Pregnancy symptoms in telugu :
ప్రతి స్త్రీ కి కూడా గర్భం దాల్చడం చాలా సంతోషాన్ని కలిగించే విషయం అలాంటపుడు గర్భం ( pregnancy symptoms in telugu ) వచ్చినపుడు లక్షణాలను బట్టి గర్భం వచ్చిందా లేదా అని తెలుసుకోవడం కూడా తెలిసి ఉండాలి లేదంటే వారికి తెలియకుండానే కొన్ని ఆహారాలు తీసుకోవడం ఇబ్బంది పడాల్సిరావడం చూస్తుంటారు. కాబట్టి ముందస్తుగా తెలిసిపోయే గర్భధారణ లక్షణాలు అందరికీ తెలిసి ఉండాలి.
గర్భధారణలో ముందుగా కనిపించే లక్షణాలు ( early pregnancy symptoms in telugu ) :
1.ఋతుస్రావం రాకపోవడం :
ప్రతి స్త్రీ లో అన్నిటికంటే ముందుగా కనిపించే లక్షణం ఋతుస్రావం ఆగిపోవడం. అలా అని ప్రతి ఒక్కరిలో ఇలా జరుగుతుందని చెప్పలేము. కొందరిలో కేవలం బ్లీడింగ్ అవ్తుంది అని తెలుస్తుంది కానీ పాడ్ వాడేంత కాదు. గర్భధారణ సమయంలో వచ్చే ఋతుస్రావం కూడా లైట్ గులాబి రంగులో ఉంటుంది.
2.రొమ్ములలో మార్పులు ( changes in breast ) :
గర్భం దాల్చిన వారిలో ఎక్కువగా హార్మోనల్ చేంజ్ చూస్తుంటాం. ఈ హార్మోనల్ చేంజ్స్ వలన రొమ్ము భాగంలో పొడిచినట్టు అనిపించడం కొందరి రొమ్ము ఉబ్బినట్టు కనిపించటం లాంటి మార్పులు గమనిస్తారు. అలాంటపుడు వెంటనే డాక్టర్ నీ కలవడం మంచిది.
3.వాంతులు మరియు వికారం ( vomitings and nausea ) :
గర్భం దాల్చిన ఆడవారిలో ఎక్కువగా బాధించే సమస్య అని చెప్పవచ్చు. ఏ ఆహారం తిన్న కూడా వాంతులు అవ్తూనే ఉంటాయి. అంతే కాదు కొందరికి అసలు ఆహారం తినాలని కూడా అనిపించదు. పీరియడ్స్ రాకుండా వాంతులు వికారం తో బాధపడుతుంటే మాత్రం ఒకేసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోడం మంచిది.
4.అలసట ( weakness and tierdness ) : గర్భం దాల్చిన స్త్రీలో ఎలాంటి పనులు చేయకపోయినా అలసట రావడం లేదు శరీరం మొత్తం నొప్పులు రావడం అసలు శరీరంలో ఎలాంటి శక్తి లేకపోవడం ఎంత ఆహారం తిన్నా కూడా అసలు సామర్థ్యం ఉండకపోవడం.
5.ఉదయం సిక్నెస్ ( morning sickness ) :
స్త్రీ తాను గర్భం దాల్చనని తెలిపే ఒక ముఖ్యమైన లక్షణం ఉదయం లేవగానే ఏదో తెలియని అలసట కొంచం జ్వరం వచ్చినట్టు అనిపించటం ఏ పని కూడా చేయలేకపోవడం కనిపిస్తాయి ఇలా అనిపించినపుడు వెంటనే డాక్టర్స్ సంప్రదించడం మంచిది.
6.పదేపదే మూత్ర విసర్జన ( freeqntly urinating ) :
గర్భం దాల్చిన స్త్రీ లు పదే పదె మూత్ర విసర్జన చేయడం మరియు కొందరిలో మూత్రాన్ని ఆపుకోలేకపోతారు అలాంటపుడు డాక్టర్ నీ సంప్రదించడం మంచిది.