HomeHealthkafal fruit : ఉత్తరాఖండ్ కఫాల్ ఫ్రూట్ తో ఆరోగ్య ప్రయోజనాలు

kafal fruit : ఉత్తరాఖండ్ కఫాల్ ఫ్రూట్ తో ఆరోగ్య ప్రయోజనాలు

kafal fruit : bayberry fruit

భారత దేశం లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దట్టమైన అడవి ప్రాంతంలో లభించే అరుదైన పండు ఈ కఫాల్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ ఎక్కువగా మన దేశంలో ఉత్తరాఖండ్ లో లభిస్తుంది. ఈ పండు ఎక్కువగా వేసవిలో లభిస్తుంది. మన దేశం లో వేసవి కాలం లో ఎలా అయితే మామిడి పండు తింటారో , ఉత్తరాఖండ్ ప్రజలు ఈ కఫాల్ ఫ్రూట్ ని తింటారు. ఈ ఫ్రూట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి కూడా ఈ పండు అంటే చాలా ఇష్టం.

ఈ పండు చూడటానికి పరిమాణంలో చిన్నగా ఉంటుంది. ఈ పండు తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పండులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ కఫాల్ ఫ్రూట్ ని బెబెర్రి ( bayberry ) అని కూడా పిలుస్తారు. ఉత్తరాఖండ్ లో అడవులలో ఇవి ఎక్కువగా మనకు కనిపిస్తాయి. ఈ పండు ఎక్కువ రోజులు మాత్రం నిల్వ ఉండదు. కేవలం రెండు రోజులు మాత్రమే తాజా గా ఉంటుంది.

ఈ పండు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి చాలా మంది ఈ పండు ని ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు. ఇలా చేస్తే పండు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీనిని వంటకాల్లో కూడా వాడుతారు. అంతేకాకుండా పూర్వకాలం నుంచి ఇప్పటివరకు ఈ పండు ని ఆయుర్వేద మందుల తయారీలో కూడా వాడుతున్నారు. ఈ పండు తో పానీయాలు చేసుకుని కూడా తాగుతారు. ఈ పండ్లకు మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంది.

ఈ పండు తీయని మరియు పుల్లటి రుచిని కలిగి ఉంటుంది. కఫాల్ పండు ( kafal fruit ) యొక్క శాస్త్రీయ నామం మైరికా, ఇది మైరికేసి కుటుంబానికి చెందిన మొక్క. ఈ మొక్క ఎక్కువ ఉష్ణగ్రతలో ఉన్న ప్రాంతాల్లో పెరగదు. ఈ కఫాల్ ఫ్రూట్ ని ఆంగ్లంలో బే బెర్రీ అని పిలుస్తారు. సంస్కృతంలో కథ్ ఫల, హిందీలో కై పాల్ , ఉర్దూ లో కూడా కై పాల్ మరియు ఉత్తరాఖండ్ ప్రజలు మాత్రం కఫాల్ పండు అని పిలుస్తారు.

కఫాల్ ఫ్రూట్ ధర : kafal fruit price

కఫాల్ ఫ్రూట్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ ఫ్రూట్ ఎక్కువగా తక్కువ ఉష్ణోగ్రతలో మాత్రమే పెరుగుతుంది. ఈ పండు కి కిలో కి మార్కెట్ లో 150 రూ/ ధర పలుకుతుంది.

Neutrients values in kafal fruit : కఫాల్ ఫ్రూట్ లో పోషక విలువలు

ఈ కఫాల్ ఫ్రూట్ లో యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ హెల్మెంటిక్, యాంటీ మైక్రోబియల్ , హైపర్ టెన్షన్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ వంటి అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి.అంతేకాకుండా యాంటీ ఫంగల్ మరియు యాంటీ అస్తమాటిక్ లక్షణాలను కలిగి ఉంది. చూడటానికి చిన్న పరిమాణంలో ఉన్న ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కఫాల్ ఫ్రూట్ లో పొటాషియం , కాల్షియం , మాంగనీస్ , ఐరన్ , రాగి మరియు జింక్ పుష్కలంగా ఉంటాయి.

Kafal fruit benefits : కఫాల్ ఫ్రూట్ తో ఆరోగ్య ప్రయోజనాలు

1.కఫాల్ ఫ్రూట్ లో పొటాషియం ఉంటుంది. ఇది మన శరీరంలో నరాలు మరియు కండరాలు సరిగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.

2.కఫాల్ ఫ్రూట్ లో మెగ్నీషియం ఉంటుంది. ఇది మన గుండె పనతీరును మెరుగుపరుస్తుంది. కఫాల్ ఫ్రూట్ లో ఉండే కాల్షియం మరియు మెగ్నీషియం ఎలక్ట్రోలైట్ లని కణాల కి రవాణా చేయడంలో సహాయపడుతుంది.

3.కఫాల్ చెట్టు యొక్క బెరడు ని మానసిక వ్యాధులు మరియు అలెర్జీ వంటి వ్యాధుల చికిత్సలో వాడుతారు.

4.కఫాల్ ఫ్రూట్ లో యాంటీ ఆస్తమాటిక్ గుణాలు ఉన్నాయి. ఇది ఆస్తమా తో బాధపడుతున్నవారికి ఎంతో మేలు చేస్తుంది.

5.కఫాల్ ఫ్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దగ్గు , అల్సర్స్, రక్త హీనత , జ్వరం, విరేచనాలు మరియు గొంతు నొప్పి సమస్యలకి చికిత్స చేయడానికి వాడుతారు.

6.చెవి నొప్పి మరియు పంటి నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ కఫాల్ ఫ్రూట్ ని తింటే చెవి మరియు పంటి నొప్పి సమస్యలు తగ్గుతాయి.

RELATED ARTICLES
LATEST ARTICLES