Fennel seeds in telugu:
Fennel seeds అంటే తెలుగులో సోంపు గింజలు అని అర్థం. సోంపు గింజలు ( Fennel seeds in telugu ) అంటే తెలియని వారు బహుశా ఎవరూ ఉండరేమో. ఈ సోంపు గింజలను రోజు భోజనం చేశాక కచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ( fennel seeds in telugu ) సోంపు గింజలని తినడం వల్ల నోరు ఫ్రెష్ అవ్వడమే కాకుండా, తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది అని సోంపు గింజలను తింటారు . అందుకే సోంపు గింజలను ( Fennel seeds ) ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు.
సోంపు గింజలలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. సోంపు గింజల్లో కాల్షియమ్, మెగ్నీషియం, విటమిన్ ఎ మరియు డి ఇలా చాలా పోషకాలు ఉంటాయి. సోంపు ని రోజు ఆహారం తిన్న తరువాత తీసుకుంటె మీరు బరువు తగ్గే అవకాశం కూడా ఉంది. కొన్ని వంటకాల్లో సువాసన రావడానికి సోంపు గింజలను వాడతారు. అంతేకాకుండా ఐస్క్రీమ్ తయారీలో , మౌత్ రిఫ్రెష్ పదార్థాలు మరియు పేస్ట్ ల తయారీలో కూడా సోంపు గింజలను వాడుతారు.
సోంపు గింజలు తినడం కలిగే ఉపయోగాలు : ( fennel seeds in telugu)
ఆయుర్వేదిక్ మందుల తయారీలో కూడా సోంపు గింజలను వాడుతారు. సోంపు గింజల్లో విటమిన్ C ఉంటుంది కాబట్టి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సోంపు లో ఉండే విటమిన్ C కి నీటిలో కరిగే గుణం ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి ని పెంచి అనేక వ్యాధులతో పోరాడటానికి ఉపయోగపడుతుంది. ఇలా సోంపు గింజలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
సోంపు గింజల్లో వుండే మెగ్నీషియం వలన మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. సోంపు గింజలు రోజు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ప్రక్రియ మెరుగుపడి తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. సోంపు లో ఉండే పొటాషియం మరియు మాంగనీస్ వల్ల మన శరీరంలో ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇలా సోంపు గింజల తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషక విలువలు అందుతాయి.
రోజు సోంపు గింజలను తీసుకోవటం వల్ల చర్మం పై ఉన్న ముడతలు కూడా మాయం అవుతాయి. సోంపు గింజలు నానబెట్టిన వాటర్ తో రోజు మొహం క్లీన్ చేసుకుంటే కొన్ని వారాల్లోనే మోహం పై ఉన్న ముడతలు పోయి మోహం కాంతి వంతంగా తయారు అవుతుంది.
సోంపు ని పేస్ట్ లా చేసుకుని దానికి కొంచం రోజ్ వాటర్ ని కలిపి మొహానికి పట్టించాలి. ఒక 10 నిమిషాలు అలాగే ఉంచి చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మోహం పై వున్న ముడతలు పోవడమే కాకుండా మోహం పై ఉన్న ఆయిల్ కూడా పోతుంది. ఈ టిప్ ఎక్కువగా ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇలా సోంపు గింజలు చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది.
ఈ ఆధునిక యుగంలో పని వొత్తిడి కారణంగా అవ్వచ్చు లేదా నిద్ర లేకపోవడం కారణంగా జుట్టు రాలిపోతుంది. ప్రతీ ఒక్కరూ జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలిపోయే సమస్య ని మీరు సోంపు గింజలలో చెక్ పెట్టవచ్చు. అలాగే చిన్నతనం నుంచి వచ్చే తెల్ల జుట్టు కి కూడా సొంపు గింజలు మంచి పరిష్కారం. రోజు స్నానం చెసేటప్పుడు ఒకరోజు రాత్రి ముందే నానబెట్టిన సోంపు గింజల నీరు ను తలపై పోసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా తెల్ల జుట్టు నల్లగా అవ్వడమే కాకుండా, జుట్టు చాలా ధృడంగా తయారు అవుతాయి.
చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు . అదిక బరువుతో బాధపడుతున్న వారు సొంపు గింజలు తినడం వల్ల బరువుని తగ్గవచ్చు. ఒక చెంచా సోంపు గింజలను ఒక గ్లాస్ వాటర్ లో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పడిగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది.
సోంపు గింజల్లో అధిక శాతం ఫైబర్ కూడా ఉంటుంది. రోజు ఉదయం సొంపు తినడం వల్ల ఎక్కువగా ఆకలి అవ్వకుండా చూస్తుంది. దీనివల్ల అధిక బరువు కి చెక్ పెట్టవచ్చు. ఆకలి అవ్వదు కాబట్టి ఎలాగో తినకుండా ఉంటాం అందువల్ల బరువు పెరగడానికి ఛాన్స్ యే ఉండదు.
సోంపు గింజల్లో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. రక్త హీనతతో బాధ పడుతున్న వారు సొంపు గింజలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
సోంపు గింజలను రోజు తినడం వల్ల ప్రాణాంతకర వ్యాధి అయిన కేన్సర్ బారిన పడకుండా చూస్తుంది. స్త్రీలలో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రాకుండా కాపాడుతుంది. కాలేయ సంబంధిత కేన్సర్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. ఇలా రోజు సోంపు గింజలు తినడం వల్ల కేన్సర్ బారిన పడకుండా ఉండవచ్చు.
కానీ సోంపు గింజలు మరీ ఎక్కువగా తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అని వైద్య నిపుణులు చెప్తున్నారు. సోంపు గింజలు ఎక్కువగా తింటే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అని నిపుణులు అంటున్నారు. ఎక్కువగా జలుబు అయినప్పుడు కుడా సొంపు గింజలు తింటే సమస్య ఎక్కువ అవుతుందని , అందుకే ఇలాంటి సమస్యతో బాధపడితే వెంటనే సోంపు గింజలు తినడం మానేయండి.