HomeHealthAnjeer benefits : అంజీర పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Anjeer benefits : అంజీర పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

anjeer benefits :

అంజీర పండ్లు తినడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషక విలువలు ( anjeer benefits ) అన్ని అందుతాయి. అంజీర పండ్లు చూడటానికి మేడి పండు ఆకారంలో ఉంటుంది. అంజీర పండ్లు తీయగా చాలా రుచిగా ఉంటుంది. వీటి తీయదనం కారణముగా వీటిని తినడానికి ఎక్కువ మంది మక్కువ చూపుతారు. అంజీర పండ్లను అత్తి పండ్లు కూడా అని అంటారు. మనదేశంలో మార్కెట్ లో ఎక్కువగా లభిస్తాయి. ఇవి పండ్ల రూపం లో మరియు డ్రై ఫ్రూట్ గా కూడా మార్కెట్ లో లభ్యం అవుతుంది. ఈ అంజీర పండ్లని రోజు తీసుకోవడం వల్ల చాలా అనారోగ్యాలకు ( anjeer benefits ) చెక్ పెట్టవచ్చు. ఎక్కువ మంది అంజీర ని పండు రూపంలో తినడం కంటే డ్రై ఫ్రూట్ గా తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. అంజీర పండ్లు గోధుమ రంగులో లేదా ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. మాములుగా ఏ పండు అయిన సరే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు.అందుకే ఈ పండు ని ఎండబెట్టి డ్రై ఫ్రూట్ గా తీసుకుంటారు. ఈ పండులో అనేక రోగాలని నయం చేసే గుణాలు ఉన్నాయి అని వైద్యులు చెబుతుంటారు.

రోజు డ్రై ఫ్రూట్ తింటే మన ఆరోగ్యానికి ( anjeer benefits ) ఎంతో మేలు చేస్తాయి. అంజీర ని రోజు నిద్రపోయే ముందు తీసుకుంటే మంచి పలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న అంజీరా కి ఒక పెద్ద చరిత్రనే ఉంది. అయిదు వేల సంవత్సారాలు కిందటనే అంజీరా ని సాగుచేసేవవాల్లట. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా అంజీర ను స్పెయిన్ , ఇటలీ , టర్కీ, జర్మనీ మరియు బ్రెజిల్ తదితర దేశాల్లో ఎక్కువగా అంజీర ని సాగు చేస్తున్నారు.

అంజీర లో ఉండే పోషకాలు : neutrients values in anjeer

అంజీర పండులో మనకి కావాల్సిన పోషక విలువలు అన్ని ఉంటాయి. అంజీర పండులో విటమిన్ ఎ , విటమిన్ కె , విటమిన్ B6 మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అంజీర పండులో కాల్షియమ్ మరియు పోటాషియం అధిక పాల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగ్నీషియం, పాస్పరస్ మరియు సోడియం ఇతర కనిజ లవణాలు కూడా ఉన్నాయి.

anjeer benefits

అంజీర పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు : Health benefits of anjeer

1.జీర్ణక్రియ వ్యవస్థ
అంజీర పండు ని తినడం వల్ల మన జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది.అంజీర లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది.

2.ఎముకల మరియు కండరాల నొప్పికి :
అంజీర లో కాల్షియమ్, ఫాస్పరస్ మరియు మెగ్నీషియం కనిజాలు ఉంటాయి. ఇవి మన కండరాల మరియు ఎముకలు బలంగా తయారు అవ్వడానికి దోహదపడతాయి.

3.ఉబకాయం:
అదిక బరువుతో బాధపడేవారు అంజిర ని తింటే మీ శరీరములో ఉన్న కొలెస్టిరాల్ స్థాయిని తగ్గిస్తుంది మరియు దీంట్లో అధికంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి బరువు పెరిగే అవకాశం ఉండదు.

4.మానసిక ఒత్తిడి:
మానసిక ఒత్తిడి తో బాధపడేవారు ఈ అంజీర ని తింటే చక్కటి ఫలితం ఉంటుంది.

5.గుండె జబ్బు :
అంజీర ని తినడం వల్ల శరీరం లో చెడు కొలెస్టిరాల్ స్థాయిని తగ్గిస్తుంది. గుండె ని పదిలంగా ఉంచుతుంది.

6.క్యాన్సర్ :
అతి ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా అంజీర మనల్ని కాపాడుతుంది.

7.లైంగిక సామర్థ్యం :
లైంగిక సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు రోజు ఉదయం పూట రెండు అంజీరాలని తీసుకుంటే మీ లైంగిక సమస్యలు తగ్గుతాయి.

8.బ్లీడింగ్ డిజార్డర్ : బ్లీడింగ్ డిజార్డర్ సమస్యతో బాధపడుతున్నవారు రోజు అంజీరని తినడం వల్ల బ్లీడింగ్ డిజార్డర్ సమస్య తగ్గుతుంది.

9.మెలనిన్ సమస్య :
అంజీరని మెత్తగా పేస్ట్ లా చేసుకుని మొహానికి రాసుకుంటే మొహం పై ఉన్న మెలనిన్ తగ్గుతుంది.

10.డయాబెటిస్ :
డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నవారు అంజీరని తింటే రక్తం లో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

LATEST ARTICLES