Monkey jack fruit :
మంకీ జాక్ ఫ్రూట్ ( monkey jack fruit ) బహుశా ఈ పండు గురించి అందరికీ ఎక్కువగా తెలీదు. చాలా తక్కువ మంది విని ఉంటారు. ఈ పండు చూడటానికి ఆకారం కొంచం విచిత్రంగా ఉంటుంది. ఈ మంకీ జాక్ ఫ్రూట్ ని మంకీ ఫ్రూట్ ( monkey fruit ) అని కూడా పిలుస్తారు . ఈ మంకీ జాక్ ఫ్రూట్ లో మన శరీరానికి కావల్సిన విటమిన్లు మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మంకీ జాక్ ఫ్రూట్ ని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వివిధ రకాల వ్యాధులను నయం చేస్తుంది ఈ మంకీ జాక్ ఫ్రూట్. ఈ మంకీ జాక్ ఫ్రూట్ ఎక్కువగా ఉష్ణ మండల ప్రాంతాల్లో పెరుగుతుంది.
మంకీ జాక్ ఫ్రూట్ ( monkey jack fruit ) యొక్క శాస్త్రీయ నామం ఆర్టో కార్పస్ లాకుచా. ఈ మొక్క మోరేసి కుటుంబానికి చెందిన ఉష్ణమండల సతత హరిత జాతికి చెందినది. ఈ మొక్క ఎక్కువగా మనదేశంలో మరియు థాయిలాండ్, మలేసియా, సింగపూర్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ మరియు శ్రీలంక దేశాల్లో లభిస్తుంది. ఈ మంకీ జాక్ ఫ్రూట్ చెట్టు యొక్క కలప చాలా విలువైనది. ఈ పండు లో బీటా కెరోటిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ పండును తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ మొక్క లోతట్టు కొండ మరియు అడవి ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. అంతెకాకుండా ఈ చెట్టు 10 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క ఆకులు పెద్దవి గా ఉంటాయి. మంకీ జాక్ ఫ్రూట్ monkey fruit చూడటానికి ఆకుపచ్చ మరియు పసుపు రంగులో ఉంటుంది. పండు ఆకారం క్రమ రహితంగా ఉంటుంది. దీని యొక్క రుచి పులుపు మరియు తీపి రంగులో ఉంటుంది. ఈ పండును హిందీలో లకుచ్, బధల్ అని , మరాఠీ లో క్షుద్రఫనాలు , ఫల , బదల్ అని, తమిళంలో ఈ పండును ఇలాగుసం, ఇరప్పలా అని, మలయాళం లో చింప, పులింజక్క అని, కన్నడలో లకూచా, ఎసులుహులి , ఆంగ్లం లో ఈ పండును మంకీ జాక్ ఫ్రూట్ అని పేర్లతో పిలుస్తారు.
Neutrients values in monkey Jack fruit : మంకీ జాక్ ఫ్రూట్ లో పోషక విలువలు
మంకీ జాక్ ఫ్రూట్ లో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మంకీ జాక్ ఫ్రూట్ లో విటమిన్ సి , బీటా కెరోటిన్, యాంటీ యాక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.
Monkey Jack fruit benefits : మంకీ జాక్ ఫ్రూట్ తో ఆరోగ్య ప్రయోజనాలు
1.మంకీ జాక్ ఫ్రూట్ లో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి మన శరీరంలో రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది.
2.జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడుతున్నవారు ఈ మంకీ జాక్ ఫ్రూట్ తినడం వల్ల జుట్టు రాలిపోయే సమస్య కి చెక్ పెట్టవచ్చు.
3.మంకీ జాక్ ఫ్రూట్ తినడం వల్ల కాలేయ పని తీరును మెరుగుపరుస్తుంది.
4.కీళ్ళ వాపు మరియు విరేచనాలు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ మంకీ జాక్ ఫ్రూట్ తింటే మంచి ఫలితం ఉంటుంది.
5.మంకీ జాక్ ఫ్రూట్ యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో క్యాన్సర్ కణాల సంఖ్య వృద్ధిని ని అడ్డుకుంటుంది.
6.మంకీ జాక్ ఫ్రూట్ చర్మ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది.