water apple : ( rose apple )
వాటర్ ఆపిల్ ( water apple ) ఒక చిన్న గంట ఆకారం లో ఉంటుంది. ఈ వాటర్ ఆపిల్ లో చాలా పోషక విలువలు ఉంటాయి. వాటర్ ఆపిల్ ఎక్కువగా మార్కెట్ లో మనకి వేసవి కాలంలో కనిపిస్తాయి. ఈ వాటర్ ఆపిల్ ని కొందరు రోజ్ ఆపిల్ అని కూడా పిలుస్తారు. ఈ వాటర్ ఆపిల్ గులాబీ లేదా లేత ఎరుపు రంగు లో ఉంటుంది. వాటర్ ఆపిల్ గులాబీ సువాసనతో మరియు రుచి తీయగా ఉంటుంది. వాటర్ ఆపిల్ ని శాస్త్రీయంగా సిజిజియం ఆక్వియం అని పిలుస్తారు. వాటర్ ఆపిల్ ని హిందీలో ” చంభక్క” ( chambakka ) అని , తమిళంలో ” జంబు ” ( jambu ) అని , మలయాళంలో ” జంభక్క ” ( jambakka ) అని మరియు తెలుగులో ” గులాబీ జమిచెట్టు ” ( gulabijamichettu ) లేదా ” గులాబీ జామికాయలు ” ( gulabijamikayaalu ) అని పిలుస్తారు.
వాటర్ ఆపిల్ ( water apple ) మలేషియా మరియు ఇండోనేసియా కి చెందినది. అంతేకాకుండా మన భారతదేశం లో మరియు అఫ్రికాలో, థాయిలాండ్ లో ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. వాటర్ ఆపిల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా వాటర్ ఆపిల్ లో మన శరీరానికి కావలసిన పోషక విలువలు ఉంటాయి. కొన్ని రకాల వాటర్ ఆపిల్స్ పసుపు రంగులో మరియు మరి కొన్ని వాటర్ ఆపిల్స్ ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
వాటర్ ఆపిల్ లో పోషక విలువలు : nutrients in water apple
వాటర్ ఆపిల్ లో మనకి కావాల్సిన పోషక విలువలు అన్ని ఉంటాయి. వాటర్ ఆపిల్ లో మినరల్స్, ఫైబర్స్ , విటమిన్స్, ప్రొటీన్లు , కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. వాటర్ ఆపిల్ లో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. అంతేకాక తక్కువ కొవ్వు మరియు క్యాలరీ కలిగిన పండు వాటర్ ఆపిల్. వాటర్ ఆపిల్ లో మెగ్నీషియం, కాల్షియమ్, భాస్వరం, జింక్, ఐరన్ , మాంగనీస్, విటమిన్ B1 ,B2 ,B3 మరియు విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి.
వాటర్ ఆపిల్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు : health benefits of water apple ( rose apple )
1.వాటర్ ఆపిల్ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా వాటర్ ఆపిల్ లో తక్కువ కొవ్వు మరియు డైటరి ఫైబర్స్ వుండటం వల్ల అధిక బరువుతో బాధపడేవారు ఈ వాటర్ ఆపిల్ ని తింటే శరీరంలో ఉన్న కొలెస్టిరాల్ స్థాయిని తగ్గించి, సన్నబడేలా చేస్తుంది.
2.వాటర్ ఆపిల్ లో ” జంబోలిన్ ” ఉంటుంది. జంబొలిన్ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. డయాబెటిక్ వ్యాధి తో బాధపడుతున్నవారు ఈ వాటర్ ఆపిల్ ని తింటే రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
3.వాటర్ ఆపిల్ లో విటమిన్ C మరియు జింక్ ఉంటుంది. విటమిన్ C మన శరీర రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ మన దరి చేరకుండా కాపాడుతుంది.
4.అధిక రక్తపోటు బాధపడేవారు వాటర్ ఆపిల్ ని తింటే చక్కని పలితం ఉంటుంది. వాటర్ ఆపిల్ మీ రక్తపోటుని అదుపులో ఉంచి , రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా గుండే పోటు రాకుండా కాపాడుతుంది.
5.అధిక పని వలన వొత్తిడి మరియు అలసటతో బాధపడుతుంటారు.వాటర్ ఆపిల్ ని తినడం వల్ల వొత్తిడి మరియు అలసటను తగ్గిస్తుంది.
6.మలబద్దక సమస్యతో బాధపడేవారు వాటర్ ఆపిల్ ని తింటే జీర్ణక్రియ వ్యవస్థని మెరుగుపరిచి మలబద్దక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
7.వాటర్ ఆపిల్ లో 90% శాతం నీరు మరియు 10% పిండి పదార్థం ఉంటుంది. వడదెబ్బ తో బాధపడేవారు ఈ వాటర్ ఆపిల్ ని తింటే వడదెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది.
8.వాటర్ ఆపిల్ లో విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటర్ ఆపిల్ మన చర్మాన్ని మృదువుగా మరియు పొడి బారకుండ చూస్తుంది.
9.వాటర్ ఆపిల్ లో విటమిన్ B3 ఉంటుంది. కాబట్టి ఇది మన శరీరములో ఉన్న చెడు కొలెస్టరాల్ ను కరిగించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.
10.వాటర్ ఆపిల్ రక్తంలో తెల్ల రక్తకణాల సంఖ్య ని పెంచుతుంది.