Sarpagandha :
సర్పగంద ( sarpagandha ) భారత దేశానికి చెందిన ఔషధ మొక్క. ఈ సర్పగంద మొక్క ఎక్కువగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఈ సర్పగంద మొక్క లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సర్పగంద ని ఇండియన్ స్నేక్ రూట్ ( indian snake root ) అని పిలుస్తారు. అంతేకాకుండా సర్పగంద ని ( sarpagandha ) ” చోటా చండిస్ ” లేదా ” చంద్ర భాగ ” అని కూడా పిలుస్తారు. సర్పగంద మొక్క వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఎక్కువగా ఆయుర్వేద మందుల తయారీలో కూడా వాడుతారు.
సర్పగంద మొక్కకి ( sarpagandha plant ) తెలుగు మరియు గులాబీ రంగు తో కూడిన పువ్వులు పూస్తాయి. ఈ మొక్క నిటారుగా పెరుగుతుంది అంతేకాకుండా ఈ మొక్క 60 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. ఈ మొక్క యొక్క ఆకులు లేత ఆకుపచ్చ రంగులో పొడవుగా ఉంటాయి. సర్పగంద యొక్క శాస్త్రీయ నామం రౌవోల్ఫియా సర్పెంటినా. పురాతన కాలం నుంచి ఈ సర్పగంద మొక్కని ఎక్కువగా ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి ఆయుర్వేద మందుల తయారీలో వాడుతున్నారు. వీటి యొక్క వేరుకు చాలా రకాల వ్యాధుల ని నయం చేయడానికి వాడుతారు.
సర్పగంద మొక్క ( sarpagandha plant ) ఎక్కువగా భారత దేశం, థాయిలాండ్, బర్మా, పాకిస్తాన్ మరియు శ్రీలంక దేశాల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్క ఎక్కువగా కొండ ప్రాంతాల్లో పెరుగుతుంది. ఈ మొక్క ని ఆంగ్లంలో సేపెంటినా రూట్ , ఇండియన్ స్నేక్ రూట్, సర్పంటైన్ రూట్ ( sarpagandha root ) అని పిలుస్తారు. హిందీలో సర్పగంద ని చోటా చంద్, న్కులకంద, రస్నాబెద్ , కన్నడలో సర్పగంద ని సర్ప గంధి , చంద్రిక, పాతాళ గరుడ అని పిలుస్తారు.
తెలుగులో సర్పగంద ని ( sarpagandha tree ) పాతాళ గరుడ, దుంప రసం, పాతాళ గని, తమిళంలో సర్పగందని కార్పకాంత, కోవన్న మిల్పాడి, కోవన్న మిల్పోరి అని, మలయాళం లో సర్పగంధని అమల్పోరి, తుల్లున్ని, చువన్న అమల్పరి, సివన్ అమల్పాడి అని పిలుస్తారు. సర్పగంద యొక్క రుచి చేదు మరియు ఘాటుగా ఉంటుంది. సర్పగంద యొక్క వేరులో చాలా మినరల్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.
Health benefits of sarpagandha : సర్పగంద తో ఆరోగ్య ప్రయోజనాలు
- నిద్ర లేమి సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. నిద్ర లేమి తో బాధపడేవారు సర్పగంద తీసుకుంటే నిద్ర లేమి సమస్య తగ్గుతుంది.
- రక్త పోటు సమస్య తో బాధ పడుతున్నవారు ఈ సర్పగంద ని తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంచుతుంది.
- గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఈ సర్పగంద ని వాడుతారు. ఎందుకంటే ప్రసవ సమయంలో సర్పగంద నీ తీసుకుంటే ప్రసవం సులభంగా జరుగుతుందని వాడుతారు.
- మలబద్దక సమస్యతో బాధపడుతున్నవారు సర్పగందని తీసుకుంటే చక్కటి పలితం ఉంటుంది. సర్పగంద ని తీసుకోవడం వల్ల ప్రేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం సమస్య ని తగ్గిస్తుంది.
- జ్వరం తో బాధపడుతున్నవారు ఈ సర్పగంద ని తీసుకుంటే జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రత ని తగ్గిస్తుంది.
- సర్పగందని డయాబెటిక్ పేషంట్స్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే సర్పగంద తీసుకోవడం వల్ల రక్తం లోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.