HomeMovie ReviewsGandivadhari arjuna movie review : గాండీవధారి అర్జున సినిమా రివ్యూ

Gandivadhari arjuna movie review : గాండీవధారి అర్జున సినిమా రివ్యూ

Gandivadhari arjuna movie review :

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ” గాండీవధారి అర్జున ” ( gandivadhari arjuna movie ) ఈ రోజు ఆగస్ట్ 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమాలో హీరో గా మెగా హీరో వరుణ్ తేజ్ నటించారు. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా కథానాయికగా సాక్షి వైద్య పరిచయం కాబోతుంది. ఈ సినిమాలో ( Gandivadhari arjuna movie review ) నాజర్ మరియు విమలా రామన్ ముఖ్య పాత్రల్లో నటించారు. అంతేకాకుండా ఈ సినిమా లో మనీష్ చౌదరి, లావణ్య త్రిపాఠి, వినయ్ రాయ్, నరేన్, అభినవ్ , కల్పలత, నిక్కీ అతన్, రవి వర్మ , రోశిని , బేబీ వేద తది తరులు నటించారు.

ఈ సినిమాకి ( Gandivadhari arjuna movie review ) ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. చందమామ మరియు psv గరుడ వేగ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని అందించారు. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ముకేష్ మరియు ధర్మేంద్ర కాకరాల ఎడిటర్ గా పనిచేశారు. ఈ సినిమాని నవనీత్ నగన్ పిళ్ళై , బీవీఎస్ఎన్ ప్రసాద్ మరియు యోగేష్ సుధకర మాలినేని శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నిర్మించారు. యూ ఎస్ ప్రీమియర్ షో ముగిసిన తర్వాత ఈ సినిమా గురించి టాక్ బయటకు వచ్చింది. ఇప్పటికే ట్విట్టర్ లో ఈ సినిమా గురించి రివ్యూ లు పోస్ట్ చేశారు.

కథ : ( Gandivadhari arjuna movie review )
ఈ సినిమా లో నాజర్ హై ప్రొఫైల్ కలిగిన ఇండియన్ మినిస్టర్ గా పనిచేస్తారు. ఒక గ్యాంగ్ నుండి నాజర్ కి చంపేస్తామని బెదిరింపులు వస్తాయి. తనకి బాడీ గార్డ్ గా వరుణ్ తేజ్ ( అర్జున్ వర్మ ) ని నియమిస్తారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాడీ గార్డ్ గా పని చేస్తాడు. అర్జున్ వర్మ , నాజర్ ని కాపాడుతాడా …? లేదా కాపడలేకపోతాడా… ? శత్రువుల నుండి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటాడు…? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…!

పెర్ఫార్మెన్స్ :

ఈ సినిమా లో వరుణ్ తేజ్ నటన చాలా బాగుంది. కానీ స్పై థ్రిల్లర్ అంటే కథ కూడా అలాగే దానికి తగ్గట్టుగా ఉండాలి. ఈ సినిమా కథ చాలా సింపుల్ గా ఉంటుంది. యూ ఎస్ ప్రీమియర్ షో చూసిన ప్రేక్షకుల స్పందన మరియు ట్విట్టర్ రివ్యూ లు చూస్తుంటే ఈ సినిమా అంతగా ప్రేక్షకులని అలరించలేకపోయింది అని అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా స్లో గా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ ఒకటి బాగుంటుంది. ఎలాంటి ట్విస్ట్ లు మరియు అంతగా థ్రిల్లింగ్ సన్నివేశాలు చెప్పుకోదగ్గవి ఈ సినిమాలో లేవు. ప్రవీణ్ సత్తారు ఈ సినిమా ని తెరకెక్కించడం లో ఫెయిల్ అయ్యాడు అనే చెప్పుకోవాలి. చందమామ మరియు PSV గరుడ వేగ వంటి హిట్ చిత్రాలను అందించిన ప్రవీణ్ సత్తారు ఈ సారి ప్రేక్షకులని మెప్పించలేకపోయాడు.

ఈ సినిమా ద్వారా నూతన కథానాయికగా సాక్షి వైద్య ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. సాక్షి వైద్య తన నటన మరియు అందం తో ప్రేక్షకులని మెప్పించింది. నాజర్ , లావణ్య త్రిపాఠి , మనీష్ చౌదరి, వినయ్ రాయ్ , నరేన్, కల్పలత మరియు విమలా రామన్ తమ తమ పాత్రలకి న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంతమేరకు ఒకే అనిపించేలా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కూడా అంత పెద్దగా థ్రిల్లింగ్ సన్నివేశాలు చెప్పుకోదగ్గవి ఏమీ ఉండవు. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు అని చెప్పుకోవాలి.

సాంకేతిక విభాగం : ( Gandivadhari arjuna movie review and rating )

ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా కి సినిమాటోగ్రఫీ మరియు పర్వాలేదు అనిపించింది. ఈ సినిమాకి కథ నే చాలా మైనస్ పాయింట్ గా చెప్పుకోవాలి. ఈ సినిమా కి బిజియమ్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. కొన్ని యాక్షన్ సీన్స్ పర్వాలేదు అనిపించింది.

ప్లస్ పాయింట్స్ :

  • వరుణ్ తేజ్ నటన
  • నాజర్ మరియు సాక్షి వైద్య నటన
  • ఇంటర్వెల్ సీన్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

  • దర్శకత్వం
  • కథ
  • అవసరం లేని సన్నివేశాలు
  • ఫస్ట్ హాఫ్

తీర్పు : ఎప్పుడు వైవిధ్యమైన కథలని మరియు పాత్రలని ఎంచుకునే వరుణ్ తేజ్ ఈసారి మిస్టేక్ చేసినట్టే అనిపిస్తుంది. గాండీవధారి పస లేని యాక్షన్ మూవీ గా చెప్పుకోవాలి.

Telugusitara. Com gandivadhari arjuna movie review and rating : 2/5

RELATED ARTICLES
LATEST ARTICLES