foxtail millet in telugu :
ప్రస్తుతము మంచి ఆర్గానిక్ ఆహారం కంటే ఎక్కువగా పురుగుల మందులు కొట్టి పండించిన ఆహారాన్నే మనం ఎక్కువగా తీసుకుంటున్నాం. ఈ మధ్య చాలా మంది ఫాక్స్టైల్ మిల్లెట్స్ ( కొర్రలు ) చిరు ధాన్యాలను తినడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఫాక్స్టైల్ మిల్లెట్స్ ( foxtail millet in telugu ) తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రస్తుత కాలంలో అందరూ ఎక్కువ దిగుబడి ఎలా రావాలనే మాత్రం ఆలోచిస్తున్నారు కానీ వాటికి వాడిన పురుగుల మందులు మానవ శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది చాలా మందికి తెలీదు. పూర్వ కాలంలో అందరూ పెస్టిసైడ్ లేని ఆహారాన్ని తినే వారు అందుకే వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతికేవారు అంతేకాకుండా వారికి ఎలాంటి రోగాలు రాకపోయేవి. పూర్వ కాలంలో ఎక్కువగా అందరూ చిరు ధాన్యాలు తినేవారు. అందుకే వాళ్ళు చాలా హెల్తీ గా ఉండేవారు. పురుగుల మందులు కొట్టిన ఆహారం తీసుకోవడం చాలా ప్రమాదకరం.
చిరు ధాన్యాలలో ఫాక్స్తైల్ మిల్లేట్స్ ( foxtail millet in telugu ) ఒక రకం. ఫాక్స్తైల్ మిల్లేట్స్ 2 mm పరిమాణం లో ఉంటాయి. ఫాక్స్తైల్ మిల్లేట్స్ ని మన దేశం లో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఫాక్స్తైల్ మిల్లేట్స్ ని తెలుగులో కొర్రలు అని, హిందీ లో కంగ్ని , తమిళం లో తినై మరియు మలయాళం లో థిన అని పిలుస్తారు. ఫాక్స్తైల్ మిల్లేట్స్ ఎక్కువగా ఎత్తైన ప్రాంతాలలో పెరుగుతాయి. ఫాక్స్తైల్ మిల్లేట్స్ ని ఎక్కువగా మనదేశం లో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు మరియు మధ్యప్రదేశ్ లో పండుతాయి. ఫాక్స్తైల్ మిల్లేట్స్ ని ఆయుర్వేద మందుల తయారీలో కూడా వాడుతారు. మనదేశంలో కంటే పాశ్చాత్య దేశాల్లో ఫాక్స్టెయిల్ మిలెట్స్ ని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు.
ఫాక్స్తైల్ మిల్లేట్స్ లో పోషక విలువలు : Neutrients values in foxtail millet in telugu
కొర్రల్లో ఎక్కువగా ఐరన్ , కాల్షియమ్, మెగ్నీషియం, మాంగనీస్, థైమిన్ మరియు రిబోఫ్లవిన్ ఉంటుంది. అంతేకాకుండా కొర్రల్లో మాంసకృతులు మరియు అధిక మొత్తంలో పీచు పదార్థం ఉంటుంది.
ఫాక్స్తైల్ మిల్లేట్స్ ఉపయోగాలు : health benefits of foxtail millet in telugu ( korralu )
1.అధిక బరువుతో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు ఫాక్స్తైల్ మిల్లేట్స్ ని ( కొర్రలు ) తింటే శరీరంలోని చెడు కొలెస్టరాల్ స్థాయిని తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది.
2.ఫాక్స్తైల్ మిల్లేట్స్ లో ( కొర్రలు ) విటమిన్ బి 1 ఉంటుంది.ఇది అల్జీమర్స్ వ్యాధి అభివృద్ధిని అడ్డుకుంటుంది. అంతేకాకుండా ఏకాగ్రత మరియు జ్ఞాకశక్తిని పెంచుతుంది.
3.బెల్స్ పాల్సీ వంటి వ్యాధి తో బాధపడుతున్నవారు రోజు ఫాక్స్తైల్ మిల్లేట్స్ ( కొర్రలు ) తింటే చక్కటి పలితం ఉంటుంది.
4.కడుపు నొప్పి మరియు ఉదర సంబంధిత వ్యాధులకు ఫాక్స్తైల్ మిల్లేట్స్ తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
5.ఫాక్స్తైల్ మిల్లేట్స్ ( కొర్రలు ) తినడం వల్ల మూత్రంలో మంట మరియు అతిసారం సమస్యకు చెక్ పెట్టవచ్చు.
6.ఫాక్స్తైల్ మిల్లేట్స్ లో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
7.ఈ మధ్య చిన్న , పెద్ద అనే తేడా లేకుండా అందరూ నాడీ మండల వ్యవస్థ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కొర్రలు తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.
8.ఫాక్స్టైల్ మిల్లెట్స్ లో ( korralu ) ఐరన్ మరియు క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.కండరాల సమస్యతో బాధపడేవారు కొర్రలని తింటే చక్కటి పలితం ఉంటుంది.
9.షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు కొర్రలని ( korralu ) తింటే శరీరం లోనే షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది.
10.కొర్రలు ( korralu ) తినడం వల్ల మన శరీరములో రక్త ప్రసరణ ను నియంత్రించి , జీవక్రియను రేట్ ని మెరుగుపరుస్తాయి.