shankhpushpi :
శంఖుపుష్పి పువ్వులు అంటే బహుశా చాలా మందికి తెలియకపోవచ్చును ఎందుకంటే వీటిని మనం చాలా తక్కువగా చూస్తుంటాం. కానీ శంఖుపుష్పి యొక్క ఉపయోగాలు గనుక మీకు తెలిస్తే అస్సలు వదలరు. ఎందుకంటే శంఖుపుష్పి తో చాలా ఉపయోగాలు ఉన్నాయి. శంఖుపుష్పి ని ఆయుర్వేదం లో మన పూర్వీకుల నుంచి మొదలు ఇప్పటి ఆధునిక యుగం వరకు వాడుతున్నారు. శంఖుపుష్పి ని పౌడర్ రూపంలో గానీ లేదా సిరప్ రూపం లో గాని తీసుకుంటారు.
శంఖుపుష్పి ని ( shankhpushpi plant ) చూర్ణం మరియు సిరప్ రూపం లోనే కాకుండా ప్రస్తుతం మార్కెట్ లో రూపం లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది మన శరీర ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. కానీ దీన్ని ఎక్కువగా సిరప్ రూపం లోనే తీసుకుంటారు. కానీ దీన్ని వైద్యులు సూచించిన మేరకు మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ మనం ఇష్టం ఉన్నట్టుగా డోస్ తీసుకుంటే తద్వారా దాని ద్వారా ఎదురయ్యే దుష్ప్రావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
శంఖుపుష్పి యొక్క ఉపయోగాలు : health benefits of shankhpushpi in telugu
1.శంఖుపుష్పి ని ( shankhpushpi syrup ) జ్ఞాపక శక్తి లేమితో బాధపడుతున్నవారు తీసుకుంటారు. ఎందుకంటే శంఖుపుష్పి మెదడు పనతీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది.
2.చాలా మంది ఈ ఆధునిక యుగంలో పని వొత్తిడి కారణంగా నిద్రలేమి సమస్య మరియు వొత్తిడి గురి అవుతారు. ఈ సమస్య పోవాలి అంటే రోజు శంఖుపుష్పి ని క్రమం తప్పకుండా తీసుకోండి. మీ నిద్రలేమి సమస్య తీరుతుంది.
3.మూర్ఛ వ్యాధి తో బాధపడుతున్నవారు శంఖుపుష్పి ని తీసుకుంటే మూర్ఛ వ్యాధి తగ్గుతుంది.
4.తిన్న ఆహారం జీర్ణం అవ్వక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు శంఖుపుష్పి ని తీసుకుంటే జీర్ణ క్రియ సరిగా జరిగేలా చేస్తుంది.
5.మలబద్దకం మరియు కామెర్లు సమస్యతో బాధపడుతున్నవారు శంఖుపుష్పి ని తీసుకుంటే చక్కటి పలితం ఉంటుంది.
6.అటెన్షన్ డెఫినిస్ హైపర్ ఆక్టివిటీ డిజార్డర్ తో బాధుపడుతున్న పిల్లలు శంఖుపుష్పి ని తీసుకుంటే వారిలో ఏకాగ్రత మరియు శ్రద్ధను మెరుగుపరుస్తుంది.
7.ప్రస్తుతం యువత మాత్రమే కాకుండా చిన్న పిల్లలు సైతం జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారికి ఈ శంఖుపుష్పి చక్కటి పరిష్కారం గా చెప్పుకోవచ్చు. శంఖుపుష్పి ని రసాన్ని రోజు తలకి అప్లై చేయడం వల్ల రాలిపోయే జుట్టుని అపడమే కాకుండా మళ్ళీ జుట్టుకు పునర్జీవం ఇస్తుంది.
8.ఎదైన మనకి గాయం అయిన మరియు వాపు వచ్చిన శంఖుపుష్పి ని వాడితే గాయం త్వరగా తగ్గిపోతుంది.
9.మొటిమల సమస్యలు, మచ్చలు, చర్మం పొడిబారడం వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు శంఖుపుష్పి ఆయిల్ ని మొహానికి పట్టించడం ద్వారా మొటిమల సమస్యలు మరియు మొహం పై మచ్చలు తగ్గి చర్మం నిగారింపు వస్తుంది.
10.చర్మం అలెర్జీ సమస్యతో బాధపడుతున్నవారు శంఖుపుష్పి ఆకుల రసాన్ని చర్మంపై అప్లై చేస్తే అలెర్జీ తగ్గుతుంది.