన్లు kgf సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయి. ఈ సినిమాకి సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా పనితనం, ఎడిటింగ్ వాల్యూస్ ప్రధాన బలం. ఈ చిత్ర నిర్మాణ విలువలు చాలా బాగుంది. ఓవరాల్ గా ప్రశాంత్ నీల్ ప్రభాస్ కి ఒక మంచి హిట్ ని అందించాడు.
ప్లస్ పాయింట్స్ :
-సినిమా కథ
-ప్రభాస్ నటన, పృథ్వీరాజ్ నటన
-ప్రశాంత్ నీల్ దర్శకత్వం
-సంగీతం
-ఎడిటింగ్
-బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
-క్లైమాక్స్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ :
-కొన్ని సన్నివేశాలు kgf సినిమాని గుర్తు చేస్తాయి
-సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి
Movie rating : 3.5/5