HomeHealthjamun fruit : నేరేడు పండు లో అధ్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

jamun fruit : నేరేడు పండు లో అధ్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

jamun fruit :

మన దేశంలో దొరికే సీజనల్ ఫ్రూట్ లలో ఒకటి నేరేడు పండు ( jamun fruit ). నేరేడు పండు ని ఇండియన్ బ్లాక్ బెర్రీ లేదా జామూన్ అంటారు. ఈ నేరేడు పండు వేసవి కాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ నేరేడు పండు వేసవి కాలం ముగుస్తున్న సమయంలో పండుతాయి. వీటికి ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. మార్కెట్ లో వీటి ధర కూడా ఎక్కువే. నేరేడు పండు లో మన శరీరానికి కావల్సిన పోషక విలువలు అన్ని ఉంటాయి. అందుకే వీటిని తినమని వైద్యులు కూడా సలహా ఇస్తున్నారు.

మన ఆరోగ్యానికి నేరేడు పండు యే కాకుండా నేరేడు పండు చెట్టు ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ చెట్టు యొక్క ఆకులు రక రకాల వ్యాధులను నయం చేస్తాయి. నేరేడు చెట్టు 60 నుంచి 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ నేరేడు పండు ను అల్ల నేరేడు పండు అని కూడా పిలుస్తారు.

అల్ల నేరేడు పండు ( jamun fruit ) యొక్క శాస్త్రీయ నామం సిజిజియం క్యుమిని. ఇది మైర్టేసి కుటుంబానికి చెందిన మొక్క. సంస్కృతం లో నేరేడు పండు ని జంబులా లేదా జంబూ ఫలం అని పిలుస్తారు. హిందీలో నేరేడు పండు ని జమునా అని పిలుస్తారు. నేరేడు పండ్లు మన దేశం లో నే కాకుండా మడగాస్కర్, ఫిలిప్పైన్స్ , థాయిలాండ్ మరియు ఇండిస్ దేశాల్లో ఎక్కువగా లభిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ పండు కి మంచి డిమాండ్ ఉంది.

నేరేడు పండు యొక్క గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ చెట్టు యొక్క బెరడు మరియు ఆకులను , గింజలను ఆయుర్వేద మందుల తయారీలో కూడా వాడుతారు. ఈ నేరేడు పళ్లలో వివిధ రకాల శీతల పానీయాల తయారీలో వాడుతారు.అంతేకాకుండా జామ్ లు, జెల్లిలు మరియు ఐస్ క్రీమ్ తయారీలో వాడుతారు. పండని నేరేడు పండు ని కాయల్ని వైన్ తయారీలో మరియు వెనిగర్ తయారీలో వాడుతారు.

Neutrients values in jamun fruit : నేరేడు పళ్లలో పోషక విలువలు

నేరేడు పళ్ళ ని, గింజల్ని , ఆకుల్ని , చెట్టు బెరడు ని వివిధ రకాల మందుల తయారీలో వాడుతారు. వీటిలో అనేక రకాల వ్యాధులను నయం చేసే గుణం ఉంది. నేరేడు పళ్లలో విటమిన్ బి , విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, ఐరన్ , ఫాస్పరస్ ,మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా యాంటీ యాక్సిడెంట్లు, ప్రొటీన్లు మరియు ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి.

Jamun fruit benefits : జామున్ ఫ్రూట్ తో ఆరోగ్య ప్రయోజనాలు

1.డయాబెటిక్ పేషంట్స్ నేరేడు పండ్లను తినాలి వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నేరేడు పండులో ఉండే గింజల్లో జంబోలిన్ ఉంటుంది. జంబొలిన్ షుగర్ పేషంట్స్ లో రక్తంలో ఉండే చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. అందుకే వీటిని డయాబెటిక్ పేషంట్స్ తినడం చాలా మంచిది.

2.పిల్లలు లేకపోవడం వల్ల వైవాహిక జీవితం లో చాలా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. నేరేడు పండ్లు తినడం వల్ల మగవారిలో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. దీనివల్ల పిల్లలు పుట్టే అవకాశం కూడా పెరుగుతుంది. అందుకే సంతాన లేమి తో బాధపడేవారు నేరేడు పండ్లను తినడం మంచిది.

3.నేరేడు పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

4.నేరేడు పండులో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా కొలెస్టరాల్ ని కూడా తగ్గిస్తుంది.

5.నేరేడు పండు గిజల్ని పొడి చేసి , నీళ్ళలో కలిపి తాగితే స్త్రీలకి చాలా మంచిది. ఋతుస్రావం అధికంగా కాకుండా కాపాడుతుంది.

6.నేరేడు పండ్లను యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కాలేయ పని తీరును మెరుగుపరుస్తుంది.

7.అల్ల నేరేడు పండు ఉబకాయాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES