HomeHealthPearl millet in telugu : సజ్జలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Pearl millet in telugu : సజ్జలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Pearl millet in telugu :

పెర్ల్ మిల్లెట్ ని తెలుగులో సజ్జలు ( pearl millet in telugu ) అని పిలుస్తారు. ఈ కాలంలో సజ్జలు అంటే తెలియని వారు ఎవరు లేరు. ఎందుకంటే ఇందులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి. ఈ సజ్జలు ఎక్కువగా ఆఫ్రికా మరియు భారత దేశంలో పండిస్తారు. వీటి యొక్క ఉనికిని 2000 సంవత్సరాల కిందటే కనుగొన్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని ప్రాచీన కాలం నుండి ఎక్కువగా పండిచేవారు. ఈ సజ్జలు నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలలో సాగు చేసేవారు. ఎందుకంటే ఇవి ఎలాంటి పరిస్థులను అయిన ఎదురుకొని దిగుబడిని ఇచ్చేవిగా ఈ పంటకు పేరు ఉంది. ఈ సజ్జల బొటానికల్ పేరు పెన్నిసేటం గ్లాకం ( pearl millet botanical name in telugu ).

సజ్జలను భారత దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కొరకమైన పేరుతో పిలుస్తారు. అవి హిందీలో అయితే సజ్జలను బాజ్ర ( pearl millet in Hindi ) అని మరియు తమిళంలో ముట్టు తిన్నై ( pearl millet in Tamil )అని, మలయాళంలో ముత్తు మిల్లెట్టు ( pearl millet in Malayalam) అని,కన్నడ భాషలో ముట్టు రాగి (pearl millet in kannada), మరాఠీ భాషలో మోటి బజ్రి ( pearl millet in Maraati )అని పిలుస్తారు. ఈ సజ్జలను భారత దేశంలో ఎక్కువ శాతం రాజస్థాన్ మరియు తమిళనాడు ,గుజరాత్,మహారాష్ట్ర,ఉత్తర ప్రదేశ్,ఆంధ్ర ప్రదేశ్, హర్యానా, కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ రాష్టలలో ఎక్కువగా సాగు చేస్తారు. ఈ సజ్జలను మనుషుల ఆహారంగా మరియు పశువుల మేతగా ఉపయోగిస్తారు. ఇది వేసవి కాలంలో ఎక్కువగా సాగు చేస్తారు. సజ్జలు గడ్డి జాతికి చెందిన మొక్కగ పరిగణిస్తారు.

Pearl millet in telugu

సజ్జలలోని పోషక విలువలు: Neutrients values in pearl millet in telugu

సజ్జలలో అన్ని రకాల విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయని ప్రాచీన కాలంలోనే శాస్రతవేత్తలు వెల్లడించారు. సజ్జలను మన ముందు తరం వాళ్ళు ఎక్కువగా సాగు చేసేవారని ఎక్కువగా వారు ఈ ధాన్యాలను ఆహారంగా తీసుకొని ఆరోగ్యంగా ఉండేవారట. వంద గ్రాముల సజ్జలలో ఫైబర్ 8.7 g . ఫ్యాట్స్ 4.3, సచురేటెడ్ ఫ్యాట్స్ 0.5, మోనో సచురేటెడ్ ఫాట్స్ 0.8,పాలీ సచురేటెడ్ ఫ్యాట్స్ 1.9, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ 0.1 మరియు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ 2.1, ప్రోటీన్స్ 11g , విటమిన్లు b1 0.41mg, b2 0.29 mg,b3 4.72, B5 0.85mg, b6 0.38, b9 85mg, విటమిన్ k 0.9mg , మినరల్స్ కాల్షియం 8mg, ఐరన్ 3mg, మెగ్నీషియం 113 mg, మాంగనీస్ 1.6mg, పస్పరాస్ 285 mg, పొటాషియం 195 mg, సోడియం 5 mg, జింక్ 1.7mg, అలాగే కాపర్ 0.7 mg , మరియు సెలీనియం 2.6mg ఇలా మానవ ఆరోగ్యానికి కావల్సిన అన్ని రకాల పోషకాలు సజ్జల నుండి పొందవచ్చు .

సజ్జల ఉపయోగాలు ( benifits of pearl millet in telugu ) :

1.సజ్జలలో అధిక ఫైబర్ ఉంటుంది. అది ఆహారాన్ని సరిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకుండా బాధపడేవారు సజ్జలను తినడం వలన తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది.

2.సజ్జలు తినడం వలన గుండెకు సంబంధించిన కార్డియోవాస్కులర్ వ్యాధిని అదుపులో ఉండేలా దోహదపడుతుంది.

3.సజ్జలలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

4.సజ్జలను ఆహారంగా తీసుకోవడం వలన నిద్ర లేమితో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది.

5.సజ్జలు మానసిక ఒత్తిడిని తగ్గించి ఆందోళన లాంటి మానసిక వ్యాధులను నివారిస్తుంది.

6.సజ్జలు మధుమేహంతో బాధపడేవారికి ఒక మంచి ఆహారంగా డాక్టర్స్ సూచిస్తున్నారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని పెంచకుండా చూస్తుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES