Spinach in telugu :
ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే చాలా మంది ఆకుకూరలతో చేసిన వంటకాలను తింటారు. తెలుగు లో spinach ను పాలకూర ( Spinach in telugu )అని పిలుస్తారు. ఈ పాలకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దాదాపు ఒక కప్పు పాలకూర లో 9 కేలరీలు ఉంటాయి. పాలకూరలో అదికంగా విటమిన్స్ మరియు మినిరల్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని వైద్యులు చెబుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పాలకూర ని ( Spinach in telugu ) రోజు తింటే ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. పాలకూర తో చేసిన వంటకాలు కూడా చాలా రుచిగా ఉంటాయి.
పాలకూర వల్ల ప్రయోజనాలు : ( health benefits of spinach)
1.పాలకూరలో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. నిజానికి ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలకూరలో ప్రోటీన్లు, పిండి పదార్థం మరియు ఫైబర్లు ఉంటాయి. కాబట్టీ పాలకూర తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన క్యాలరీలు అందుతాయి.
2.పాలకూర లో ప్రోటీన్లు మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది మన శరీరంలో రోగిరోధక శక్తిని పెంచి , ఇన్ఫెక్షన్స్ ని తదితర రోగాలను దీటుగా ఎదుర్కునేలా చూస్తుంది.
3.గుండె సంబంధిత వ్యాధి అనగా హార్ట్ ఎటాక్ తో బాధపడుతున్నవారు పాలకూర తీసుకోవడం వల్ల గుండె పదిలంగా ఉంటుంది.
4.చాలా మంది కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుంటారు. అలాంటి వారు రోజు పాలకూర తినడం వల్ల కిడ్నీ లో రాళ్ళు పోవడమే కాకుండా, కిడ్నీ పనితీరు ను కూడా మెరుగుపరుస్తుంది.
5.పెద్దలు షుగర్ వ్యాధి తో బాధపడుతుంటారు. అలాంటివారు పాలకూర తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ కి వస్తుంది.
6.పెద్దలే కాకుండ చిన్న పిల్లలు కూడా ఈ మధ్య కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు. కంటి చూపు సమస్యతో బాధపడుతున్న చిన్న పిల్లలు కావచ్చు లేదా పెద్ద వారు అయిన ఈ పాలకూర ని తింటే కంటి చూపు మెరుగుపడుతుంది. వైద్యులు కూడా కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వారికి ఆకుకూరలు తినమని చెబుతుంటారు. దీన్ని బట్టి మీకు అర్థం అయ్యే ఉంటుంది ఆకుకూరలు తింటే ఎన్ని లాభాలు ఉంటాయో.
7.పాలకూర లో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి రోజు పాలకూర తింటే శరీరంలో ఐరన్ లెవెల్స్ పెరిగి శరీరం లో హీమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది.
8.అనీమియా వ్యాధి తో బాధ పడుతున్నవారు పాలకూర తీసుకుంటే చక్కని ఉపశమనం లభిస్తుంది.
9.కండరాల నొప్పి తో బాధపడుతున్న వారు కాని లేదా ఎముకల నొప్పి తో బాధపడుతున్న వారు కాని పాలకూర తీసుకుంటే శరీరం లో ఆక్సీజన్ లెవెల్స్ ని పెంచి మరియు రక్త ప్రసరణ వ్యవస్థ ని మెరుగుపరిచి నొప్పి లేకుండా చేస్తుంది. ఇందులో విటమిన్ D ఎక్కువగా ఉంటుంది. విటమిన్ D మన శరీరంలో ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది.
10.పాలకూర తీసుకుంటే మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
11.పాలకూర తీసుకుంటే బ్లడ్ కేన్సర్ రాకుండా కాన్సర్ కణాలను అడ్డుకుంటాయి.
12.దీనిలో మెగ్నీషియం అదికంగా ఉంటుంది కాబట్టి మన శరీరంలో మెగ్నీషియం స్థాయిని పెంచుతుంది.
13.పాలకూర విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ఎల్లప్పుడు మృదువుగా కాంతివంతంగా ఉంచుతుంది.
14.శృంగార లో వెనకబడి ఉన్నారా? అయితే పాలకూర ని తినండి ఇది శృంగారానికి సంబందించిన సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది.
15.హై బీపీ తో బాధ పడుతున్నవారు పాలకూర తీసుకుంటే రక్త పోటు ను అదుపులో ఉంచుతుంది.
16.పాలకూర శరీరంలో పేరుకు పోయిన చెడు కొలెస్టరాల్ ని కరిగిస్తుంది. ఉభకాయన్ని రాకుండా కాపాడుతుంది.
17.మూత్రంలో మంట మరియు పైల్స్ సమస్యతో బాధపడుతున్నవారు పాలకూర తీసుకుంటే చక్కని ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.