Jayam ravi and Priyanka mohan wedding photo :
తమిళ స్టార్ హీరో జయం రవి రీసెంట్ గా తన భార్యతో విడాకులు తీసుకున్న విషయం అందరికి తెల్సిందే. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఎక్కువ కావడం తో చివరికి వీరు ఇరువురి ఇష్టం మేరకు విడాకులు తీసుకున్నారు. జయం రవి తన భార్య ఆర్తి తో విడాకుల విషయం సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. జయం రవి ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. జయం రవి విడాకులు తీసుకున్న తర్వాత బెంగళూర్ కి చెందిన ప్రముఖ సింగర్ కేనిషా ఫ్రాన్సిస్ తో సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలా పుకార్లు వచ్చాయి.
జయం రవి మరియు సింగర్ కెనిషా పై పుకార్లు వినిపిస్తుంటే , నిన్న సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయింది. ఈ ఫోటో నీ సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేసారు. ఈ ఫోటోలో ఉంది ఎవరో కాదు హీరోయిన్ ప్రియాంక మోహన్. ఈ వైరల్ అయిన పోటోలో నటి ప్రియాంక మోహన్ మరియు జయం రవి ( jayam Ravi and priyanka mohan wedding photo ) మెడలో దండలు వేసుకుని ఫోటో కి పోజు ఇచ్చారు. ఈ ఫోటో చూసాక ప్రియాంక మోహన్ ఫ్యాన్స్ చాలా మంది హర్ట్ అయ్యారు.
ఈ ఫోటో సోషల్ మీడియా X లో వైరల్ అయ్యింది. చాలా మంది జయం రవి మరియు నటి ప్రియాంక మోహన్ కి ( jayam Ravi and priyanka mohan wedding photo ) సీక్రెట్ గా పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. ఫోటో లో పెళ్లి దుస్తుల్లో దర్శనం ఇవ్వ్వడం తో అందరు వీరిద్దరికీ నిజం గానే పెళ్లి అయింది అనుకున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ గూగుల్ లో ట్రెండింగ్ గా మారింది.
అసలు విషయం ఏంటంటే నిజానికి ఈ ఫోటో వాళ్ళ పెళ్లి ఫోటో కాదు. జయం రవి మరియు నటి ప్రియాంక మోహన్ జంటగా కలిసి నటించబోతున్న చిత్రం లోనిది. వీరిద్దరు కలిసి నటిస్తున్న బ్రదర్ సినిమాలో ని ఫోటో ఇది. నిజం గానే ఇద్దరికీ మ్యారేజ్ అయిందని ఈ ఫోటో నీ కొందరు ఆకతాయిలు సోషియా మీడియాలో షేర్ చేసారు.