HomeHealthGac fruit : గాక్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు

Gac fruit : గాక్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు

gac fruit :

మన భారతదేశంలో అస్సాం లో ఎక్కువగా పండించే ఫ్రూట్ గాక్ ఫ్రూట్ ( gac fruit ).గాక్ ఫ్రూట్ లో మన శరీరానికి కావల్సిన పోషక విలువలు అన్ని ఉంటాయి. కాబట్టి ఈ గాక్ ఫ్రూట్ ని ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు. న్యూ ఇయర్ వేడుకల్లో వియత్నాం దేశంలో ఈ గాక్ ఫ్రూట్ ని న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఇస్తారు. ఇది మన భారత దేశంలో నే కాకుండా ఆగ్నేసియా, ఆస్ట్రేలియా మరియు చైనా దేశంలో ఎక్కువగా లభిస్తుంది. ఈ పండు ఎక్కువగా డిసెంబర్ మరియు జనవరి నెలల్లో ఎక్కువగా లభిస్తుంది.

ఈ గాక్ ఫ్రూట్ లో ( gac fruit )నారింజ పండు కంటే 40 రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. కాబట్టి అనారోగ్యంగా ఉన్నపుడు మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ సి తీసుకొమ్మని డాక్టర్ లు సైతం సూచిస్తారు. అందుకే చాలా మంది డాక్టర్లు ఈ గాక్ ఫ్రూట్ ని తినమని చెబుతుంటారు. టొమాటో కంటే 60 రెట్లకి ఎక్కువగా లైకోపిన్ మరియు క్యారట్ కంటే 10 రెట్లు ఎక్కువగా బీటా కెరోటిన్, మొక్కజొన్న కంటే 40 రెట్లు ఎక్కువగా జియాక్సెంట్ ఉంటుంది. ఈ గాక్ ఫ్రూట్ ని ఎక్కువగా జ్యూస్ ల తయారీలో వాడుతారు.

Neutrients values in gac fruit : గాక్ ఫ్రూట్ లో పోషక విలువలు

గాక్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి. గాక్ ఫ్రూట్ లో విటమిన్ సి, లైకోపిన్ , బీటా కెరోటిన్, యాంటీ యాక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి.

Gac fruit benefits : గాక్ ఫ్రూట్ తో ఆరోగ్య ప్రయోజనాలు

1.గాక్ ఫ్రూట్ లో విటమిన్ సి నారింజ పండులో కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తి ని పెంచి , ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

2.గాక్ ఫ్రూట్ లో జియాక్సంతిన్ మరియు లుటిన్ ఉంటుంది. ఇది మన కంటి చూపు ని మెరుగుపరుస్తుంది.

3.గాక్ ఫ్రూట్ లో సమృద్ధిగా విటమిన్ సి, ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారు ఈ గాక్ ఫ్రూట్ ని తింటే చక్కటి పలితం ఉంటుంది.

4.అధిక కొలెస్టరాల్ సమస్యతో బాధపడుతున్నవారు ఈ గాక్ ఫ్రూట్ ని తింటే శరీరం లో పేరుకుపోయిన చెడు కొలెస్టరాల్ ని కరిగిస్తుంది.

5.గాక్ ఫ్రూట్ లో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి గుండె సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. అధిక రక్తపోటు ని కూడా తగ్గిస్తుంది.

6.గాక్ ఫ్రూట్ లో విటమిన్స్ మరియు మినిరల్స్ , సెలీనియం ఉండటంతో ఇవి మన నాడీ వ్యవస్థ ని ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.అంతేకాకుండా వొత్తిడి ని కూడా తగ్గిస్తుంది.

7.వయస్సు పెరిగే కొద్ది మొహం పై ముడతలు ఏర్పడతాయి.గాక్ ఫ్రూట్ లో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ సి మరియు కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా చర్మపు ముడతలు రాకుండా కాపాడుతుంది.

8.గాక్ ఫ్రూట్ లో అధికంగా టొమాటోలకంటే 60 శాతం ఎక్కువగా లైకోపిన్ ఉంటుంది. ఇది స్ట్రోక్, క్యాన్సర్ మరియు సున్బర్న్ వంటివి రాకుండా కాపాడుతుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES