Jowar flour :
జోవర్ ఫ్లోర్ తో ( jowar flour ) చేసిన పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. జోవర్ ఫ్లోర్ లో మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని ఉంటాయి. అందుకే వీటితో చేసిన పదార్థాలను తినమని డాక్టర్లు సైతం చెబుతుంటారు. అందుకే వీటితో చేసిన పదార్థాలను ఎంతో ఇష్టం గా తింటారు. జోవర్ ఫ్లోర్ అనేక రాష్ట్రాల్లో ఇది ఒక ప్రధాన ఆహారం. తృణ ధాన్యాలలో జోవర్ ఒక ఒకటి. జోవర్ ( jowar flour ) అనేది ఆఫ్రికా కి చెందిన ఒక తృణధాన్యం. జోవర్ దాదాపుగా 3700 సంవత్సరాల కాలం నుంచి సాగు చేయబడుతుంది. జోవర్ ను ఎక్కువగా నైజీరియా మరియు భారతదేశం లో ఎక్కువగా సాగు చేస్తారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా మరియు మెక్సికో వంటి దేశాల్లో కూడా వీటిని ఎక్కువగా సాగు చేస్తారు.
తృణ ధాన్యాలు అయిన రాగులు, సజ్జలు, కొర్రల సాగు తర్వాత జొన్నలనీ కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటితో చాలా రుచికరమైన వంటకాలు కూడా చేయవచ్చు. జొన్న చెట్టు నుంచి జొన్నలను వేరు చేసిన తర్వాత వాటి యొక్క కాడల్ని బర్రెలకు మరియు ఆవులకు మెతగా వేస్తారు. వీటిలో అనేక రకాల వివిధ పోషకాలు ఉంటాయి కాబట్టి వాటి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అందుకే వీటిని ఎక్కువగా పశుగ్రాసం గా ఉపయోగిస్తారు. 100 గ్రాముల జొన్న పిండిలో దాదాపుగా 300 కేలరీల శక్తి ఉంటుంది. జోవర్ నీ ( jowar flour in telugu ) ఎక్కువగా బరువు తగ్గాలి అనుకునే వారు తింటారు. వీటిని తినడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.
జోవర్ ఫ్లోర్ తో ఉపయోగాలు : jowar flour benefits
- మధుమేహ వ్యాధి తో బాధపడుతున్నవారు జోవర్ ను తినడం వల్ల రక్తంలో నీ షుగర్ ను నియంత్రణలో ఉంచుతుంది. అందుకే డయాబెటిక్ పేషంట్స్ ఎక్కువగా జొన్న లతో చేసిన వాటిని తింటారు…
- బరువు తగ్గాలి అనుకునే వారు జొన్నలతో చేసిన ఆహార పదార్థాలు ( jowar flour recipes ) తినడం చాలా మంచిది. జొన్నలలో అధిక ఫైబర్ ఉంటుంది. కాబట్టి తిన్న తర్వాత వెంటనే జీర్ణం అవ్వదు అంతేకాకుండా బరువుని కూడా తగ్గిస్తుంది.
- జొన్న ను తీసుకోవడం రోజు గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే జొన్నలు గుండెలో రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది. చెడు కొలెస్టిరాల్ నీ కూడా తగ్గిస్తుంది. తద్వారా గుండె పోటు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
- జోవర్ లో యాంటి ఆక్సిడెంట్స్ లు పుష్కలంగా ఉంటాయి. జోవర్ లో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు యాంటి ఆక్సిడెంట్లు గా పని చేస్తాయి. ఇవి మన శరీరంలో క్యాన్సర్ కణాలతో పోరాడతాయి.