horse gram in telugu :
నవధాన్యాలలో ఉలవలకు ( horse gram in telugu ) ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉలవల తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. పూర్వకాలం లో పేద వారు ఎక్కువగా చారు చేసుకుని తినేవారు అంతేకాకుండా ఎద్దులకు మరియు గుర్రాలకు ఆహారంగా పెట్టేవారు. ప్రస్తుతం అందరూ వీటి విలువ తెలిసిన తర్వాత వాటితో వెరైటీ వంటకాలు చేస్తూ ఎంతో ఇష్టంగా తింటున్నారు.
ఉలవల్లో ( horse gram ) ఉండే పోషకాలు ఏ ఇతర నవధాన్యాలలో ఉండవు. పూర్వకాలం లో పేద వారు ఉలవలతో గుగ్గిల్లు చేసుకుని తినేవారు. ఉలవచారు అంటే అందరికీ తెలిసే ఉంటుంది. మన దేశంలో ఉలవచారు కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉలవచారు ని ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఉలవలను కొంచం ఉప్పు వేసి ఉడకబెట్టి ఎంతో ఇష్టంగా తింటారు. మన దేశంలో వీటిని ఎక్కువగా సాగు చేస్తారు. అంతేకాకుండా వీటిని అగ్నేయ ఆసియా ఉపఖండంలో, ఆఫ్రికా దేశాల్లో వీటిని కూడా ఎక్కువగా సాగు చేస్తారు. ఉష్ణమండల ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా సాగు చేస్తారు.
Neutrients values in harse gram in telugu : ఉలవలలో పోషక విలువలు
ఉలవల లో ( horse gram ) పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ( horse gram benefits ) ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు. ఉలవలలో ఐరన్ , కాల్షియం , భాస్వరం, ఫైబర్ మరియు పాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల ఉలవల లో 320 కేలరీలు , 20 గ్రాముల ప్రోటీన్లు, 4 గ్రాముల ఖనిజాలు , 50 గ్రాముల కార్బోహైడ్రేట్లు, కాల్షియం 260 గ్రాములు, ఫైబర్ 4 గ్రాములు , ఐరన్ 5 గ్రాములు మరియు పాస్పరస్ 300 గ్రాములు ఉంటాయి. ఉలవలలో ( horse gram in telugu ) కొవ్వు అస్సలు ఉండదు.
Benefits of Horse gram in telugu : ఉలవల తో ఉపయోగాలు ( horse gram benefits )
- ఉలవలలో ( horse gram ) ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఎదిగే పిల్లలకు ప్రొటీన్లు చాలా మంచిది. పిల్లల ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తాయి. ఉలవలలని ఉడికించి తినడం చాలా మంచిది. అంతేకాకుండా ముందు రోజు నీటిలో నానబెట్టి మొలకెత్తిన తర్వాత తింటారు. ఇలా తినడం ద్వారా పోషకాలు గణనీయంగా పెరుగుతాయి.
- మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడినపుడు ఉలవలని ఉడకబెట్టి తినాలి. ఇలా తినడం వల్ల కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి. కిడ్నీ సంబంధిత వ్యాధుల తో బాధపడేవారు కూడా వీటిని తింటే చాలా మంచిది. కిడ్నీ లో రాళ్లు వస్తె డాక్టర్లు సైతం ఉలవలని తినమని చెబుతుంటారు.
- ఎక్కిళ్ళ తో బాధపడేవారు ఉలవల ని తింటే ఎక్కిళ్లని తగ్గించవచ్చు. కళ్ళ నుంచి నీరు కారడం వంటి సమస్యలని కూడా ఉలవలు తింటే తగ్గిస్తాయి.
- కొందరు ఆకలి లేమితో బాధపడుతుంటారు అలాంటి వారు ఉలవల ను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆకలిని పెంచుతాయి.
- ఊబకాయం తో బాధపడుతున్నవారు ఉలవలని ఉడికించి తినడం లేదా మొలకెత్తినవి తినడం వల్ల పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది.
- ఉలవలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల రక్త పోటుని నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాకుండా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తుంది.
- ఋతుక్రమం , నెలసరి వంటి సమస్యలతో మహిళలు బాధపడుతుంటారు. అలాంటి వారు ఉలవల ని తింటే చక్కటి పలితం ఉంటుంది.