Lingashtakam : లింగాష్టకం
పురాణాల నుంచి ప్రస్తుత ఆధునిక యుగం వరకు శివుడిని భారతదేశం లో ఎక్కువగా కొలుస్తారు. భారత దేశంలో అత్యధికంగా ఉన్న దేవాలయాల్లో శివుడి దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే భారతదేశం లో శివుడిని ఎక్కువగా పూజలు చేస్తారు. శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఏం అడిగిన శివుడు మన కోరికలు తీరుస్తాడు అని అంటుంటారు. అందుకే శివుడిని బోలా శంకరుడు అని పిలుస్తారు. అంటే భక్తి తో శివుడిని ప్రార్థిస్తే ఏం అడిగిన ఇస్తాడు అని అర్థం. శివుడికి కార్తీక మాసం లో ప్రత్యేక పూజలు చేస్తారు.
శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అందుకే శివుడిని అభిషేక ప్రియుడు అంటారు. శివుడికి అభిషేకం చేస్తే చెడు పోయి అంతా మంచే జరుగుతుంది అని అందరికీ నమ్మకం.అందుకే శివలింగానికి ఎక్కువగా అభిషేకం చేస్తుంటారు. శివాభిషేకం లింగానికి చేస్తారు. శివుడికి అభిషేకం అంటే ఇష్టం కాబట్టి లింగం పై తారా పాత్ర అనే ఒక చిన్న పాత్రని వ్రెలాడదీస్తారు. సాధారణంగా శివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. పంచామృతాలు అంటే పెరుగు , పాలు లేదా నీరు , చక్కెర, తేనె మరియు నెయ్యి తో శివుడికి అభిషేకం చేస్తారు. అభిషేకం తర్వాత లింగానికి నీరు తో అభిషేకం చేసి తర్వాత చందనం రాసి , విభూతి పెడతారు. తర్వాత శివుడికి పువ్వులు మరియు అరటి పండ్లు సమర్పిస్తారు. పువ్వుల్లల్లో ఆకమధ పువ్వులు , దాతుర పువ్వులు మరియు నీలి లేదా పింక్ లేదా తెల్ల కమలం పువ్వులు పూజకి శుబప్రధమైనది.
శివపూజ చేయడం వల్ల శివుడు తన భక్తులను శని ప్రతి కూల ప్రభావం నుండి రక్షిస్తాడు. అంతేకాకుండా ఇంట్లో ఉండే అందరి ఆరోగ్యం బాగుండడమే కాకుండా వారిని అనారోగ్యాల బారిన పడకుండా కాపాడతాడు. శివ పూజ చేయడం వల్ల పునర్జన్మ చక్రం నుంచి విముక్తి కలుగుతుంది. శివుడికి ఎక్కువగా సోమవారం అభిషేకం మరియు పూజ చేస్తారు. ఆవు పాలతో శివుడికి రుద్రాభిషేకం చేస్తే అంతా మంచి జరుగుతుందని అంతేకాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని అంటుంటారు. శివుడికి సోమవారం రోజు పూజ చేసి లింగాష్టకం ( lingashtakam ) వింటే అంతా మంచి కలుగుతుంది. పూజ అనంతరం కచ్చితంగా లింగాష్టకం ( lingashtakam ) చదవండి లేదా వినండి.
