Hanuman chalisa pdf : hanuman chalisa in telugu
హనుమంతుడికి పూజ చేసేటప్పుడు హనుమాన్ చాలీసా ( hanuman chalisa pdf ) మరియు ఆంజనేయ సహస్రం కచ్చితంగా చదవాలి. అంతేకాకుండా ఓం ఆంజనేయ నమ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అంతా మంచి జరుగుతుంది. హనుమంతుడికి 5 సార్లు ప్రదక్షిణ చేయాలి మరియు జిల్లేడు ఆకులతో , ఎర్ర చందనం తో దేవుడిని అలంకరించాలి. హనుమంతుడి కాలు దగ్గర శని దేవుడు ఉంటాడు కాబట్టీ హనుమాన్ కాలిని ఎప్పుడూ మొక్కవద్దు. అరటి మరియు మామిడి పండ్లు అంటే హనుమాన్ కి చాలా ఇష్టం కాబట్టి పూజ అనంతరం దేవుడికి సమర్పించండి. పూజ చేసేటపుడు హనుమాన్ చాలీసా పారాయణము చేయడం వల్ల అనుకున్న పనులు జరుగుతాయి. అంతేకాకుండా శని దోషం కూడా తగ్గుతుంది. హనుమాన్ కి తమలపాకుల దండ అంటే చాలా ఇష్టం. కాబట్టి పూజ చేసేటప్పుడు హనుమాన్ కి తమలపాకుల దండ వేయండి. అంతేకాకుండా గురువారం రోజున పూజ చేసేవారు హనుమాన్ కి మల్లె పూల దండ వేయండి అంతా మంచి కలుగుతుంది.
శని దోషం తో బాధపడేవాడు హనుమంతుడికి శనివారం పూజ చేస్తే తప్పకుండా శని ప్రభావం తగ్గుతుంది. కొందరు ఏడున్నర ఏళ్ళ శని దోషంతో బాధపడుతుంటారు అలాంటి వారు శనివారం రోజు మాత్రమే ఆంజనేయ స్వామి కి పూజ చేయాలి. మిగతా వారు మంగళవారం, గురువారం మరియు శనివారం ఏ రోజులో అయిన పూజ చేసుకోవచ్చు. పురాణాల ప్రకారం శని దేవుడు ఒకరోజు ఆంజనేయ స్వామి ని వశం చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఆంజనేయస్వామి శని దేవుడు ని తల క్రిందులుగా వ్రేలాడ దీశాడట , దీంతో శని దేవుడు వదిలిపెట్టమని అడగ్గా హనుమంతుడు ఒక షరతు పెట్టాడు. అది ఏమిటంటే తన భక్తులను పీడించనని మాట ఇస్తే వదిలేస్తా అని హనుమంతుడు అంటాడు.దీనికి శని దేవుడు సరే అంటాడు. అందుకే శని దోషం ఉన్నవారు హనుమంతుడికి శనివారం మాత్రమే ప్రత్యేక ప్రదక్షిణలు చేస్తారు.
హనుమంతుడు శని దోషాన్ని పోగొట్టడమే కాకుండా సంతానం లేని వారికి కూడా పూజలు చేస్తే సంతానాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా దెయ్యం పట్టిన వారికి కూడా దెయ్యాన్ని వదిలిస్తాడు. శని దోషం పోవడానికి మరియు ఆరోగ్యం మరియు ఇతర పనులు త్వరగా జరగాలని హనుమాన్ పై నమ్మకంతో , భక్తితో భక్తులు హనుమాన్ మాల వేసుకుంటారు. ఈ హనుమాన్ మాల భక్తులు 41 రోజుల పాటు వేసుకుంటారు. ఈ 41 రోజులు హనుమాన్ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ , ఒక పూట మాత్రమే బుజిస్తూ ఎలాంటి చెడు ఆలోచనలు ఆలోచించకుండా దేవుడిని మాత్రమే కొలుస్తారు. హనుమాన్ జయంతి రోజు హనుమాన్ కి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జిల్లేడు మరియు తమలపాకుల దండ తో అలంకరించి, చందనం పూసి, పూలు మరియు పండ్లను సమర్పించి , హనుమాన్ చాలీసా ని పారాయణం చేస్తారు. ఇలా చేస్తే శని దోష ప్రభావం తగ్గి , అంతా మంచి జరుగుతుంది.
హనుమాన్ పూజ అనంతరం ” లాంగూల స్తోత్రం ” పారాయణం చేస్తే ఎంతో మంచిది. పూజ అయ్యాక హనుమాన్ గుడి ముందు ఉన్న రావి చెట్టు కింద కూర్చుని ఈ మత్రాన్ని పారాయణం చేయాలి. మంగళ వారం నాడు ఉపవాసం ఉండటం వల్ల కుజుడు బలహీనంగా ఉండటం వల్ల జాతకం లో చాలా మార్పులు మరియు శుభ పలితాలు వస్తాయి. అంతేకాకుండా సుందరకాండ పారాయణం చేసి హనుమాన్ కి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే అన్ని కార్యాలయాల్లో విజయం వరిస్తుంది. శ్రీ రామ రక్ష స్తోత్రం చదవటం వల్ల దోషాలు తొలగిపోతాయి. ఎరుపు లేదా కాశయపు దుస్తులు ధరించి పూజ చేయడం వల్ల కుజ దోషం ఉంటే పోయి పెళ్లి కానీ వారికి త్వరగా వివాహం జరుగుతుంది.
క్రీస్తు శ 16 వ శతాబ్దంలో ఉత్తరభారత దేశంలో ఉత్తరప్రదేశ్ లో రాజపూర్ లో జన్మించాడు. తులసీ దాస్ శ్రీ రాముడు కి గొప్ప భక్తుడు. ఈయన రామచరిత మానసం ని రంచించాడు. తను రచించిన రామచరిత మానసం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. శ్రీ రాముడు భక్తుడైన తులసీ దాస్ ఈ హనుమాన్ చాలీసా ని వ్రాశాడు అని ప్రసిద్ధి. తులసీ దాస్ హనుమాన్ చాలీసా ని అవధి బాషలో రాశాడు అని నమ్ముతారు. చాలీసా అనే పదం చాలిస్ అనే పదం నుండి పుట్టింది. హిందీలో ఛాలిస్ అనగా 40 నలబై అని అర్థం. ఈ హనుమాన్ చాలీసా లో కూడా 40 శ్లోకాలు ధ్విపదులుగా ఉంటాయి. హనుమాన్ చాలీసా ని తెలుగులో ఎమ్ ఎస్ రామారావు అనువాదం చేశారు.
Hanuman chalisa pdf : హనుమాన్ చాలీసా