albakara fruit : ( aloo bukhara fruit )
ఆల్ బుఖార పండ్లు ( albakara fruit ) మనకు ఎక్కువగా రేయినీ సీజన్ లో మాత్రమే కనిపిస్తాయి. ఈ ఆల్ బుఖార పండ్లు ఎక్కువగా పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ లో పండిస్తారు.ఆల్ బుఖార పండ్లు ( albakara fruit ) ఎరుపు రంగు మరియు నీలం రంగు లో ఉంటాయి.ఆల్ బుఖార పండ్లు పులుపు రుచిని కలిగివుంటాయి. ఈ ఆల్ బుఖార పండ్లు తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీని రుచి పుల్లగా , వగరుగా ఉండటం వల్ల ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు. ఈ ఆల్ బుఖార పండ్లు డ్రై ఫ్రూట్ రూపంలో కూడా దొరుకుతాయి. ఆల్ బుఖార పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరం లో ఉన్న చెడు వ్యర్ధాలను బయటకి పంపుతుంది. ఆల్ బుఖార పండ్లు తినడం వల్ల మనకు చాలా పోషకాలు అందుతాయి.
ఆల్ బుఖార పండ్లని ( albakara fruit ) ఇంగ్లీష్ లో ” plums and Indian plum ” అని అంటారు. ఆల్ బుఖార ని శాస్త్రీయంగా ప్రూనస్ డొమెస్టిక్ అని పిలుస్తారు. ఆల్ బుఖార పండ్లని గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకుంటారు. ఆల్ బుఖార పండ్ల లో ఎక్కువగా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది మన శరీరములో రోగ నిరోధకశక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. అందుకే ఎక్కువగా గర్భిణీ స్త్రీలు కూడా ఆల్ బుఖార పండ్లని తింటారు.
ఆల్ బుఖార పండ్లలో పోషక విలువలు : nutrients in albakara fruit ( aloo bukhara )
ఆల్ బుఖార పండ్లలో చాలా పోషక విలువలు ఉన్నాయి. ఆల్ బుఖార పండ్లలో తక్కువ కొవ్వు పదార్థం మరియు అధిక డైటరీ ఫైబర్ ఉంటుంది. ఆల్ బుఖార పండ్లలో ఎక్కువగా విటమిన్ ఎ మరియు సి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఆల్ బుఖార పండ్లలో ఐరన్, కాల్షియమ్, మెగ్నీషియం, పొటాషియం , విటమిన్ B6 మరియు విటమిన్ B12 ఎక్కువగా ఉంటాయి.
ఆల్ బుఖార పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు : health benefits of albakara fruit ( aloo bukhara fruit )
1.ఆల్ బుఖార పండ్లలో ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. యాంటి ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. కాబట్టి గుండె పోటు మరియు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.
2.ఆల్ బుఖార పండ్లలో సార్బిటాల్ మరియు ఇసాటిన్ లు ఉంటాయి. సార్బిటాల్ మలభధ్ధకాన్ని నివారిస్తుంది. మరియు ఇసాటిన్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి దోహదపడుతుంది. అందుకే మలబద్దక సమస్యతో బాధపడుతున్నవారు ఆల్ బుఖార పండ్లని తినండి.
3.ఆల్ బుఖార పండ్లు తినడం వల్ల దానిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కాన్సర్ కణాలతో పోరాడుతాయి. అంతేకాకుండా ఆడవారిలో వచ్చే రొమ్ము క్యాన్సర్ మరియు శ్వాసకోశ సంబంధిత క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
4.ఆల్ బుఖార పండ్లలో ఐరన్ ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. ఐరన్ రక్త ప్రసరణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. దీనివల్ల ఆల్ బుఖార పండ్లని తినడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
5.ఆల్ బుఖార పండ్లలో అధికంగా ఫైబర్ ఉంటుంది. దీనివల్ల శరీరంలో కొలెస్టరాల్ స్థాయిని తగ్గిస్తుంది. కాలేయంలో కొలెస్టిరాల్ స్థాయిని తగ్గిస్తుంది.
6.ఆల్ బుఖార పండ్లలో బోరాన్ ఉంటుంది.ఆల్ బుఖార పండ్లు రోజు తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా, ధృడంగా ఉంటాయి. బోరాన్ ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
7.ఆల్ బుఖార పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి శరీరం లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆల్ బుఖార పండ్లు తినడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.
8.ఆల్ బుఖార పండ్లలో విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ లు ఎక్కువగా ఉంటాయి. కంటి చూపు సమస్యతో బాధపడేవారు ఆల్ బుఖార పండ్లని తింటే కంటి సమస్యలు దూరం అవుతాయి.
9.ఆల్ బుఖార పండ్లలో గైసేమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు ఆల్ బుఖార పండ్లు తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
10.ఆల్ బుఖారా పండ్లు తినడం వల్ల చర్మం పై ఉన్న ముడతలు పోవడమే కాకుండా, చర్మం కాంతవంతమవుతుంది. చర్మంపై ఏర్పడిన మచ్చలు కూడా పోతాయి.
సైడ్ ఎఫెక్ట్స్: side effects of albakara fruit ( aloo bukhara )
1.ఆల్ బుఖార పండ్లు ఎక్కువ తింటే అనారోగ్యాలు తప్పవు. ఆల్ బుఖార పండ్లలో ఆక్సాలిక్ ఆసిడ్ ఉంటుంది. బుఖార పండ్లని ఎక్కువగా తినడం వల్ల మరియు తక్కువ నీరు తీసుకుంటే కిడ్నీ లో రాళ్లు ఏర్పడతాయి.
2.ఆల్ బుఖార పండ్లు ఎక్కువ తింటే కొన్ని అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.
3.ఆల్ బుఖార పండ్లు ఎక్కువ తింటే కడుపులో పుండ్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఆల్ బుఖార పండ్లని మరీ ఎక్కువగా తినకుండా మితంగా తీసుకోవాలి.
ఆల్ బుఖార రేట్ : aloo bukhara price ( albakara fruit price )
ఆల్ బుఖార పండ్లు ఎక్కువగా మన భారతదేశం లో కాశ్మీర్ లో మరియు పాకిస్తాన్ లో స్వాత్ లోని ఎత్తైన ప్రాంతాల్లో మరియు ఈజిప్ట్ , ఐరోపా దేశాల్లో ఎక్కువగా పెరుగుతుంది. మార్కెట్ లో ఆల్ బుఖార పండ్లకి మంచి డిమాండ్ ఉంది. మన దేశంలో ఒక 1 కేజీ ఆల్ బుఖార పండ్లకి సుమారుగా 300 రూపాయలు గా ఉంటుంది. అంతేకాకుండా డ్రై ఆల్ బుఖార పండ్లకి ఎక్కువ ధర ఉంటుంది. సుమారుగా 1 కేజీ డ్రై ఆల్ బుఖార కి 600 రూపాయలు గా ఉంటుంది.