Lingashtakam : Lingashtakam in telugu
బ్రహ్మమురారి సురార్చిత లింగం |
నిర్మల భాసిత శోభిత లింగం ||
జన్మజదఃఖవినాశక లింగం |π
తత్ప్రణమామి సదాశివ లింగం ||
దేవముని ప్రవర్చిత లింగం |
కామ దహన కరుణాకర లింగం ||
రావణ దర్పవినాశక లింగం |π
తత్ప్రణమామి సదాశివ లింగం ||
సర్వ సుగంధి సులేపిత లింగం |
బుద్ధి వివర్ధవకారణ లింగం ||
సిద్ధ సురాసుర వందిత లింగం |π
తత్ప్రణమామి సదాశివ లింగం ||
కనక మహామణి భూషిత లింగం |
ఫణి పతివేష్టి శోభిత లింగం ||
దక్షసుయజ్ఞ వినాశక లింగం |π
తత్ప్రణమామి సదాశివ లింగం ||
కుంకుమ చందనలేపిత లింగం |
పంకజహార సుశోభిత లింగం ||
సంచిత పాప వినాశన లింగం |π
తత్ప్రణ మామి సదాశివ లింగం ||
దేవగణార్చిత సేవిత లింగం |
భావైర్భక్తి రేవచ లింగం ||
దినకర కోటి ప్రభాకర లింగం |π
తత్ప్రణ మామి సదాశివ లింగం ||
అష్టదళోపరి వేష్టిత లింగం |
సర్వసముద్భవకారన లింగం ||
అష్టదరిద్ర వినాశక లింగం |π
తత్ప్రణ మామి సదాశివ లింగం ||
సురగురు సురవర పూజిత లింగం |
సురవరపుష్పపదార్చిత లింగం ||π
పరమపరంపరామాత్మక లింగం |•
తత్ప్రణమామి సదాశివ లింగం..||
లింగాష్టకం మంత్రం యొక్క అర్థం : Lingashtkam meaning in telugu
Brahma mariyu Vishnu devathalathe poojimpabadda lingam..
Nirmalamyna maatalache alankarinchabadina lingam..
Janma valla puttina badhalanu naashanam chese lingam..
Oh sadhashiva lingam niku namskaram…|
Dhevamunulu mariyu maharushulu poojimpa badina lingamu..
Manmadhudini dhahanam chesina mariyu apaaramaina karunanu choope chethulu gala shivalingamu…
Raavanudi garvaanni nashanam chesinatti shivalingamu..
Niku Eve Naa namaskaraalu O sadha Shiva lingamaa …
Anni manchi gandhaalu manchiga poosina Shiva lingamu..
Manushula buddhi vikaasaniki Karanamaina Shiva lingamu..
Siddhulu mariyu rakshasulu mariyu devathala chetha keerthimpabadina Shiva lingamu …
Niku Eve Naa namaskaraalu O sadha Shiva lingamaa …
Bangaram mariyu kanaka manula chetha alankarimpa badina Shiva lingamu..
Naagaraju nivaasamu chetha alankarimpa badina Shiva lingamu…
Dhakshunudu chesina manchi yagnanni nashanam chesina Shiva lingamu..
Niku Eve Naa namaskaraalu O sadha Shiva lingamaa..
Kumkuma mariyu gandhamu puyabadina Shiva lingamu…
Kaluvala dhanda chetha chakkaga alankarimpa badina Shiva lingamu..
Sankraminchina paapaalanu nashanam chese Shiva lingamu..
Niku Eve Naa namaskaraalu O sadha Shiva lingamaa …
Dheva ganaala chetha poojimpabadina mariyu sevincha badina Shiva lingamu…
Chakkati bhavam tho koodina bhakthi chetha poojimpadina Shiva lingamu..
Koti suryula kanthitho velige maro Surya bimbam atuvanti Shiva langamu..
Niku Eve Naa namaskaraalu O sadha Shiva lingamaa …
Yenimidhi rakaala aakula meedha nivasamu unde Shiva lingamu..
Anni samanamuga janminchadaniki Karanamaina Shiva lingamu..
Yenimidhi rakaala dharidhramulani nashanamu chese Shiva lingamu…
Niku Eve Naa namaskaraalu O sadha Shiva lingamaa ….
Dheva guruvu mariyu dhevathala chetha poojimpabadina Shiva lingamu..
Dhevathala thotallo pooche puvvulatho yellakalam poojimpabade Shiva lingamu…
Oo Shiva ni sannidhiye aaa oka swargamu..