HomeHealthhypothyroidism symptoms : హైపో థైరాయిడిజం లక్షణాలు

hypothyroidism symptoms : హైపో థైరాయిడిజం లక్షణాలు

hypothyroidism symptoms :

థైరాయిడ్ ( thyroid ) అంటే ఈ కాలంలో తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రస్తుత కాలంలో చాలా మంది ఆడవారు థైరాయిడ్ సమస్య తో బాధపడుతున్నారు. థైరాయిడ్ లో ( thyroid types ) రెండు రకాలు అవి ఒకటి హైపో థైరాయిడ్ మరియు హైపర్ థైరాయిడ్. అసలు ఈ థైరాయిడ్ అనేది ఎలా వస్తుంది. ఇది ఎలా మనకు వచ్చింది అని తెలుసుకోవాలి అనేది కొన్ని లక్షణాలను బట్టి తెలుసుకుందాం.

థైరాయిడ్ గ్రంథి ( hypothyroidism symptoms ) శరీరంలోని మెడ భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి మూడు రకాల హార్మోన్ లను ఉత్పత్తి చేస్తుంది అవి ఒకటి T3,రెండు T4,మూడు TSH. థైరాయిడ్ హార్మన్లు ( thyroid hormones ) మన శరీరానికి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే మనం తిన్న ఆహారం ఎనర్జీగా మారినపుడు ఆ ఎనర్జీని మన అవయవాలకు ఎలా వాడాలి అనేది థైరాయిడ్ హార్మోన్స్ పని కాబట్టి. థైరాయిడ్ హార్మోన్స్ పని తగ్గిన మరియు అధికమైన శరీరంలో అనేక మార్పులు వస్తాయి.థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను సరిగా విడుదల చేయనపుడు ఈ హైపో థైరాయిడ్ వస్తుంది.

హైపో థైరాయిడ్ లక్షణాలు ( hypothyroidism symptoms ) :

1. హైపో థైరాయిడ్ వచ్చిన వారిలో ముందుగా మెడ భాగం లో ఉన్న థైరాయిడ్ గ్రంథి వాపు రావడం మరియు ఏదైనా మింగినపుడు గొంతులో నొప్పి రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

2.శరీరం ఎప్పుడు మొద్దుల అనిపించటం.

3.రోజులో తగిన సమయం నిద్ర పోయిన కూడా ఇంకా ఊరికే నిద్ర రావటం ఎప్పుడు పడుకొనే ఉండాలని అనిపించటం.

4.శరీరంలో శక్తి లేనట్టు ఎప్పుడు నీరసంగా ఉండటం.

5.మల బద్ధకం సమస్య .

6. ఋతుస్రావం లో మార్పులు రావడం. కొందరిలో ఋతుస్రావం ఆగిపోవటం కూడా కనిపిస్తుంది.

7.బరువు వేగంగా పెరగటం.

8. బరువు తగ్గాలని ప్రయత్నం చేసిన కూడా శరీరంలో ఎలాంటి మార్పులు ఉండకపోవటం.

9. హైపో థైరాయిడ్ వచ్చిన వారిలో శరీరం పొడిబారడం మరియు వెంట్రులు ఎక్కువగా ఊడిపోవడం చూస్తారు.

10.హైపో థైరాయిడ్ వచ్చిన వారిలో కొందరికి వాతావరణం వేడిగా ఉన్న కూడా చలిగా అనిపించటం. కనిపిస్తుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES