onion juice for hair :
ఉల్లి రసం ( onion juice for hair ) కూడా మన జుట్టు పెరుగుదల కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉల్లి రసం లో యాంటి ఫంగల్ లక్షణాలు ఉంటాయి అంతేకాకుండా ఉల్లి రసం లో యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే ఉల్లి రసం జుట్టు కి అప్లై చేయడం వల్ల తల పై ఏమైన ఇన్ఫెక్షన్లు ఉంటే తగ్గిపోతాయి. అంతేకాకుండా చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడుతుంటారు అలాంటి వారు ఉల్లి రసం వాడటం వల్ల చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. ఈ మధ్య కాలంలో ఈ ఉల్లి రసాన్ని చాలా మంది వాడుతున్నారు.
ఉల్లి రసం లో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. సల్ఫర్ కి రాలిపోయిన జుట్టు ను మళ్ళీ తిరిగి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలిపోయే సమస్యని కూడా తగ్గిస్తుంది. ఉల్లి రసం నీ వాడటం వల్ల స్ప్లిట్ హెయిర్ రాకుండా జుట్టు ఒత్తుగా మరియు బలంగా పెరిగేలా చేస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో ఉల్లి రసం ను ఎక్కువగా వాడుతున్నారు. ఉల్లి రసం కి మార్కెట్ మంచి ధర పలుకుతుంది. వివిధ రకాల బ్రాండ్ ల పేరుతో మార్కెట్ లో ఉల్లి రసం అందుబాటులో ఉంది.
కావాల్సిన పదార్థాలు :
ఉల్లి గడ్డ
తయారీ మరియు వాడే విధానం :
ఒక నాలుగు ఉల్లి గడ్డల్ని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడగాలి. తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న గా కట్ చేసుకున్న ఉల్లి గడ్డ ముక్కల్ని గ్రైండర్ లో వేసుకోవాలి. బయటకి తీసి వడబోసి ముక్కల్ని మరియు రసాన్ని వేరు చేయాలి. రసాన్ని ఒక బాటిల్ లో తీసుకుని జుట్టు పై అప్లై చేయాలి. ఇలా అప్లై చేసి ఒక గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత షాంపూ తో హెయిర్ నీ శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి కనీసం రెండు సార్లు చేయడం వల్ల మీ ఊడిపోయిన జుట్టు తిరిగి రావడమే కాకుండా జుట్టు బలంగా మరియు వొత్తుగ పెరుగుతుంది.