Kepel fruit :
కెపెల్ ఫ్రూట్ ( kepel fruit ) అంటే చాలా మందికి తెలియదు. ఎందుకంటే మీరు ఈ పండు ని బహుశా చాలా మంది ఇది వరకు చూసి ఉండరు. మీరే కాదు నేను కూడా ఇది వరకు చూడలేదు. కానీ ఈ పండు తో చాలా లాభాలు ఉన్నాయి. ఈ కెపెల్ ఫ్రూట్ ని పర్ఫ్యూమ్ పండు ( perfume fruit ) అని కూడా అంటారు అంటే సువాసన వచ్చే పండు అని అర్థం. అవును మీరు విన్నది నిజమే ఇది ఒక సువాసన వచ్చే పండు. ఈ పండు వాసన చాలా బాగుంటుంది. ఈ పండు వాసన బాగుండటమే కాదు దీన్ని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కెపెల్ ఫ్రూట్ ని మనదేశంలో కేరళ రాష్ట్రంలో ( kepel fruit in Kerala ) సాగు చేస్తున్నారు.
ఈ పండు తిన్నాక మన శరీరం నుంచి వచ్చే చెమట కూడా పెర్ఫ్యూమ్ వాసన వస్తుందట. చివరకు మలవిసర్జన కూడా సువాసన వస్తుందట కొన్ని రోజుల వరకు , అంతేకాకుండా ఈ పండును పూర్వం రాజ కుటీంబుకులు మాత్రమే తినే వారట. ఈ పండు అచ్చం చూడటానికి సపోటా పండు వలె ఉంటుంది. లోపలి భాగం పసుపు పచ్చ లేదా నారింజ రంగులో ఉంటుంది. లోపలి భాగం గుజ్జువలే ఉంటుంది మరియు గింజలు కూడా ఉంటాయి. ఈ కెపెల్ పండు చూడటానికి ఓవల్ ఆకారంలో లేదా గుండ్రంగా ఉంటాయి. ఈ చెట్టు యొక్క ఆకులు ముదురు ఆకు పచ్చ లేదా ఎరుపు రంగులో ఉంటాయి.
ఈ పండు పరిపక్వత చెందినప్పుడు పండు చర్మం ఆకుపచ్చ రంగు నుండి గోధుమ లేదా పసుపు రంగులోకి మారుతుంది. ఈ పండు యొక్క రుచి తీపి , చేదు రుచిని ( kepel fruit taste ) సువాసన తో కలిగి ఉంటుంది. ఈ పండు ని సాధారణంగా కెపెల్ ఫ్రూట్ లేదా కెపెల్ యాపిల్ ( kepel apple fruit ) , బురాహోల్ ( burahole ) అని పిలుస్తారు. ఈ చెట్టు పువ్వులు పూసి, కాయలు కాయడానికి దాదాపుగా 7 నుంచి 8 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ పండు జాతి ఆగ్నేయాసియా కి చెందినది.
Kepel fruit price : కెపెల్ పండు యొక్క ధర
కెపెల్ పండులో మన శరీరానికి కావల్సిన పోషక పదార్థాలు ఉంటాయి. ఇది సువాసన వచ్చే పండు. దీని ధర కూడా ఎక్కువగా నే ఉంటుంది. ఇది మార్కెట్ లో చాలా అరుదుగా లభిస్తుంది. దీని ధర కేజీ కి దాదాపుగా 5000 ( kepel fruit buy online ) రూపాయలు ఉంటుంది.
Neutrients values in kepel fruit : కెపెల్ పండులో పోషక విలువలు
కెపెల్ పండులో చాలా పోషక విలువలు ఉంటాయి. ఇవి మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కెపెల్ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో సపోనిన్లు , ఫాలిపెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గునాలని కలిగి ఉంది.
Kepel fruit benefits : కెపెల్ పండుతో ఆరోగ్య ప్రయోజనాలు
- కెపెల్ పండు లో విటమిన్ సి ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ సి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన శరీరం ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా కాపాడుతుంది.
- కొందరికి చెమట వల్ల దుర్వాసన వస్తుంది. అలాంటి వారు ఈ కెపెల్ పండు ని తింటే చెమట కూడా సువాసన వస్తుంది. మన శరీరం దుర్వాసన రావడానికి మోసే పెరోమోన్లు మరియు తక్కువ వాసన కలిగి ఉండే మెర్కప్టాన్. ఈ పండు మెర్కప్టాన్ ఉత్పత్తిని నియంత్రించడానికి పని చేస్తుంది.
- కెపెల్ పండు లో ఫ్లేవనాయిడ్స్ , ఆల్కలాయిడ్స్ మరియు ఫినోలిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది.
- కెపెల్ పండు లో అల్కలాయిడ్స్ ఉంటాయి. కీళ్ళ నొప్పుల కారణం అయిన గౌట్ ని ఇది సరి చేస్తుంది. ఇది నొప్పి ఉన్న చోట pH స్థాయిని తటస్తీకరిస్తాయి.
- కెపెల్ పండు లో అసిటోజెన్ మరియు స్టైరిల్, ఐసోఫ్లేవొన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తాయి. మన శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదల ని అడ్డుకుంటాయి.
- ఈ కెపెల్ పండు ని గర్భిణీ స్త్రీలు తింటే మంచిది అని అంటుంటారు. ఎందుకంటే కెపెల్ పండు లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కెపెల్ పండు తింటే పుట్టబోయే బిడ్డ కూడా ఎంతో అందంగా పుడుతుందని నమ్ముతారు. అందుకే పూర్వ కాలం లో రాజులు మాత్రమే ఈ పండ్లని తినేవారు.