HomeHealthBarley in telugu : బార్లీ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు

Barley in telugu : బార్లీ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు

Barley in Telugu :

Barley గింజలను తెలుగులో కూడా యవలు అని పిలుస్తారు. ఇది ఒక గడ్డి జాతికి చెందిన మొక్కగా పరిగణించబడింది. సహజంగా ఈ బార్లీ గింజలను ( barley in telugu ) చాలా మంది అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ బార్లీ గింజల్లో ఆరోగ్యాన్ని మెరుగు పరిచే గుణాలు ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతే కాదు వీటిని ఎక్కువగా ఆల్కహాల్ తయారీలో కూడా వాడుతారు. మరియు పులియ పెట్టిన ఆహారాల్లో ఈ బార్లీ గింజలను ఎక్కువగా ఉయోగిస్తుంటారు. ఈ బార్లీ గింజలను ఎప్పుడో పది వేల సంవత్సరాల క్రితమే పందించిన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్తగా చేసిన సర్వేలో వెల్లడి అయిన విషయం ఏంటంటే ఈ బార్లీ గింజల సాగు చేయడం బియ్యం మరియు మొక్క జొన్న, గోధుమలతో పోలిస్తే వీటి స్థానం నాలుగవ స్థానంలో ఉంది. బార్లీ గింజలలో అధిక శాతం డైటరీ ఫైబర్ మరియు మాంగనీస్ అలాగే విటమిన్ బి6 ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. బార్లీ గింజలను మొదటగా పర్చత్యా దేశాలలో ఎక్కువగా వాడే వారు ఎందుకంటే మొదటగా ఇది యురేశియలో గుర్తించబడింది.

బార్లీ గింజలను ఎక్కువగా సూప్ రూపంలో తీసుకుంటారు. ఈ బార్లీ గింజలలో జీరో కొలెస్ట్రాల్ ఉండడం వలన ఇది అధిక కొవ్వు తో బాధపడుతున్న వారికి ఎలాంటి హానీ చేయదు. అంతే కాకుండా ఈ బార్లీ గింజలకు రక్తంలోని కొలెస్టరాల్ స్థాయిని తగ్గించే గుణం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

barley in telugu

కొలెస్టరాల్ (Barley reduce cholesterol):

బార్లీ గింజలను ఎక్కువగా సూప్ రూపంలో తీసుకుంటారు. ఈ బార్లీ గింజలలో జీరో కొలెస్ట్రాల్ ఉండడం వలన ఇది అధిక కొవ్వు తో బాధపడుతున్న వారికి ఎలాంటి హానీ చేయదు. అంతే కాకుండా ఈ బార్లీ గింజలకు రక్తంలోని కొలెస్టరాల్ స్థాయిని తగ్గించే గుణం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

మధుమేహం (Barley reduces diabetes) :
బార్లీ గింజలలో అధిక ఫైబర్ ఉండడం వలన ఇది మధుమేహ వ్యాధులకు తిన్న ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం అయ్యేలా చేసి తక్కువ చెక్కరను విడుదల చేయడం వలన మధుమేహం అదుపులో ఉండేందుకు సహాయపడుతుంది. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారు రోజు ఒక పూట బార్లీ ఉప్మా ని తీసుకోవడం చాలా మంచిది.

అధిక బరువు (Barley reduces over weight) :
బార్లీ గింజలు అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. ఇవి చెడు కొవ్వు ని కరిగించి బరువును తగ్గిస్తుంది. రోజు ఉదయం లేవగానే బార్లీ గింజల సూప్ రూపంలో తీసుకుంటే కొన్ని రోజులలో మి చెడు కొవ్వుని కరిగిస్తుంది. మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

గాల్ బ్లాడర్ రక్షణ (gallbladder protection) :

గాల్ బ్లాడర్ ఇన్ఫెకషన్ మరియు గాల్ బ్లాడర్ క్యాన్సర్ రాకుండా బార్లీ గింజలు ఉపయోగపడుతాయి. బార్లీ గింజలను సూప్ రూపంలో తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకుంటూ ఉంటే గాల్ బ్లాడర్ కి సంబంధించిన ఏలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ముందుగానే వచ్చిన గాల్ బ్లాడర్ సమస్యలను కూడా నివారించడానికి సహాయపడుతుంది.

కడుపులోని పేగుల సంరక్షణ (improve intestine health):

బార్లీ గింజలు ( barley in telugu ) పేగు పూత మరియు పేగు కాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారికి మరియు ఇంకా పేగు కి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారికి ఈ బార్లీ గింజలు ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు సూచస్తున్నారు. కాబట్టి పేగులకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు మరియు పేగులకు భవిష్యత్తులో సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు పాటించాలి అనుకునే వారు ఈ బార్లీ గింజలను రోజు ఉదయం ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.


ఇవే కాకుండా బార్లీ గింజలు ఆహారంగా తీసుకోవడం వలన గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా చేస్తుంది. అస్తమా లాంటి సమస్యలను తగ్గిస్తుంది. వెంట్రుకలకు చర్మానికి కావల్సిన పోషకాలను అంధిస్తుంది. క్యాన్సర్ వ్యాధి దరిచేరకుండా సహాయపడుతుంది. ఇమ్యూనిటి సిస్టమ్ ని మెరుగు పరుచుకోవడానికి సహాయపడుతుంది. ఇలా ఈ బార్లీ గింజలు అన్నో రకాల ఆరోగ్య సమస్యను అధగమించడానికి ఉపయోగపడుతాయి.

RELATED ARTICLES
LATEST ARTICLES