HomeHealthGreen chana : పచ్చి శనగలతో అధ్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Green chana : పచ్చి శనగలతో అధ్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Green chana :

పచ్చి శనగలు ( green chana ) అంటే బహుశా ఇష్టపడని వారు ఉండరేమో .. ఎందుకంటే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది తినడానికి ఇష్టపడతారు. తినడానికి రుచి మాత్రమే బాగుండటమే కాదు ఇవి తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎండిన శనగలు కంటే పచ్చి శనగలని తినడానికి ఇష్టపడతారు. వీటిని శీతాకాలం లో ఎక్కువగా పండిస్తారు. పచ్చి శనగలని ఎక్కువగా ఉడకబెట్టి ( roasted chana ) లేదా డైరెక్ట్ గా చెట్టు మీద నుంచి పచ్చివి ( kabuli chana ) తెంపుకుని తింటారు. చెట్టు మీద నుంచి తెంపిన పచ్చివి చాలా రుచిగా ఉంటాయి.

పచ్చి శనగలలో ( green chana ) చాలా ఔషద గుణాలు ఉంటాయి. వీటిని ఉడకబెట్టి తిన్న లేదా పచ్చివి తిన్నా వీటిలో పోషకాలు అలాగే ఉంటాయి. ముఖ్యంగా ఈ పచ్చి శనగలను ఉత్తర భారత దేశంలో ఎక్కువగా తింటారు. ఈ పచ్చి శనగలను వంటకాల్లో కూడా వాడుతారు. వీటితో వివిధ రకాల వంటకాల తయారీలో వాడుతారు. హిందీ లో ఈ పచ్చి శనగలను చోలియా, హర చన ( green chickpeas in hindi ) అని అంటారు. వీటిని ఆంగ్లం లో గ్రీన్ చిక్ పీస్ ( green chickpeas in english ) అని పిలుస్తారు. ఇది శీతాకాలంలో పెరిగే ఫాభేసి కుటుంబానికి చెందిన మొక్క. దీన్ని న్యూ ఎడామామ్ అని కూడా పిలుస్తారు.

అర కప్పు పచ్చి శనగలలో ( fresh green chana ) దాదాపుగా 300 పైగా కాలరీలు ఉంటాయి. 19 గ్రాముల ప్రోటీన్లు, 5 గ్రాముల కొవ్వు , 10 గ్రాముల చక్కెర , 18 గ్రాముల డైటరీ ఫైబర్స్ ఉంటాయి. డాక్టర్ లు సైతం వీటిని తినమని చెబుతుంటారు. పచ్చి శనగలలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్ , విటమిన్ ఇ, విటమిన్ కె, సెలీనియం , మెగ్నీషియం పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం చాలా మంచిది. అంతేకాకుండా వీటిని రోజు అల్పాహారంగా కూడా తీసుకోవచ్చును. మార్కెట్ లో ( green chana online ) కూడా ఈ పచ్చి శనిగలకు మంచి డిమాండ్ ఉంది.

Health benefits of green chana : పచ్చి శనగలతో ఆరోగ్య ప్రయోజనాలు

  • పచ్చి శనిగలలో ( green chana benefits ) విటమిన్ సి ఉంటుంది. అందుకే పచ్చి శనిగలు తింటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ ల భారిన పడకుండా కాపాడుతుంది.
  • పచ్చి శనిగలలో ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా జీవక్రియ రేటు ని కూడా పెంచుతుంది. తద్వారా మీరు తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది.
  • పచ్చి శనిగలలో ( green chana ) పొటాషియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు ని నియంత్రణలో ఉంచుతుంది.
  • జంక్ ఫుడ్ తినడం వల్ల శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోతుంది. పచ్చి శనిగలు తినడం వల్ల మన శరీరంలోని చెడు కొలెస్టరాల్ ని కరిగిస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారు వీటిని తినడం మంచిది.
  • జుట్టు పెరగాలి అని అనుకునే వారు వీటిని తినడం మంచిది. వీటిని తినడం వల్ల జుట్టు వొత్తుగా , బలంగా పెరుగుతుంది. అంతేకాకుండా చర్మం నిగారింపు కూడా వస్తుంది. గోళ్ళను కూడా ధృడంగా పెరిగేలా చేస్తుంది.
  • పచ్చి శనగలు గర్భిణీ స్త్రీలు తినడం చాలా మంచిది. ఎందుకంటే పచ్చి శనిగలలో విటమిన్ బి9 ఉంటుంది. ఈ విటమిన్ బి9 పిండం అభివృద్ధిలో ఉపయోగపడుతుంది.
RELATED ARTICLES
LATEST ARTICLES