king of kotha movie review :
దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోత ( king of kotha movie ) ఈ రోజు ఆగస్ట్ 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించారు. ఈ మధ్యనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనికా సురేంద్రన్ , షబ్బీర్ , ప్రసన్న, ఉష ,వినోద్ , గోకుల్ సురేష్ , శాంతి కృష్ణ , రితిక తది తరులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో రితికా ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ మధ్య కాలంలోనే ఈ సాంగ్ ని చిత్ర యూనిట్ విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ సాంగ్ ఒక ఊపు ఊపింది. ఈ సినిమాకి అభిలాష్ జోషి దర్శకత్వం వహించారు. ఈ కింగ్ ఆఫ్ కోత సినిమాకి షాన్ రెహమాన్ మరియు జెక్స్ బిజొయ్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకి ఎడిటర్ గా శ్యామ్ మరియు సినిమాటోగ్రాఫర్ గా నిమిష్ రవి పనిచేశారు. ఈ సినిమా ని హీరో దుల్కర్ సల్మాన్ వెఫేరర్ ఫిల్మ్స్ మరియు జీ స్టూడియోస్ పతాకంపై నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదల ఈ సినిమా ( King of kotha movie review ) ప్రేక్షకులను ఎంతప్ వరకు మెప్పిస్తుందో చూడాలి..
కథ : story ( King of kotha movie review and rating )
కోతా పట్టణం లో ఎక్కువ డ్రగ్స్ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఈ కోతా పట్టణం లో ఖన్నా బాయ్ మరియు రాజు డ్రగ్స్ అమ్మే వారు మరియు ఇద్దరు ప్రాణ స్నేహితులు కూడా కానీ ఖన్నా బాయ్ ( డాన్స్ రోజ్ షబ్బీర్ ) మరియు రాజు ( దుల్కర్ సల్మాన్ ) ఒక కారణంగా విడిపోతారు. షాహుల్ హాసన్ ( ప్రసన్న ) ఈ కోతా పట్టణం కి CI గా వస్తారు. ఆ పట్టణంలో జరిగే డ్రగ్స్ వ్యాపారం సమూలంగా నిర్మూలించాలి అనుకుంటాడు. కానీ షాహుల్ హాసన్ వల్ల అవ్వదు. తర్వాత షాహుల్ హాసన్ ఏం చేశాడు ? ఎలాంటి సవాళ్లని ఎదురుకున్నాడు అని తెలుసుకోవాలి అనుకుంటే సినిమాని చూడాల్సిందే… !
పెర్ఫార్మెన్స్ : performance
ఈ సినిమాలో ( King of kotha movie review ) హీరో దుల్కర్ సల్మాన్ రాజు పాత్రలో చాలా చక్కగా నటించాడు. ఇది వరకు సినిమాలలో లవర్ బాయ్ గా నటించిన దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో రౌడీ పాత్రలో నటించారు. ఈ సినిమాలో దుల్కర్ ది వన్ మ్యాన్ షో గా చెప్పుకోవాలి. ఈ సినిమా కథ ని చూస్తుంటే ఈ కథ దుల్కర్ కి సరిపోదు అనిపిస్తుంది. ఈ సినిమా చాలా సింపుల్ గా ఉండే గ్యాంగ్ స్టార్ కథ. కథ లో మరీ అంత ట్విస్ట్ లు ఎం ఉండవు. ఈ సినిమా కథ చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ సినిమా లో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక గా చాలా బాగా నటించారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ కి పెద్దగా సన్ని వేషాలు ఏమి లేవు. ఈ సినిమాలో కన్నన్ గా విలన్ పాత్రలో నటించిన షబ్బీర్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో అనికా సురెంద్రణన్ హీరో చెల్లెలి పాత్రలో చక్కగా నటించింది. శాహల్ హుసేన్ పోలీస్ పాత్రలో చాలా బాగా నటించారు. ఉష , వినోద్ , సురేష్ మరియు శాంతి కృష్ణ తమ తమ పాత్రలకి తగిన న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకి మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా లో కొన్ని సన్ని వేషాలలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ సన్ని వేశాలని హై రేంజ్ లో ఎలివేట్ చేసింది. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ మరియు రెహ్మాన్ సంగీతం ని చాలా బాగా అందించారు. ఈ సినిమాలో రితికా చేసిన స్పెషల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నిమిష్ రవి సినిమాటోగ్రపీ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు ఈ సినిమా కథని బాగా రాసుకున్న , ఈ కథ ని సరిగా ఎలివేట్ చేయడంలో విఫలం అయ్యారు. అంతేకాకుండా కథ కూడా కొంచం సింపుల్ గా ఉంటుంది. ఈ సినిమా కి ఎడిటర్ గా శ్యామ్ శశిధరన్ పనిచేశారు. ఎడిటర్ గా ఈ సినిమాకి శ్యామ్ విఫలం అయ్యారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ మరియు సాంగ్స్ కొంచం పర్వాలేదు అనిపించింది.
ప్లస్ పాయింట్స్ : Plus points
- దుల్కర్ సల్మాన్ నటన
- రితిక స్పెషల్ సాంగ్
- షబ్బీర్ నటన
- సెకండ్ హాఫ్
- మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ : minus points
- ఫస్ట్ హాఫ్
- కథ
- ఎడిటింగ్
- క్లైమాక్స్
- కథ స్లో గా నడవడం
తీర్పు : కింగ్ ఆఫ్ కోత సినిమా బోరింగ్ గ్యాంగ్ స్టర్ కథ. ఈ సినిమా దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్ కి చాలా నిరాశ పరిచింది.
Telugusitara. com రేటింగ్ : 2.5/5