Guava fruit benefits :
ఏ కాలం లో అయిన మనకు దొరికే పండులో ఒకటి జామకాయ ( guava fruit ). జామ కాయ మనకి ఏ కాలంలో అయినా దొరికింది. ఈ జామకాయ కి కాలం తో సంబంధం లేదు ఏడాది పోడువున కాస్తూ ఉంటాయి. జామ కాయ రుచి తీయగా ఉంటుంది కాబట్టి దీన్ని తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. దీన్ని ఇష్టపడటానికి దీని రుచి మాత్రమే కారణం కాదు దీంట్లో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి దీన్ని తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. అంతేకాకుండా జామ కాయల ( guava fruit benefits )ధర కూడా మార్కెట్ లో చాలా తక్కువ. ధర తక్కువ ఉండటం మరియు రుచిగా ఉండటం తో దీన్ని తినడానికి చాలా మంది ఇష్టపడతారు.
జామకాయ ని ( red guava ) డైరెక్ట్ గా కాకుండా దానికి కొంచెం మసాలా , కారం మరియు ఉప్పు జోడించి తింటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. బయట మనకు రోడ్ పక్కన చాలా చిరు తిండి బండ్లు దర్శనమిస్తుంటాయి. వాళ్ళు కూడా జామ కాయ కి మసాలా జోడించి అమ్ముతారు. ఇలా తినడానికి చాలా మంది ఇష్టపడతారు. జామ కాయ లని జెల్లీ మరియు జ్యూస్ ల తయారీలో ఎక్కువగా వాడుతారు. జామ కాయలు చాలా గట్టిగా విత్తనాలు ఉంటాయి. ఇవి తినేటపుడు కొంచం అసౌకర్యానికి గురిచేస్తాయి. వీటి రుచి కారణంగా మనకి అంత ఇబ్బంది ఉండదు. ఈ జామకాయ ( guava tree ) ఎక్కువగా ఉష్ణమల ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి.
Neutrients values in guava fruit : జామ కాయ లో పోషక విలువలు
జామకాయ లో ( guava fruit benefits ) చాలా పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ , లైకోపిన్ , కెరోటిన్ , ల్యుకిన్ మరియు ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీంట్లో విటమిన్ బీ కాంప్లెక్స్ , మెగ్నీషియం , కాఫర్, మాంగనీస్ , కాల్షియం , భాస్వరం , సోడియం , కొవ్వు మరియు జింక్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా దీంట్లో పాలి అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.
Guava fruit benefits : జామ కాయ తో ఆరోగ్య ప్రయోజనాలు
- గుండె ఆరోగ్యంగా మరియు పదిలంగా ఉండటానికి జామ కాయలు ఎంతో ఉపయోగపడతాయి. జామ కాయలలో రక్త పోటుని తగ్గించే గుణం ఉంటుంది. జామ కాయలు పొటాషియం మరియు సోడియం ఉంటాయి. అంతేకాకుండా జామ కాయ కి కొలెస్టరాల్ తగ్గించే గుణం కూడా ఉంటుంది. మన శరీరం లో చెడు కొలెస్టరాల్ ని తగ్గించి , మంచి కొలెస్టరాల్ స్థాయిని పెంచుతుంది.
- జామ కాయలో మంచి డైయేటరీ ఫైబర్స్ ఉంటాయి. డైయేటరీ ఫైబర్స్ మలబద్దకాన్ని నివారిస్తుంది. జామకాయలో ఎక్కువ శాతం పీచు పదార్థం ఉంటుంది. ఇది ప్రేగుల కదలికకి సహాయపడి , మలబద్దకాన్ని నివారిస్తుంది.
- జామ పండు లో విటమిన్ సి పుష్కలంగ ఉంటుంది. జామ పండులో నారింజ పండు కంటే ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా రక రకాల వ్యాధుల భారిన పడకుండా విటమిన్ సి మనల్ని కాపాడుతుంది.
- క్యాన్సర్ ఈ పేరు వింటేనే హార్ట్ ఎటాక్ వచ్చేంత భయం వేస్తుంది. అలాంటి క్యాన్సర్ ని రాకుండా జామ పండు మనల్ని కాపాడుతుంది. జామ పండులో లైకోపిన్ మరియు విటమిన్ , పాలిపెనాల్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తాయి.
- జామ కాయ షుగర్ పేషంట్స్ కి ఎంతగానో దోహదపడుతుంది. ఎందుకంటే జామ కాయలో అధికంగా ఫైబర్ మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. జామ కాయ తిన్న తర్వాత వెంటనే షుగర్ లెవెల్స్ పెరగకుండా చూస్తుంది. అందుకే జామ పండు తినడం షుగర్ పేషంట్స్ కి ఎంతో మంచిది.
- జామ కాయ లో బరువు ని తగ్గించే గుణం ఉంటుంది . ఎందుకంటే జామకాయ లో తక్కువ శాతం లో కొవ్వు పదార్థాలు ఉంటాయి. తద్వారా మన శరీరం లో కొవ్వు పెరగకుండా ఉంటుంది. అంతేకాకుండా చెడు కొవ్వు ని కరిగిస్తుంది.