Ramphal fruit :
సీతాఫలం అంటే మనందరికీ తెలుసు. రామఫలం ( ramphal ) గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఇవి మార్కెట్ లో కూడా చాలా తక్కువ గా దొరుకుతాయి. పల్లెటూర్లలో నివసించే వాళ్ళకి ఇవి ఎక్కువగా తెలుసు. పట్టణాలలో నివసించే వాళ్ళకి ఇప్పుడిప్పుడు మాత్రమే తెలుసు. ఈ రామఫలం ( ramphal fruit ) అచ్చం సీతాఫలం లాగే ఉంటుంది. కానీ ఆకారం కొంచం వేరేలా ఉంటుంది. లోపలి భాగం లో గుజ్జు , గింజలు దాదాపుగా సీతాఫలం లాగే ఉంటుంది. రామఫలం ( red custard apple ) ఈ పేరుకు తగ్గట్టుగానే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వీటిని ఇండియన్ చెర్రీ అని కూడా అంటారు. ఒకప్పుడు ఇవి పల్లెటూర్లలో మాత్రమే పెరిగేవి మరియు తినేవారు. అంతేకాకుండా వీటికి పెరిగిన డిమాండ్ కారణంగా ప్రస్తుతం మనదేశం లో వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటిని ప్రస్తుతం ఎక్కువగా తెలంగాణ, కేరళ, తమిళనాడు మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల లో వీటిని రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతము ఇవి సూపర్ మార్కెట్ లో కూడా లభ్యం అవుతున్నాయి.
ఈ పండ్లు చూడటానికి గుండ్రంగా ఉంటాయి. ఇవి లేత గులాబీ రంగు లో లేదా ఎరుపు రంగు లో ఉంటాయి. రామఫలం ( red custard apple ) యొక్క చెట్లు 20 నుంచి 30 అడుగుల ఎత్తు పెరుగుతుంది. రామఫలం చెట్టు , సీతాఫలం ( sitaphal ) కంటే ఎక్కువగా ఎత్తు గా పెరుగుతుంది. రామఫలం లో గింజలు కూడా సీతాఫలం లో ( custard apple ) కంటే ఎక్కువగా ఉంటాయి. వీటి రుచి కూడా చాలా తీయ్యగా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు. ఈ రామఫలం చెట్టు యొక్క ఆకుల్ని టీ తయారీలో కూడా వాడుతారు.
Ramphal fruit price : రామఫలం యొక్క ధర
రామఫలం కి ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ధర పలుకుతుంది. ప్రస్తుతం వీటిని కొనడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఇవి వేసవిలో మాత్రమే ఎక్కువగా మార్కెట్ లో మనకి కనిపిస్తాయి. ఇవి సీజనల్ ఫ్రూట్ కాబట్టి వేసవిలో మాత్రమే దొరుకుతుంది. ప్రస్తుతం వీటి ధర మార్కెట్ లో కేజీ రామఫలం కి ( ramphal fruit online ) 250 రూపాయల ధర పలుకుతుంది.
Neutrients values in ramphal fruit : రామఫలం లో పోషక విలువలు
రామఫలం లో మన శరీరానికి కావల్సిన విటమిన్లు, ఖనిజాలు మరియు ప్రొటీన్లు అన్ని ఉన్నాయి. డాక్టర్లు సైతం వీటిని తినడమని చెబుతుంటారు. ఇవి సంవత్సరం అంతటా మనకు దొరకవు వాటిని సీజన్ లో తినడం చాలా మంచిది. రామఫలం లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు , డైటరీ ఫైబర్స్, ఫ్యాట్, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ బి5, పొటాషియం , కాల్షియం, సోడియం మరియు ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
Ramphal fruit benefits : రామఫలంతో ఆరోగ్య ప్రయోజనాలు
- రామఫలం డయాబెటిక్ పేషంట్స్ కి ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డయాబెటిక్ పేషంట్స్ కి తీపి పదార్థాలు ఏమి తిన్న కూడా రక్తం లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే వీటిని తినడం వల్ల రక్తం లో షుగర్ లెవెల్స్ ఒకేసారి పెరగవు. అందుకే వీటిని డయాబెటిక్ పేషంట్స్ తినడం చాలా మంచిది.
- మొహం పై తరచూ మొటిమలు వస్తుంటాయి. ఇవి పోవడానికి చాలా మంది వివిధ క్రీం లు , ఫేస్ ప్యాక్ లు అప్లై చేస్తుంటారు. అయినా కూడా మొహంపై మొటిమలు తగ్గవు. అలాంటి వారు రామఫలం తినడం మంచిది. ఎందుకంటే రామఫలం లో విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటాయి. ఇవి మొహంపై ఉన్న మొటిమలను తగ్గిస్తాయి.
- రామఫలం లో ( ramphal fruit ) పిరిడాక్సిన్, అనోనాసిన్ మరియు అనోకాటలిన్ ఉంటుంది. ఇది శరీరంలో క్యాన్సర్ కణాల తో పోరాడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.
- ముఖం పై ముడతలు , మచ్చలు, చారలు లాంటివి పోవాలంటే రామఫలం తినడం మంచిది. అంతేకాదు మొహం పై ఏర్పడిన వయస్సు పైబడిన చారలని కూడా తగ్గిస్తుంది.
- రామఫలం లో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది.
- రామఫలం తలలో చుండ్రును తగ్గిస్తుంది. అంతేకాకుండా రామఫలం పేలు మరియు జుట్టు రాలిపోయే సమస్య ని కూడా తగ్గిస్తుంది.
- రామఫలం ( ramphal ) నరాల వ్యాధులు మరియు తలనొప్పి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
- రామఫలం లో పైరిడాక్సిన్ ఉంటుంది. మెదడు కణాలను అవసరమైన రసానాయలని స్థిరంగా ఉంచేందుకు దోహపడుతుంది.