Nannari : నన్నారి
నన్నారి వేరుతో ( nannari ) రాయలసీమ లో ఒక ప్రత్యేకమైన శీతల పానీయం ని తయారు చేస్తారు. వేసివి వచ్చిందంటే చాలు ఈ నన్నారి మొక్కల వేరుతో చేసే శీతల పానియాన్ని ఎంతో ఇష్టంగా సేవిస్తారు. నన్నారి ఎక్కువగా మనకు తెలుగు రాష్ట్రాల్లో కడప జిల్లాలో లభిస్తుంది. అక్కడ ప్రజలు నన్నారి ని ( nannari root ) ఎక్కువగా పండిస్తారు. నన్నారి వేరుతో తయారు చేసే శీతల పానీయాలు మార్కెట్ లో చాలా దర్శనమిస్తుంటాయి. వేసవిలో డీహైడ్రేషన్ భారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా శీతల పానీయాలు గానీ లేదా నీళ్ళు గానీ ఎక్కువగా తీసుకొవాలి. నన్నారి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా నన్నారి ( nannari ) వేరుతో తయారు చేసే శీతల పానీయాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది మరియు శరీరాన్ని చల్లబరుస్తుంది.
నన్నారి ఇండియన్ సర్సపరిల్లా అని కూడా పిలుస్తారు. భారతదేశం లో వాణిజ్యపరంగా నన్నారి కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. కానీ వీటిని కొనే ముందు జాగ్రత్తగా చూసి తీసుకోవాలి ఎందుకంటే మార్కెట్ లో చాలా వరకు కృత్రిమ రకాలు అమ్మే అవకాశం ఉంది. నన్నారి వేరుని మన భారతదేశం లో ఎక్కువగా ఆయుర్వేద మందుల తయారీలో వాడుతారు. నన్నారి లో యాంటి ఆక్సిడెంట్స్ లు వుంటాయి కాబట్టి ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
నన్నారి లో పోషక విలువలు : Neutrient values in nannari
నన్నారి వేరులో మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్ని ఉంటాయి. ఇది మన శరీరాన్ని చల్లబరుస్తుంది. దీంట్లో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా మెగ్నీషియం, ఐరన్, కాల్షియమ్, ఫాస్పరస్ మరియు జింక్ ఉంటాయి. దీంట్లో విటమిన్ బి 6 , విటమిన్ ఎ మరియు రిబోఫ్లావిన్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.
నన్నారి యొక్క ఉపయోగాలు : health benefits of nannari
1.నన్నారి ( nannari ) తీసుకోవడం వల్ల శరీరం లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.
2.అర్ధరైటిక్ సమస్యతో బాధపడుతున్నవారు ఈ నన్నారి వేరుతో తయారు చేసిన షర్బత్ ని మీరు ఒక్కసారి తాగితే అస్సలు వదిలిపెట్టరు మరియు అర్ధరైటిక్ సమస్య ని తగ్గుతుంది.
3.ఉబకాయ సమస్యతో బాధపడుతున్నవారు ఈ నన్నారి శర్భత్ ని తాగడం వల్ల ఉబకాయ సమస్య తగ్గుతుంది.
4.నన్నారి తీసుకుంటే శరీరంలోని టాక్సిన్స్ ను బయటకి పంపిస్తుంది.
5.నన్నారి తీసుకుంటే చర్మం ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా నిగారింపు సంతరించుకుంటుంది.
6.నన్నారి విరేచనాలు మరియు అతిసారం ని తగ్గిస్తుంది.
7.మలబద్దక సమస్యతో బాధపడుతున్నవారు నన్నారి తీసుకుంటే మలబద్దక సమస్య తగ్గుతుంది.
8.యూరినరీ ఇన్ఫెక్షన్ తో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు నన్నారి జ్యూస్ తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
9.నన్నారి శరీరం లో రక్తం ని శుద్ధి చేస్తుంది.
10.నన్నారి జ్యూస్ తాగితే శరీరాన్ని చల్లబరుస్తుంది అంతేకాకుండా శరీరం డీహైడ్రేషన్ భారిన పడకుండా కాపాడుతుంది. వేసవి లో నన్నారి జ్యూస్ తాగితే ఆరోగ్యానికీ ఎంతో మంచిది.
11.నోటి పుండ్లను కూడా నన్నారి నయం చేస్తుంది.
12.ఆయుర్వెదంలో నన్నారి ని ( nannari ) కుష్టు వ్యాధి మరియు సిఫిలిస్ వంటి అనేక వ్యాధుల నివారణకు వాడుతారు.