Roopchand fish :
చేపలలో అత్యంత ప్రత్యేకమైన రుచిని కలిగి ఉన్న చేపలలో రూప్ చంద్ roopchand fish చేప ఒకటి. ఈ చేపని మన దేశం లో ఎంతో ఇష్టంగా తింటారు. ఎందుకంటే దీని రుచి ఒక కారణం. ఈ రూప్ చంద్ చేప తక్కువ చేప వాసనని కలిగి ఉంటుంది. మార్కెట్ లో దొరికే వేరే వివిధ రకాల చేపలు ఎక్కువ వాసనను కలిగి ఉంటాయి. అందుకే కొందరు చేపలను ఎక్కువగా తినరు. రూప్ చంద్ చేప తక్కువ వాసనను కలిగి ఉండటం వల్ల మార్కెట్ లో ఈ చేపకు మంచి డిమాండ్ ఉంది.
ఈ చేప ఎక్కువగా భారత దేశంలో మరియు చైనా దేశం లో పెరుగుతుంది. ఈ చేప మంచి నీటిలోనే కాకుండా ఉప్పు నీటిలో కూడా పెరుగుతుంది. ఈ రూప్ చంద్ చేప ఎక్కువగా చెరువులో , నదులల్లో మరియు సముద్రాలలో పెరుగుతుంది. ఈ చేప యొక్క మరొక విశేషం ఏమిటంటే ఇది ఒకటే ఏముకని కలిగి ఉంటుంది. దీనివల్ల తినేటప్పుడు ముళ్ళు కుచ్చుకుంటుందని అనే భయం ఉండదు.
ఈ రూప్ చంద్ చేపని చైనీస్ లో పాంఫ్రెట్ అని పిలుస్తారు roopchand fish in English . ఈ చేపని తెలుగులో చందువ లేదా సందువ అని పిలుస్తారు roopchand fish in telugu . ఈ రూప్ చంద్ చేపలలో చాలా రకాల జాతులు ఉన్నాయి. ఈ జాతిలో చేపలు కొన్ని ఎరుపు ,తెలుపు ,నలుపు , సిల్వర్ మరియు ఇతర రంగులు కలిగి ఉంటాయి. రూప్ చంద్ సిల్వర్ కలర్ లో ఉండే చేపలు ఉప్పు నీటిలో కూడా పెరుగుతాయి. రూప్ చంద్ చేపలు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.
Roopchand fish price : రూప్ చంద్ చేప రుచి కారణముగా మరియు దీంట్లో లభించే ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండటం వల్ల ఈ చేపలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ధర పలుకుతుంది. ఒక కిలో రూప్ చంద్ చేపలకు 700 రూపాయల ధర నుంచి 850 రూపాయల ధర పలుకుతుంది.
Neutrients values in roopchand fish : రూప్ చంద్ చేపలో పోషక విలువలు
రూప్ చంద్ చేపలో పోషక విలువలు సమృద్ధిగా ఉండటం వల్ల ఎక్కువగా తింటారు. రూప్ చంద్ చేపలో అమైనో ఆమ్లాలు, ప్రొటీన్లు, విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. రూప్ చంద్ చేపలో సోడియం, పొటాషియం, కాల్షియమ్, ఐరన్ , విటమిన్ సి, విటమిన్ ఎ , సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి.
Roopchand fish benefits : రూప్ చంద్ చేప యొక్క ఉపయోగాలు
1.మన శరీరానికి ప్రొటీన్లు చాలా అవసరం. ప్రొటీన్లు మన శరీరములో కండరాలు మరియు ఎముకలు నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
2.రూప్ చంద్ చేప లో ఎక్కువగా ఐరన్ మరియు మెగ్నీషియం ఉంటుంది. ఇది మన శరీరంలో ఎంజైమ్ ల పనితీరును మెరుగుపరుస్తుంది.
3.రూప్ చంద్ చేప లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది మన కంటి చూపు ని మెరుగుపరుస్తుంది.
4.రూప్ చంద్ చేప లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
5.రూప్ చంద్ చేప లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా తక్కువ కేలరీలు ఉంటాయి. దీనివల్ల బరువు కూడా పెరగరు.
6.రూప్ చంద్ చేప లో సెలీనియం , విటమిన్ ఇ మరియు జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో హానికరమైన ప్రీ రాడికల్స్ తో పోరాడతాయి.