HomeHealthRajma in telugu : రాజ్మా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

Rajma in telugu : రాజ్మా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

Rajma in telugu :

చిక్కుడు గింజ ఆకారంలో ఉండే రాజ్మా సీడ్స్ ( rajma in telugu ) మన శరీర ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. రాజ్మా సీడ్స్ ఎరుపు రంగులో చిన్నగా , మూత్ర పిండాల ఆకారంలో ఉంటాయి. అంతేకాకుండా మాంసాహారానికి బదులుగా వీటిని తింటారు ఎందుకంటే వీటిలో చాలా పోషక విలువలు ఉంటాయి. రాజ్మా సీడ్స్ మూత్ర పిండాల ఆకారంలో ఉంటాయి కాబట్టి వీటిని కిడ్నీ సీడ్స్ అని పిలుస్తారు. చాలా మంది ఎంతో ఇష్టంగా రాజ్మా తో చేసిన వంటకాలను తింటారు. రాజ్మా సీడ్స్ లో ( rajma in telugu ) అధిక మొత్తంలో ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రాజ్మా సీడ్స్ ని ముందు రోజు రాత్రి నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వండుకోవాలి. దాదాపుగా రాజ్మా సీడ్స్ ని 10 గంటలు నానబెట్టాలి.

రాజ్మా సీడ్స్ లో పోషక విలువలు : Nutrient values in rajma in telugu

రాజ్మా సీడ్స్ లో మాంసాహారంలో ఉండే ప్రోటీన్స్ అన్ని వీటిలో ఉంటాయి. అందుకే మాంసాహారానికి ప్రత్యంగా రాజ్మా సీడ్స్ ని తీసుకుంటారు. రాజ్మా సీడ్స్ లో స్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రాజ్మా సీడ్స్ లో ప్రోటీన్స్ , ఫోలేట్ ,ఐరన్ , మాంగనీస్, పాస్పరస్, థయామిన్ మరియు యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే రాజ్మా సీడ్స్ ని రోజు డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది.

రాజ్మా సీడ్స్ వల్ల కలిగే ఉపయోగాలు : Health benefits of Rajma in telugu

1.రాజ్మా సీడ్స్ లో ఫైబర్స్ మరియు పిండి పదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణ క్రియ వ్యవస్థ సాఫీగా జరిగేలా చేస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గేలా చేస్తుంది.

2.రాజ్మా సీడ్స్ లో గ్లైసేమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తం లో గ్లూకోజ్ స్థాయిని ఒకేసారి పెరగకుండా చూస్తుంది. అందుకే రాజ్మా సీడ్స్ ని రైస్ తో తీసుకోవడం మంచిది.

3.రాజ్మా సీడ్స్ లో తక్కువ కొలెస్టరాల్ ఉంటుంది. అందుకే రాజ్మా సీడ్స్ ని తీసుకుంటే గుండె కి ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో తక్కువ కొవ్వు మరియు అధికంగా ప్రొటీన్లు, విటమిన్లు ఉంటాయి.

4.రాజ్మా సీడ్స్ లో కాల్షియమ్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది శరీరంలో ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఎముకల నొప్పిని కూడా తగ్గిస్తుంది.

5.రాజ్మా సీడ్స్ లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరంలో ప్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా క్యాన్సర్ భారిన పడకుండా కాపాడుతుంది.

6.రాజ్మా సీడ్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచుతుంది. అంతేకాకుండా హీమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది.

7.రాజ్మా సీడ్స్ లో అధికంగా ఫైబర్ ఉంటుంది. కాబట్టి మలబద్దక సమస్యని తగ్గిస్తుంది.

8.రాజ్మా సీడ్స్ ని రోజు డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తపోటు ని తగ్గిస్తుంది. గుండె ని పదిలంగా ఉంచుతుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES