Rambutan fruit :
రాంబుటాన్ ( rambutan ) ఈ పండు ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. రాంబుటాన్ పండు ని ఎక్కువగా మలేషియాలో సాగు సాగుచేస్తారు. ఇది మలేషియా కి చెందిన మొక్క. ఈ రాంబుటాన్ పండు ( rambutan fruit ) చూడటానికి ఎరుపు రంగు లో ఉంది అంతేకాకుండా ఈ పండు చిన్నగా కోడి గుడ్డు పరిమాణం లో ఉంటుంది. ఈ పండు చుట్టూ మృదువైన లేత పసుపు రంగులో పోగుల వలె పండు చుట్టూ ఉంటాయి. దీని లోపలి భాగం తెలుపు రంగులో ఉంటుంది. ఈ రాంబుటాన్ చెట్టు ( rambutan tree )దాదాపుగా 30 నుంచి 40 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది.
ఇది వరకు ఈ రాంబుటాన్ పండ్లు మలేషియా లో మాత్రమే దొరికేవి. కానీ ఇప్పుడు ప్రపంచం అంతటా రాంబుటాన్ సాగు చేస్తున్నారు. రాంబుటాన్ పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో పోషకాలు కూడా చాలా ఎక్కువ అందుకే వీటిని తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. రాంబుటాన్ ని కేకుల తయారీలో , జ్యూస్, ఐస్ క్రీం , సలాడ్ మరియు సూప్ తయారీలో ఎక్కువగా వాడుతారు. ఈ రాంబుటాన్ జ్యూస్ ని ఎక్కువగా తాగుతుంటారు. అందుకనే ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.
ఈ రాంబుటాన్ పండ్లని ( rambutan ) ఎక్కువగా ఇండోనేషియా , థాయిలాండ్, ఫిలిపైన్స్, సింగపూర్ వంటి దేశాల్లో ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా ఇది అచ్చం చూడటానికి లీచీ పండు వలె ఉంటుంది. ఈ మొక్క ( rambutan plant ) ఎక్కువగా ఉష్ణ మండల ప్రాంతాల్లోనే పెరుగుతుంది. రాంబుటాన్ ఉష్ణమండల సతత హరిత జాతికి చెందినది. శాస్త్రీయంగా రాంబుటాన్ పండు ని నేఫెలియం లపాసియం అని పిలుస్తారు.ఇది సపిండేసి యొక్క బొటానికల్ కుటుంబానికి చెందింది. ప్రస్తుతం ఈ రాంబుటాన్ పండు ని అమెరికా , ఆఫ్రికా, ఇండియా మరియు శ్రీలంక వంటి దేశాల్లో కూడా సాగు చేస్తున్నారు. దీనికి ఈ పేరు మలయాళీ బాషలో రంబుట్ అనే పదం నుంచి వచ్చింది. ఈ పండు ని రాంబోటాన్, రాంబౌటాన్ మరియు రాంబుస్టాన్ అని పిలుస్తారు.
Rambutan fruit price : రాంబుటాన్ పండు యొక్క ధర
ఇదివరకు ప్రపంచ దేశాలు మలేషియా , సింగపూర్, ఫిలిప్పైన్స్, థాయిలాండ్ వంటి దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రపంచం అంతటా ఈ పండును సాగుచేస్తున్నారు. మన దేశంలో ఎక్కువగా కేరళ లో ఈ పండు కనిపిస్తుంది. అక్కడ రాంబుటాన్ పండును సాగు చేస్తున్నారు. వీటి ధర కేజీ కి సుమారు 1300 వందల రూపాయల నుంచి 1500 వందల రూపాయల ధర పలుకుతుంది. వీటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.
Neutrients values in rambutan fruit : రాంబుటాన్ ఫ్రూట్ లో పోషక విలువలు
రాంబుటాన్ ఫ్రూట్ లో మన శరీరానికి కావల్సిన విటమిన్లు, ఖనిజాలు అన్ని ఈ పండులో ఉంటాయి. అందుకే వీటిని డాక్టర్లు సైతం తినమని చెబుతుంటారు. రాంబుటాన్ పండులో కార్బోహైడ్రేట్లు , ప్రోటీన్లు, డైటరీ ఫైబర్స్, థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బి6, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా రాంబుటాన్ పండులో ఐరన్ , పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, సోడియం, యాంటీ ఆక్సిడెంట్లు మరియు జింక్ పుష్కలంగా ఉంటాయి.
Rambutan fruit benefits : రాంబుటాన్ ఫ్రూట్ తో ఆరోగ్య ప్రయోజనాలు
- రాంబుటాన్ ఫ్రూట్ ( rambutan benefits ) తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే రాంబుటాన్ పండులో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి విటమిన్ సి మన శరీరంలో తెల్ల రక్తకణాల సంఖ్య ని పెంచడం ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- రాంబుటాన్ పండులో ఉండే విటమిన్ సి సంతానోత్పత్తికి ఎంతగానో దోహదపడుతుంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారు ఈ పండును తింటే మీ స్పెర్మ్ కౌంట్ ని పెంచడమే కాకుండా స్పెర్మ్ మోటిలిటీ లో మెరుగుదల వస్తుంది. అంతేకాకుండా ఈ రాంబుటాన్ పండును గర్భాధారణ సమయంలో తీసుకుంటే వీర్యం నాణ్యత పెరుగుతుంది. తద్వారా సంతానం త్వరగా కలిగే అవకాశం ఉంటుంది.
- కిడ్నీ ఫెయిల్యూర్ మరియు కిడ్నీ లో రాళ్ళు వంటి సమస్యలు ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. ఈ రాంబుటాన్ పండును తినడం వల్ల కిడ్నీ లని శుభ్రం చేసి, కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. మన శరీరంలో పేరుకున్న చెత్తను మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. అంతేకాకుండా రక్తాన్ని బాగా శుధ్ది చేస్తుంది.
- రాంబుటాన్ పండులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ సమస్యతో బాధపడుతున్నవారు ఈ రాంబుటాన్ పండు ని తింటే ఐరన్ లోపం తగ్గుతుంది. ఐరన్ డెఫిషియన్సీ తో బాధపడేవారికి ఈ పండు ని తినడం చాలా మంచిది.
- రాంబుటాన్ లో ( rambutan ) విటమిన్ ఎ ఉంటుంది. కంటి చూపు సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు అలాంటి వారు ఈ పండు ని తినడం చాలా మంచిది. కంటి చూపు సమస్యలని తగ్గిస్తుంది.
- మలబద్దక సమస్యతో బాధపడుతున్నవారు ఈ పండు ని తింటే మలబద్దక సమస్య తగ్గుతుంది. ఎందుకంటే ఈ రాంబుటాన్ పండులో డైటరీ ఫైబర్స్ ఉంటాయి. దీని వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం అయ్యి, ప్రేగు కదలికలను మెరుగుపరిచి మలం త్వరగా పోవడానికి సహాయపడుతుంది. అందుకే మలబద్దక సమస్యతో బాధపడుతున్నవారు ఈ పండును తినడం మంచిది.
- రాంబుటాన్ పండులో మన శరీరానికి కావల్సిన పోషక పదార్థాలు అన్ని ఉంటాయి. రాంబుటాన్ పండులో విటమిన్ బి5 ఉంటుంది. ఇది మన తిన్న ఆహారం శక్తిగా మార్చడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పొటాషియం, కాల్షియం, ఫోలేట్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
- రాంబుటాన్ పండు రక్త హీనత సమస్యను తగ్గిస్తుంది. రక్త హీనత సమస్య అనేది శరీర కణజాలాలకి తగినంత ఆక్సిజన్ ని తీసుకుపోవడానికి ఆరోగ్యమైన రక్త కణాలు లేకపోవడం వల్ల రక్త హీనత సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్నవారు ఈ పండు ని తినడం చాలా మంచిది.
- రాంబుటాన్ పండులో బయాఫ్లేవనాయిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రాంకియాటిక్ మరియు ప్రేగు క్యాన్సర్ ని రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా స్త్రీ లలో ఎక్కువగా వచ్చే రొమ్ము క్యాన్సర్ కూడా రాకుండా కాపాడుతుంది.
- రాంబుటాన్ పండు ( rambutan fruit ) రసాన్ని తలకి రాసుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది. ఈ పండులో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టు రాలిపోడం వంటి సమస్యను కూడా తగ్గిస్తుంది.