jeera water benefits :
వంటింట్లో వాడే జీలకర్ర తో ( jeera water benefits ) చాలా ఉపయోగాలు ఉన్నాయి. జీలకర్ర ని వంటలో వాడటమే కాకుండా వీటిని వాటర్ లో వేడి చేసి ఆ నీటిని కూడా తీసుకుంటారు. జీలకర్ర ( jeera )పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు ఆయుర్వేద మందుల తయారీలో వాడుతారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీటితో ఎన్ని లాభాలు ఉన్నాయో.. అందుకే జీలకర్ర ని పూర్వకాలం నుంచి మనం రోజూ వంటల్లో వేసుకుంటాం. ఆరోగ్య నిపుణులు సైతం రోజు జీర వాటర్ ని తాగమని చెబుతుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు త్రాగ కూడదు. జీలకర్ర నీరు ఉదయం లేచాక పడిగడుపున తాగాలి. ఇలా పడిగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది.
జీలకర్ర వంటకాల్లో ( jeera water benefits ) ఆహారానికి రుచి ఇవ్వడమే కాకుండా శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర లో విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా జీలకర్ర లో ఫ్లవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. పూర్వకాలంలో ఏమైనా కడుపు కి సంబంధించిన సమస్యలు వస్తె జీలకర్ర నీరు ని ( cumin water ) తాగేవారు. కానీ ఇప్పుడు మనం అందరం అల్లోపతి మెడిసిన్స్ ని లేదా హోమియోపతీ మెడిసిన్స్ ని వాడుతున్నాం. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అందుకే ఇలాంటి మెడిసిన్స్ వాడటం కన్నా చక్క జీలకర్ర నీరు ని ( cumin water ) త్రాగడం ఎంతో మంచిది. దీని వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
jeera water benefits : జీలకర్ర నీరు తో ఆరోగ్య ప్రయోజనాలు
- బయట దొరికే జంక్ ఫుడ్ తినడం వల్ల చాలా మంది బరువు త్వరగా పెరుగుతుంటారు. ఇలా బరువు పెరగడం వల్ల మన శరీరంలో మరియు రక్తంలో కొవ్వు శాతం పెరిగి పోతుంది. దీని వల్ల లావు గా కనిపించడమే కాకుండా గుండె పోటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. జీలకర్ర నీరును తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. తద్వారా మీరు బరువు చాలా సులభంగా తగ్గవచ్చు. మీ గుండె కూడా పదిలంగా ఉంటుంది.
- మనం తిన్న ఆహారం ఒక్కోసారి సరిగా జీర్ణం అవ్వదు. అప్పుడు మనం అసిడిటీ తో లేదా కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అప్పుడు జీలకర్ర నీరు ని తీసుకుంటే మీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యి , అసిడిటీ మరియు కడుపు నొప్పి లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీలకర్ర నీరు మనం మెటబాలిజం రేటు ని పెంచుతుంది.
- జీలకర్ర నీరు లో ( cumin water benefits ) యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు జీలకర్ర నీరు ని త్రాగడం చాలా మంచిది.
- జీలకర్ర నీరు ని ప్రతి రోజూ ఉదయం పడిగడుపున తీసుకోవడం వల్ల బాడీ ని డిటాక్స్ ఫై చేస్తుంది. అందుకే రోజు జీర వాటర్ ని పడిగడుపున త్రాగడం చాలా మంచిది.
- జీలకర్ర నీరు త్రాగడం వల్ల ఇది మీ శరీరంలో చెడు కొలెస్టరాల్ ని మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయి ని తగ్గించి , మీ శరీరంలో మంచి కొలెస్టిరాల్ స్థాయి ని పెంచుతుంది. తద్వారా మీకు గుండె పోటు రాకుండ కాపాడుతుంది.