HomeHealthKodo millet in telugu : అరికెల తో ఆరోగ్య ప్రయోజనాలు

Kodo millet in telugu : అరికెల తో ఆరోగ్య ప్రయోజనాలు

Kodo millet in telugu :

కొడొ మిల్లెట్ ని తెలుగు భాషలో అరికలు ( Kodo millet in telugu ) అని పిలుస్తారు. ఈ అరికలు చూడటానికి ముదురు గోధుమ రంగులో ఉంటాయి. వీటిలో అధిక శాతం పోషక విలువలు ఉండడం వలన పూర్వం నుండి వీరికి మంచి శక్తిని ఈచ్చే ఆహారంగా పేరు పొందింది. ఇది తృణ ధాన్యాలలో ఒకటి. అరికల మొక్క చూడటానికి ఒక గడ్డి మొక్కగా కనిపిస్తుంది. ఈ అరికలను మొదటగా భారత దేశంలోని మహారాష్ట్ర మరియు రాజస్ధాన్ ప్రాంతాల్లో పండించేవారు. ఈ అరికలను భారత దేశంలోనే కాకుండా ఫిలిఫైన్స్ , థాయ్ లాండ్, ఇండోేషియా, వియత్నాం ,ఆఫ్రికా పాటుగా వివిధ దేశాలలో సాగు చేస్తున్నారు.

అరికల యొక్క శాస్ర్తీయ నామం పాస్పలమ్ స్క్రోబిక్యులాటమ్. అరికలు ఎంత కష్టతరమైన వాతావరణం లో అయినా పెరుగుతాయి. అరికలు మంచి పంటను అందించే సామర్థ్యం కలిగిన మొక్కగా చెబుతుంటారు. నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలలో అరికలను ఎక్కువగా సాగు చేస్తారు.ఆఫ్రికా లాంటి దేశాలలో కరువులో కూడా సాగు చేసి వారి ఆకలిని తీర్చేదిగా ఈ పంట పేరు పొందింది. ఇందులో ఉండే పోషక విలువలు మంచి ఆరోగ్యాన్ని అందచేస్తాయని శాస్త్రవేత్తలు వారి పరిశోధనలో తెలిపారు.

ఈ అరికలను ( Kodo millet in telugu ) వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా వండుకొని తింటుంటారు. కొందరు ఉప్మా లా, చపాతి లా, కిచిడి లా, ఇలా ఇంకా ఎవరికి నచ్చినట్టు వారు తింటారు. కానీ అరికలను వంటచేసే ముందు 6 గంటలు నాన బెట్టాలి లేదంటే తిన్న తరువాత కడుపు ఉబ్బరంగా ఉండటం, కడుపులో గ్యాస్ పెరగడం లాంటి సమస్యలు వస్తాయి.

అరికలను ఆయా ప్రాంతాల్లో వారి వాడుక భాషలో పిలుస్తారు. తెలుగులో అరికలు ( Kodo millet in telugu ) అని పిలిచినట్టు హిందీలో అయితే అరికలను కొడెన్ లేదా కోడ్రా ( kodo millet in Hindi ) అని పిలుస్తారు. అరికలను తమిళంలో వరగు అని( kodo millet in Tamil ) ,మలయాళంలో కూవర్ ( kodo millet in Malayalam ) అని,మరాఠీలో కొద్ర ( kodo millet in Maraati ) అని, పంజాబీలో కొద్రా ( kodo millet in Panjabi ) అని, బెంగాలీలో కొడో ( kodo millet in Bangali ) అని , గుజరాత్ కోద్ర అని ( kodo millet in gujarati ) ,ఒరియలో కొడువా అని ( kodo millet in oriya ) ,కన్నడలో హర్క అని ( kodo millet in kannada ) పిలుస్తారు.

అరికలలో పోషక విలువలు : Neutrients Values in kodo millet in telugu

వంద గ్రాముల అరికలలో ప్రోటీన్ 10.5గ్రాములు, ఫ్యాట్ 3.3 గ్రాములు,మినరల్స్ 2.3గ్రాములు, ఫైబర్ 11 గ్రాములు,విటమిన్ B3 2.5గ్రాములు, B1 0.19 గ్రాములు,B2 0.08 గ్రాములు, కాల్షియం 26.0 mg, సోడియమ్ 3.26 mg, జింక్ 1.6 ,ఐరన్ 0.6,ఫోలేట్ 32.06 mcg, విటమిన్ k o.6mcg , ఫాస్ఫరస్ 188mg, పొటాషియం 109.5mg ఇలా అన్ని రకాల పోషకాలు లభిస్తాయి.

అరికల ఉపయోగాలు ( benifits of kodo millet in telugu ) :

1.అరికలను ఎక్కువగా షుగర్ పేషంట్స్ కి మంచి ఆహారంగా భావిస్తారు. ఎందుకంటే ఇవి తక్కువ గ్లిసిమిక్ ఇండెక్స్ ఉన్న ధాన్యాలు. వీటిని తీసుకోవడం వలన మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది అని డాక్టర్స్ సూచిస్తున్నారు.

2.బ్యాక్టీరియల్ ఇన్ఫెకషన్లలతో బాధ పడేవారికి అరికలు ఎంతో ఉపయోగపడుతాయి. అరికలను రోజు వారి ఆహారంగా తీసుకుంటే ఇన్ఫెకషన్లను తగ్గిస్తుంది. అలాగే భవిష్యత్తు లో కూడా ఇన్ఫెకషన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

3.అరికలలో ఫైబర్ అధికంగా ఉండడం వలన ఇది బరువు తగ్గడానికి మరియు జీర్ణ వ్యవస్థని సక్రమంగా పని చేయడానికి ఉపయోగపడుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.

4.అరికలలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి శరీరంలో ఏర్పడిన ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. అలాగే క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా ఉండటానికి అడ్డుకుంటుంది.

5.అరికలలో మన శరీరానికి కావల్సిన మినరల్స్ మరియు విటమిన్లు ఉంటాయి. అవి మన శరీరానికి కావల్సిన పోషకాలను అందిస్తాయి. పోషకాహార లోపం తో బాధపడేవారికి అరికలు ఒక మంచి ఆహారం.

6.అరికలు గుండె ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతాయి.

7.అరికలు శరీరానికి కావల్సిన శక్తిని అందచేస్తాయి. అంతే కాకుండా మెదడు నరాల వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి ఉపయోగపడుతాయి అని డాక్టర్స్ చెబుతున్నారు.

RELATED ARTICLES
LATEST ARTICLES