Katla fish :
కట్ల చేప భారతదేశానికి చెందిన మంచి నీటిలో ఎక్కువగా పెరిగే చేప. కట్ల చేప ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందక పోయిన ఈ చేపని భారత దేశంలో ఎక్కువ మంది తింటుంటారు. ఈ కట్ల చేప ఎక్కువగా ఉత్తర భారత దేశం, మయన్మార్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మరియు నేపాల్ లో ఎక్కువగా లభిస్తుంది. ఈ కట్ల చేపని దక్షిణాసియా ” కార్ప్ ” అని కూడా పిలుస్తారు. ఈ కట్ల చేపలు వేగవంతంగా మంచి నీటిలో పెరుగుతాయి. ఈ చేపలు ఎక్కువగా 25 °C నుంచి 32 °C సెంటిగ్రేట్ మధ్య ఉష్ణోగ్రతలో ఎక్కువగా పెరుగుతాయి.
కట్ల చేప మందు భాగం విశాలంగా పెద్దగా ఉంటుంది. ఈ చేప యొక్క డోర్సెల్ వైపు బూడిద రంగులో పొలుసు ఉంటుంది. అంతేకాకుండా చేప బొడ్డు దగ్గర తెలుపు రంగు ఉంటుంది. ఈ చేప దాదాపుగా 180 cm ల పొడవు పెరుగుతుంది మరియు గరిష్టంగా 35 కిలోల వరకు బరువు పెరుగుతుంది.
ఈ చేపని నేపాల్ మరియు భారత దేశంలో కొన్ని ప్రాంతాల్లో భకురా అని పిలుస్తారు. ఈ చేపని ఆంగ్లంలో కట్ల ఫిష్ అని పిలుస్తారు katla fish in English . కట్ల చేప ని మలయాళం లో కరకట్ల లేదా కరక అని పిలుస్తారు catla fish in Malayalam . కట్ల చేపని హిందీ లో కాట్లా అని పిలుస్తారు katla fish in Hindi . కట్ల చేపని తెలుగులో బొచ్చే boche fish అని పిలుస్తారు katla fish in telugu . కట్ల చేప ని బెంగాలీలో కాట్లా అని పిలుస్తారు catla fish in Bengali .
Katla fish price :
కట్ల చేప మార్కెట్ లో ఆదరణ లేకపోయినా దీన్ని తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. కానీ ఈ చేపకు మార్కెట్ లో మంచి ధర పలుకుతుంది. ఈ కట్ల ఫిష్ కిలోకి 500 రూపాయల నుంచి 600 రూపాయల వరకు ఉంటుంది.
Neutrients values in katla fish : కట్ల చేపలో పోషక విలువలు
కట్ల చేపలో మన శరీరానికి కావల్సిన పోషక పదార్ధాలు అన్ని ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. కట్ల చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, సెలీనియం , కాల్షియమ్, విటమిన్ B12 , నియాసిన్ , యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
కట్ల చేప యొక్క ఉపయోగాలు : katla fish benefits
1.కట్ల చేపలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ మన శరీరంలో హానికరమైన ప్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి.
2.కట్ల చేపలో ఉండే కాల్షియమ్ శరీరంలో కండరాలని మరియు ఎముకలను దృఢంగా ఉంచుతుంది.
3.కట్ల చేపలో ఉండే విటమిన్ B12 నాడీ వ్యవస్థ ని మెరుగుపరుస్తుంది. జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది.
4.కట్ల చేపలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ని పదిలంగా ఉంచుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలో చెడు కొలెస్టరాల్ స్థాయిని తగ్గిస్తుంది.
5.కట్ల చేపలో కొల్లాజేన్ ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్య వంతంగా మరియు మృదువుగా , కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది.
6.కట్ల చేప ని రోజు డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆస్తమా లక్షణాల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
7.ఈ చేపని రోజు తినడం వల్ల డిప్రెషన్ ను కూడా తగ్గిస్తుంది.
8.కట్ల చేప రక్త ప్రసరణ ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా బరువు పెరగకుండా కాపాడుతుంది.