Naga Chaitanya & Shobitha dhulipala engagement photos :
హీరో నాగ చైతన్య సమంత తో బ్రేకప్ అయిన చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకరి ప్రేమలో పడి చివరికి ఈరోజు నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఇద్దరి జంట పై చాలా రోజుల నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారని రూమర్స్ క్రియేట్ అయ్యాయి. నాగ చైతన్య సమంత తో బ్రేకప్ అయిన తర్వాత సోషల్ మీడియా లో తను శోభిత ధూళిపాళ తో డేటింగ్ చేస్తున్నట్లు చాలా న్యూస్ వైరల్ అయ్యాయి. కానీ అప్పుడు ఈ న్యూస్ ను ఎవరు నమ్మలేదు. కానీ చివరకు ఇప్పుడు అదే నిజం అయింది. చివరికి వీళ్ళ ఇద్దరి ఎంగేజ్మెంట్ ( naga Chaitanya and shobitha dhulipala get engaged ) ఈరోజు ఉదయం జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ ప్రముఖులు మాత్రమే అటెండ్ అయ్యారు.
మొదటి సినిమా ద్వారా ఒక్కటి అయిన నాగ చైతన్య మరియు సమంత 2017 లో పెళ్లి చేసుకున్నారు మరియు వీళ్ళ ఇద్దరి మధ్యలో విబేధాలు రావడం తో ఇద్దరు ఇష్ట పూర్వకంగా దూరం అయ్యారు. ప్రస్తుతం తమ తమ లైఫ్ లో బిజీ అయ్యారు. కానీ సోషల్ మీడియాలో వీళ్లిద్దరి బ్రేకప్ చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేసింది. తర్వాత సమంత కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇద్దరు సినిమాల్లో బిజీ అయ్యారు. కానీ మళ్ళీ వీళ్ళు ఇద్దరు మళ్ళీ కలవబోతున్నారని సోషల్ మీడియాలో ఒకప్పుడు ఈ న్యూస్ ట్రెండింగ్ అయ్యింది.
ఈరోజు హీరో నాగార్జున ( Naga Chaitanya and Shobitha dhulipala engagement photos ) సోషల్ మీడియా వేదిక గా X లో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ను కన్ఫర్మ్ చేశారు. ఎవరు వూహించని విధంగా ఈరోజు నాగ చైతన్య తో శోభిత ధూళిపాళ తో ఎంగేజ్మెంట్ జరిగింది. శోభిత ధూళిపాళ మరియు నాగ చైతన్య ఫారిన్ వెళ్లిన ఫోటో లు సోషల్ మీడియాలో ఒకప్పుడు వైరల్ అయ్యాయి. శోభిత ధూళిపాళ పొన్నియన్ సెల్వాన్ , ది నైట్ మేనేజర్ 2 , మేజర్, గుడాచారి వంటి సినిమాల్లో నటించి ప్రేక్షులను తన నటనతో మెప్పించింది. చివరికి నాగ చైతన్య తో ఎంగేజ్మెంట్ చేసుకుని అక్కినేని కుటుంబానికి కోడలు అయ్యింది.