H3N2 influenza : ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటే ఏమిటి ?
ప్రస్తుతం ఇన్ఫ్లుయెంజా వైరస్ ( h3n2 influenza ) భారత దేశంలో ఒకరి నుండి ఒకరికి వేగంగా సంక్రమిస్తుంది. ఇన్ఫ్లుయెంజా అనేది ఒక రకమైన వైరస్ ఇందులో నాలుగు రకాలు ఉన్నాయి అవి ఇన్ఫ్లుయెంజా A B C D ఈ నాలుగు రకాలలో ఇన్ఫ్లుఎంజా A రెండు రకాలు అందులో మొదటిది ఇన్ఫ్లుఎంజా H3N1 మరియు ఇన్ఫ్లుఎంజా H3N2 వీటిలో ఇన్ఫ్లుఎంజా A ఫ్లూ చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం 2023 వచ్చిన వైరస్ ఇన్ఫ్లుఎంజా H3N2 ఇది ఇన్ఫ్లుఎంజా A రకానికి చెందినది.
ఇన్ఫ్లుఎంజా H3N2 రావడానికి కారణాలు:
సాధారణంగా ఋతువులు మారుతున్నపుడు కొన్ని వైరస్లు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అలాగే ఎప్పుడు కూడా సీతకాలం నుండి ఎండకాలనికి మధ్యలో వైరస్ వ్యాప్తి చెందుతుంది. కానీ దీని తీవ్రత మరి ఎక్కువగా ఉండడం కారణంగా ప్రజలు ఇబ్బందికి గురి కావడం జరుగుతుంది.
ఇన్ఫ్లుఎంజా వైరస్ ( h3n2 influenza ) రావడం ఇది మొదటి సారి కాదు కానీ అప్పటికి ఇప్పటికి ప్రజలలో ఇమ్యూనిటి తగ్గిపోవటం వలన కొందరిలో వైరస్ ని ఎదుర్కొనే శక్తిని కోల్పోయారు. కాబట్టి ఈ వైరస్ యెక్క వ్యాప్తి వేగంగా సంక్రమిస్తుందని వైద్యులు నిర్ధారించారు.

ఇన్ఫ్లుఎంజా లక్షణాలు :
మిగితా ఫ్లూ లు వ్యాప్తి చెందాక లక్షణాలు కనిపించడానికి 14 రోజులు అలా సమయం పడుతుంది కానీ ఈ ఇన్ఫ్లుఎంజా H3N2 సోకినప్పుడు కేవలం మూడు రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్స్ సూచిస్తున్నారు. ఇన్ఫ్లుఎంజా H3N2 ( h3n2 influenza ) సోకిన వారిలో మొదటగా కనిపించే లక్షణాలు.
1.అధికంగా జ్వరం రావడం.
2.విపరీతమైన ఒళ్ళు నొప్పులు రావడం
3.జలుబు.
4.దగ్గు
5.కొందరిలో విరోచనాలు మరియు వాంతులు.
6.ముక్కు కారడం
7.గొంతు నొప్పి, ఆహారం మింగినపుడు నొప్పి రావడం, గొంతు ఇన్ఫెక్షన్.
8.చలిగా అనిపించడం.
9.గుండె వేగంగా కొట్టుకోవడం.
10.ఊపిరి తీసుకోవడానికి యిబ్బందిగా అనిపించటం.
ఇన్ఫ్లుఎంజా H3N2 రాకుండా ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ఈ ఫ్లూ ఒక మనిషి నుండి ఇంకొకరికి వెంటనే వ్యాప్తి చెందుతుంది. కాబట్టి బయటికి వెళ్ళినపుడు మాస్క్ ధరించాలి. ఇతరులకు దూరం ఉండడం మంచిది మరియు బయటికి వెళ్లి వచ్చాక కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అంతేకాకుండా సానిటైజేషన్ చేసుకోవడం వలన ఎలాంటి క్రీములు ఉన్న నశిస్తాయి.
ఇన్ఫ్లుఎంజా H3N2 వచ్చిన వారు ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ఇన్ఫ్లుఎంజా H3N2 వచ్చిన వారు లక్షణాలు కనిపించిన వెంటనే ఐసొలేషన్ లో ఉండాలి. మీకు వచ్చిన లక్షణాలను డాక్టర్ కి వివరించి దానికి తగిన మందులను వాడుకోవాలి. ఈ వైరస్ తగ్గడానికి కొన్ని రోజులు లేదా వారం వరకు సమయం పడుతుందని వైద్యులు సూచస్తున్నారు. కాబట్టి వైరస్ పూర్తిగా తగ్గే వరకు ఓపిక ఉండి భయపడకుండా వైరస్ ను ఎదుర్కోవాలని దీని వలన బయబ్రాంతులకి గురి అయి ప్రాణాలు కొల్పోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.