Rohu fish in telugu :
మంచి నీటిలో పెరిగే చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో ఒకటి రోహు చేప rohu fish (rohu fish in telugu ). ఈ రోహు చేప మంచి నీటిలో పెరుగుతుంది. ఈ రోహు చేప మంచి నీటి సరస్సులో లేదా చెరువులో పెరుగుతుంది. ఈ రోహు చేప ని తెలుగులో సీలావతి ( rohu fish in telugu ) లేదా గండి చేప అని పిలుస్తారు. అంతేకాకుండా మరి కొన్ని ప్రాంతాల్లో ఈ చేపను బొచ్చలు లేదా రోహితలు అని కూడా పిలుస్తారు. రోహు చేపను ఇంగ్లీష్ లో Roho labeo మరియు labeo rohita అనే పేర్లతో పిలుస్తారు. ఈ చేప మన భారత దేశంలో ఎక్కువగా లబిస్తుంది. దీన్ని ఎంతో ఇష్టం గా తింటారు. వారంలో కచ్చితంగా ఒక రెండు సార్లు చేపలను తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
మీరు సీ ఫుడ్ లో చేపలు అనే కాకుండా రొయ్యలు, పీతలు మరియు రోహు చేపలే కాకుండ వివిధ రకాల చేపలను ఏది తీసుకున్న మన ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు ఎక్కువగా చికెన్ మరియు మటన్,. ఎగ్స్ ని తింటూ ఉంటారు కానీ చేపలను కూడా తింటే మన బాడీ కి కావాల్సిన ప్రోటీన్లు, న్యూట్రీషన్లు మరియు విటమిన్లు పుష్కలంగా అందుతాయి. చేపల్లో ఎక్కువగ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ , విటమిన్ డి, పాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మనదేశం లో బెంగాలీ లు ఎక్కువగ రోహు చేపను తింటారు. రోహు చేపల్లో విటమిన్ సి మరియు తక్కువ కొవ్వులు ఉంటాయి.
రోహు చేపలో పోషక విలువలు : ( Nutrition values in rohu fish )
చేపలు తినడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషక విలువలు అన్ని అందుతాయి. రోహు చేపలలో విటమిన్ ఎ , విటమిన్ డి, విటమిన్ సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, తక్కువ కొవ్వు , ఫాస్పరస్, ఐరన్ , కాల్షియమ్ , సోడియం , విటమిన్ ఇ, ప్రోటీన్లు మరియు న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని వైద్యులు చెబుతున్నారు.
రోహు చేప ( rohu fish ) తినడం వల్ల కలిగే ప్రయోజనాలు : ( health benefits of rohu fish )
1.రోహు చేపల్లో ఎక్కువగా ప్రోటీన్లు మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టీ శరీర పెరుగుదల కి మరియు శరీర కండరాలు దృఢంగా ఉండేలా చేస్తాయి.
2.రోహు చేపల్లో విటమిన్ C అధికంగా ఉంటుంది.రోహు చేపను తినడం వల్ల మన శరీరం లో రోగ నిరోధక శక్తి పెరిగి అనేక వ్యాధులను ఎదుర్కునేలా చేస్తుంది. అంతేకాకుండా జలుబు, దగ్గు మరియు శ్వాస కోశ సంబంధిత తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది.
3.గుండె తదితర వ్యాధితో బాధపడుతున్న వారికి ఉపశమనం కలగాలి అంటే రోహు చేప తినాల్సిందే. ఎందుకంటే రోహు చేపల్లో ఎక్కువగా ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెని పదిలంగా ఉండేలా చూస్తుంది.
4.రోహు చేపలను తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది.
5.రోహు చేపల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో కాన్సర్ కణాలతో పోరాడుతాయి.అంతేకాకుండా కాన్సర్ రాకుండా కాపాడుతుంది.
6.రోహు చేపల్లో యాంటీ ఎజెనింగ్ గుణాలు ఉంటాయి. కాబట్టీ రోహు చేపను తినడం వల్ల చర్మం పై ముడతలు పోవడమే కాకుండా చర్మం నిగారింపు వస్తుంది.
7.రోహు చేప తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా త్రంబోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
8.డయాబెటిస్ వ్యాధి తో బాధ పడేవారు రోహు చేపను తినడం వల్ల వారిలో విటమిన్ D స్థాయి ని పెంచుతుంది. అంతేకాకుండా టైప్ 2 డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది.
9.రోహు చేపల్లో ఎక్కువగా సెలీనియం, జింక్ మరియు అయోడిన్ లు ఉంటాయి. అయోడిన్ వుండటం వల్ల థైరాయిడ్ వ్యాధి తో బాధ పడుతున్న వారికి ఉపశమనం కలుగుతుంది. సెలీనియం శరీరంలో కాన్సర్ నుండి మనల్ని కాపాడే ఎంజైమ్స్ ని తయారు చేస్తుంది. కాబట్టి రోహు చేపను తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి మన ధరిచేరదు.
10.ప్రస్తుతము మారుతున్న ఆధునిక జీవన విధానంలో పనిలో వొత్తిడి కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. పోషకాహార లోపం వల్ల కూడా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు.రోహు చేప తినడం వల్ల మీరు నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు.