kalonji seeds in telugu :
జీలకర్ర ని మనం పురాతన కాలం నుంచి వంటకాల్లో మరియు ఆయుర్వేదం లో ఎక్కువగా వాడుతున్నాం. అంతేకాకుండా ఈజిప్ట్ నాగరికతలో ఈ జీలకర్ర ని సుగంధ ద్రవ్యంగా వాడేవారు అని పురాణాలు చెబుతున్నాయి. జీలకర్ర రెండు రకాలు . ఒకటి మనం రోజు వంటల్లో వాడే తెల్ల జీలకర్ర మరియు ఇంకొకటి నల్ల జీలకర్ర ( kalonji seeds in telugu ). ఈ నల్ల జీరకర్ర ని గుజరాతీ లో కలోంజి సీడ్స్ ( kalonji seeds in telugu ) అని పిలుస్తారు. నల్ల జీలకర్ర ని ఆంగ్లంలో సమల్ ఫెన్నెల్ ( samal fennel ) అని పిలుస్తారు. తెల్ల జీలకర్ర కంటే నల్ల జీలకర్ర ఎక్కువ రుచిని కలిగి ఉంటుంది. నల్ల జీలకర్ర ని ఎక్కువగా మన భారతదేశం లో బిర్యాని వంటకాల్లో వాడుతారు. అంతేకాకుండా బ్యూటీ కి సంబధించిన ప్రొడక్ట్స్ లో కూడా నల్ల జీలకర్ర ని వాడుతారు.
ప్రస్తుతం నల్ల జీలకర్ర ని కలోంజి విత్తనాలు గా పిలుస్తున్నారు. కలోంజి విత్తనాలలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఆయుర్వేదం లో కలోంజి విత్తనాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కలోంజి విత్తనాలలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ బి12 , ఫైబర్స్, పొటాషియం, కాల్షియమ్ మరియు ఐరన్ లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా కలోంజి విత్తనాలను సూప్స్, బ్రెడ్ మరియు వివిధ రకాల బిస్కెట్స్ తయారీలో కూడా ఈ విత్తనాలను వాడుతారు.
కలోంజి సీడ్స్ ఉపయోగాలు : Health benefits of kalonji seeds in telugu
1.డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నవారు కలొంజి సీడ్స్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
2.నరాల బలహీనతను మరియు శరీరం లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
3.మన శరీరం లో హాని కరమైన బ్యాక్టీరియా నుంచి మన జీర్ణశయాన్ని కాపాడుతుంది.
4.శరీరంలో చెడు కొలెస్టరాల్ స్థాయిని తగ్గించి, గుండెని పదిలంగా ఉండేలా చూస్తుంది.
5.కలొంజి సీడ్స్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి నొప్పి మరియు మంట రావడం సహజం. అలాంటి వారు ఈ కలోంజి సీడ్స్ ని ఉపయోగిస్తే ఉపశమనం కలుగుతుంది.
6.పంటి నొప్పి మరియు పిప్పి పన్ను నొప్పితో చాలా మంది బాధపడుతుంటారు. ఒక స్పూన్ కలోంజి నూనె ని పంటికి పట్టించాలి. ఇలా చేయడం ద్వారా పంటి నొప్పి తగ్గుతుంది
7.పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఆస్తమా బారిన పడుతున్నారు. ఆస్తమా మరియు ఉబ్బుసం వ్యాధి తో బాధపడుతున్నవారు రోజు ఉదయం వేడి నీళ్లలో కొద్దిగా తేనె మరియు కలోంజి నూనె ని కలిపి తాగాలి.ఇలా చేయడం వల్ల ఆస్తమా అదుపులో ఉంటుంది.
8.కలోంజి సీడ్స్ రోజు తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
9.ఉబకాయంతో బాధపడేవారు కలోంజి సీడ్స్ తీసుకుంటే చెడు కొలెస్టరాల్ ను కరిగించి సన్నబడేలా చేస్తుంది.
10.కలోంజి సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.కాబట్టి ఇవి క్యాన్సర్ కి కారణం అయ్యే ప్రీరాడికల్స్ ని నియంత్రిస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ , రొమ్ము క్యాన్సర్ మరియు ఇతర క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది.
11.తలనొప్పితో బాధపడేవారు కలొంజి సీడ్స్ నూనె ని నుదుట పై రాసుకుంటే తక్షణమే తలనొప్పి తగ్గుతుంది.
12.కలోంజి సీడ్స్ ని పౌడర్ చేసి మొహంపై అప్లై చేసి రబ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా మొహంపై ఉన్న డస్ట్ పోవడమే కాకుండా పోర్స్ కూడా క్లీన్ అవుతాయి.