HomeHealthHibiscus flower : మందార పువ్వుతో అరోగ్య ప్రయోజనాలు

Hibiscus flower : మందార పువ్వుతో అరోగ్య ప్రయోజనాలు

Hibiscus flower :

Hibiscus ని తెలుగులో మందార పువ్వు అంటారు. ప్రస్తుత కాలంలో మందార పువ్వు ( hibiscus flower ) గురించి తెలియని వారు ఉండరేమో ఎందుకంటే మందార పువ్వులు మరియు మందార చెట్టు యొక్క ఆకులు మన కేశ సంరక్షణకి, చర్మ సౌంద్యానికి చాలా ఉపయోగపడతాయి. మందార పువ్వులు ( hibiscus flower ) పెద్దగా ఎరుపు రంగులో సువాసన లేకుండా ఉంటాయి. మందార పువ్వులు ఎరుపు రంగులోనే కాకుండా తెలుపు మరియు పసుపు వివిధ రకాల రంగుల్లో ఉంటాయి. మందార పువ్వులను మనదేశంలో ఎక్కువగా పూజకి వాడుతారు. వేరే దేశాల్లో ఈ మందార పువ్వులను సలాడ్ లో వేసుకుని తింటారు. అంతేకాకుండా మందార పువ్వులతో టీ కూడా చేసుకుని తాగుతారు. మందార పువ్వులతో చేసిన టీ తాగడం వల్ల గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతే కాకుండా హై బీపిని తగ్గిస్తుంది.

మందార పువ్వులు ( hibiscus flower ) అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం. అందుకే మందార పువ్వులను పూజలో కూడా వాడుతారు. సూర్య దోషాన్ని తొలగించుకోవడానికి కూడా మందార పువ్వులను వాడుతారు.శుక్రవారం రోజు మందార పువ్వులను లక్ష్మీ దేవి కి పూజ చేసి సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా హనుమంతుడికి మంగళవారం రోజు మందార పువ్వులను సమర్పిస్తే అంత శుభం కలుగుతుంది. మందార చెట్టును ఇంట్లో గానీ లేదా ఇంటి అవరణలో గానీ పెంచుకుంటే వాస్తు దోషాలను నివారిస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.

మందార పువ్వు ఉపయోగాలు : health benefits of hibiscus flower

1.మందార పువ్వు వెంట్రుకలకి చాలా ఉయోగపడుతుంది.
2.మందార పువ్వు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
3.మందార పువ్వు చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది.
4.మందార పువ్వు బరువు తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు.
5.మందార పువ్వు ఎక్కువ బీపీ తో బాధపడుతున్న వారికి చాలా మంచిది.
6.మందార పువ్వు ని లివర్ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
7.మందార పువ్వు క్యాన్సర్ రాకుండా చేస్తుంది.
8.మందార పువ్వు జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది.
9.మందార పువ్వు మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
10.మందార పువ్వు గాయాలు నయం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

hibiscus flower

1.మందార పువ్వు ( hibiscus flower ) వెంట్రుకల ఎదుగుదల మరియు వెంట్రుకల కుదుళ్లు గట్టిపడడానికి చాలా ఉయోగపడుతుంది.అంతే కాదు ఇది వెంట్రుకలను తెల్ల పడకుండా చేస్తుంది.కాబట్టి ఎవరైతే వెంట్రుకలు ఎక్కువ ఊడిపోతున్నాయో వారు గుప్పెడు మందార పువ్వులను తీసుకొని పేస్ట్ చేసి జుట్టు కుదుళ్లకు పట్టిస్తే వెంట్రుకలు ఊడకుండా ధృడంగా ఉంటాయి. అంతే కాదు మీ వెంట్రుకలు తెల్లగా మారకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

2.ప్రస్తుతం అందరూ ఎక్కువగా బాధపడే సమస్య చెడు కొలెస్ట్రాల్ పెరగడం ఇలా కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారికి మందార పువ్వు టీ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మందార పువ్వు టీ రోజు ఉదయం లేవగానే తీసుకోవడం వలన మీ కొలెస్ట్రాల్ ని తగ్గించవచ్చు.

3.ప్రతి ఒక్కరికీ చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు ఎమి వాడితే చర్మం బాగుంటుందని ఆలోచిస్తారు. అలాంటి వారికి మందార పువ్వు చాలా ఉయోగపడుతుందని చెప్పాలి.మందార పువ్వు చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మందార పువ్వులను పేస్ట్ గా చేసి అందులో కాస్త తేనె కలిపి ప్యాక్ ల ఫేస్ పై వేసుకుంటే మీ చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు చర్మం పై ముడతలు ఉన్నవారు ఇలా ప్యాక్ వేసుకుంటే ముడతలు తగ్గి చర్మం యవ్వనంగా కనబడేలా చేస్తుంది.

4.మందార పువ్వు టీ బరువు తగ్గడానికి కూడా ఉపయోగిస్తారు.
కాబట్టి అధిక బరువుతో బాధపడే వారు రోజు ఉదయం లేవగానే మందార పువ్వు టీ తీసుకోవడం వలన బరువుని అదుపులో పెట్టుకోవచ్చు.

5.మందార పువ్వు లో అధిక రక్తపోటు అదుపులో ఉండేందుకు ఉపయోగపడే గుణాలు ఉన్నాయి. కాబట్టి మందార పువ్వులను టీ రూపంలో తీసుకుంటే అధిక రక్తపోటు అదుపులో పెట్టుకోవచ్చు. కావున అధిక రక్తపోటు తో బాధపడే వారు రోజు మందార పువ్వులను టీ గా తీసుకుంటే మంచిది.

6.ప్రస్తుతం చాలా మంది వారికి తెలియకుండానే ఫ్యాటీ లివర్ మరియు లివర్ అనారోగ్యంతో బాధపడుతుంటారు. అలాంటివారికి మందార పువ్వు చాలా బాగా ఉయోగపడుతుంది.

7.మందార పువ్వు లో క్యాన్సర్ ని ఎదుర్కునే గుణాలు ఎక్కువగా ఉన్నట్టు ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి క్యాన్సర్ తో బాధపడేవారు మందార పువ్వుతో చేసిన టీ తీసుకోవడం వలన క్యాన్సర్ ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా క్యాన్సర్ లేని వారు భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా జాగ్రత్త తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.

8.మందార పువ్వు జీర్ణ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థ సమస్యలతో బాధపడుతున్న వారికి చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది.

9.మందార పువ్వు మలబద్దకానికి చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి మలబద్దకానితో బాధపడే వారు ఉదయం లేవగానే మందార పువ్వు టీ తీసుకోవడం వలన మలబద్దకాన్ని దూరం చేసుకోవచ్చు.

10.మందార పువ్వు లో యాంటిసెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అవి గాయాలను నయం చేయడానికి ఎంతో ఉపయోగపడుతాయి. కాబట్టి గాయాల మీద మందార పువ్వు ని పేస్ట్ గ చేసి రాయడం వలన త్వరగా గాయం మానడానికి ఉపయోగపడుతుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES