Ash gourd in telugu :
బహుశ బూడిద గుమ్మడికాయ ( Ash gourd in telugu ) అంటే మన తెలుగు రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఉండరేమో. ఎందుకంటే బూడిద గుమ్మడికాయ ని కొత్తగా కట్టిన ఇల్లు గృహప్రవేశం లో మరియు ఇంటి ముందర దిష్టి తగలకుండా ఉండటానికి బూడిద గుమ్మడికాయ ని గుమ్మానికి వ్రేలాడదీస్తారు. అంతేకాకుండా కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసిన కూడా వాహన పూజ అయిపోయిన తర్వాత వాహనం ముందు బూడిద గుమ్మడికాయ ని కొడతారు. ఇలా చేస్తే దిష్టి పోయి అంత మంచి జరుగుతుందని నమ్మకం. ఇలా ఎక్కువగా బూడిద గుమ్మడికాయ ని పూజలల్లో వాడుతారు.
బూడిద గుమ్మడికాయ ని ( Ash gourd in telugu ) పూజలల్లోనే కాకుండా తింటారని చాలా మందికి తెలియదు. అవును మీరు విన్నది నిజమే .. బూడిద గుమ్మడికాయ కూడా తింటారు. ఎందుకంటే బూడిద గుమ్మడికాయ లో చాలా పోషకాలు ఉంటాయి. ఈ బూడిద గుమ్మడికాయ తో వంటకాలు కూడా చేసుకుని తింటారు. బూడిద గుమ్మడికాయ నీ చాలా తక్కువ మంది తింటారు. కానీ మన శరీరానికి కావల్సిన పోషకాలు ఈ బూడిద గుమ్మడికాయ లో ఉంటాయి. బూడిద గుమ్మడికాయ ని ” చైనీస్ వాటర్ మిలన్” వ్యాక్స్ గార్డ్ లేదా వింటర్ మిలన్ అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. బూడిద గుమ్మడికాయ ని తినడం వల్ల చాలా అరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని నిపుణులు చెప్తున్నారు.
బూడిద గుమ్మడికాయ తో ( Ash gourd in telugu ) వంటకాలు మాత్రమే కాకుండా జ్యూస్, సూప్ మరియు సలాడ్ చేసుకుని తింటారు. బూడిద గుమ్మడికాయ రుచి చాలా చప్పగా ఉంటుంది. దానికంటూ రుచి ఎమి ఉండదు. బూడిద గుమ్మడి కాయ లో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా చాలా తక్కువగా క్యాలరీలు ఉంటాయి. బూడిద గుమ్మడికాయ తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా మరియు కిడ్నీ సమస్యలు రాకుండా కాపాడుతుంది.
బూడిద గుమ్మడికాయ లో పోషక విలువలు : Neutrients values in Ash gourd in telugu
బూడిద గుమ్మడికాయ లో విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా బూడిద గుమ్మడికాయ లో విటమిన్ B6 , విటమిన్ E, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం మరియు ఫోలేట్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. థయామిన్, కెరోటిన్ మరియు జియక్సాంతిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
బూడిద గుమ్మడికాయ తినడం వల్ల కలిగే ఉపయోగాలు : health benefits of Ash gourd in telugu
1.బూడిద గుమ్మడికాయ లో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. బూడిద గుమ్మడికాయ లో 95 శాతం కంటే ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. బూడిద గుమ్మడికాయ తినడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.
2.మలబద్దకం సమస్యతో బాధ పడే వారు బూడిద గుమ్మడికాయ నీ తింటే మలబద్దకం తగ్గుతుంది. అందుకే మలబద్దక సమస్యతో బాధపడుతున్నవారు బూడిద గుమ్మడికాయ ని డైట్ లో చేర్చుకోవడం ద్వారా మలబద్దక సమస్యకి చెక్ పెట్టవచ్చు.
3.బూడిద గుమ్మడికాయ లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అధిక ఫైబర్ వుండటం వల్ల జీర్ణ క్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు జీర్ణం కాకపోవడం ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
4.బూడిద గుమ్మడికాయ లో తక్కువగా క్యాలరీలు ఉంటాయి. కాబట్టి అధిక బరువు పెరిగే అవకాశం ఉండదు.
5.బూడిద గుమ్మడికాయ ఒక మంచి డిటాక్సీ ఫై ఏజెంట్ గా పనిచేస్తుంది. శరీరంలో విషతుల్యాలను బయటకి పంపిస్తుంది.
6.బూడిద గుమ్మడికాయ లో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది మన శరీరములో రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. వివిధ రకాల రోగాల భారిన పడకుండా కాపాడుతుంది. బూడిద గుమ్మడికాయ లో నియాసిన్, రిబోఫ్లావిన్ మరియు థయామిన్, కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి.
7.బూడిద గుమ్మడికాయ తినడం వల్ల నిద్ర మంచిగా పడుతుంది. అంతేకాకుండా ఇది మెదడు జ్ఞాపక శక్తి ని పెంచుతుంది. అందుకే జ్ఞాపక శక్తి లేమితో బాధపడేవారు బూడిద గుమ్మడికాయ తినడం మంచిదని నిపుణులు చెబతున్నారు.
8.బూడిద గుమ్మడికాయ యాంటి డయ్యేరియల్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. చాల మంది నీరు సరిగా తీసుకోకుండా కిడ్నీ లో రాళ్లు, మూత్రం లో మంట వంటి సమస్యలతో బాధపడతారు. ఇలాంటి వారు బూడిద గుమ్మడికాయ ని తింటే కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
9.ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు బూడిద గుమ్మడికాయ తింటే మంచి ఫలితం ఉంటుంది.
10.బూడిద గుమ్మడికాయ హైపర్ టెన్షన్ తో బాధపడేవారు బూడిద గుమ్మడికాయ తింటే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. గుండె సంబంధిత నరాలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి , గుండెని ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.